Friday, July 5, 2019

నీచ-4/7 ఉత్సాహవంతుడు


                             అస్తిత్వవాదసాహిత్యం-4:నీచ-4/7:
                          ఉత్సాహవంతుడు (Dionysian Man)



O, for a draught of vintage! that hath been
        Cool'd a long age in the deep-delved earth,
Tasting of Flora and the country green,
        Dance, and Provençal song, and sunburnt mirth!
O for a beaker full of the warm South,
        Full of the true, the blushful Hippocrene,...( Keats: Ode to a Nightingale)

   కీట్స్ కోరిన దక్షిణయూరప్ “వెచ్చని”  సంస్కృతి (“ warm South”,Provençal song, and sunburnt mirth!) నీచకు కూడా చాలా యిష్టం.చాలామంది కవులకు, వాన్ గో (Van Gogh) వంటి చిత్రకారులకు యిష్టమైన ప్రాంతం ఫ్రాన్సులోని యీ దక్షిణప్రాంతం. Provençe ఫ్రాన్సులో దే అయినా, Provençal అన్న పదం మరింత విస్తృతమైన (-ఫ్రాన్సు , స్పెయిన్, ఇటలీ- అన్న) అర్థంలో వాడుకలో ఉంది. జర్మనుల తాత్త్వికగాంభీర్యం నీచకు నచ్చదు. Provençal సంస్కృతి తనకు యిష్టమని తన ఉత్తరాలలో రాసుకున్నాడు నీచ.ముఖ్యంగా అక్కడి జానపదుల నటగాయకబృందాల (troubadours ) ఆటపాటలు అతడికి యిష్టం.తన రచన The Gay Science,సముల్లాసశాస్త్రం, ఆ స్ఫూర్తితో రాసిందే. Science కు ఉండవలసిన లక్షణం సముల్లాసమని (Gay) నీచ భావం. భౌతికశాస్త్రమే శాస్త్రం కాదు. నాట్యమూ శాస్త్రమే, నిజానికి జీవితాన్ని ఆనందమయంచేసే శాస్త్రం.)

                                                     ***

   సత్తుకు రెండు ముఖాలు, చిత్తు ఆనందము. అవి మనిషి మనసులో కుడి ఎడమలు. కాలచక్రంలో రెండు యుగాలు. ఏకకాలంలో  రెండు సంస్కృతులు. ఒక సంస్కృతిలో, ఒక దానికి అపోలో (Apollo) అధిదైవం; మరొకదానికి డయొనీసియస్ (Dionysius) అధిదైవం. యూరపులో  ఒకదానికి సోక్రటీస్, మరొకదానికి ఎపిక్యూరస్ ప్రవక్తలు.

  ఇది క్రీస్తుపూర్వవిషయం. క్రీస్తుశకంతో  శోకయుగం మొదలయింది అంటాడు నీచ. క్రైస్తవమతసందేశం  పాపము శోకము త్యాగము దాస్యము, అన్నది ప్రబలమైన అభిప్రాయం. “ఆనందంగా ఉండండి” (St.Paul:“Rejoice always.”1 Thessalonians 5:16) వంటి వాక్యాలు వినిపిస్తున్నా,  అవి శోకాన్ని అధఃకరించి, క్రైస్తవధర్మలక్షణంగా పైకి రాలేదు. వైదికధర్మంలోనూ పాపస్మరణ నిత్యమూ చేసేదే .“పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః” అని సంధ్యావందనసమయంలో నిత్యము స్మరించినా, పాపభావం యీ సమాజంలో ప్రబలం కాలేదు. ఇక్కడ ప్రాబల్యం “హే అమృతస్య పుత్రాః” అన్న ఉపనిషద్వాక్యానికే . క్రైస్తవమతజీవితంలో ఆనందం ప్రధానం కాదు. “శోకము దాస్యము జీవితంలో విధించబడినవి, కనుక వాటిని మనం గుర్తించి వర్తించడం విజ్ఞత”,  అనదు క్రైస్తవమతం . ఆ గుణాలను ఉత్తమమైన ఆదర్శాలుగా ప్రబోధిస్తుంది. ఈ క్రైస్తవనిరానందాన్ని నీచ నిరాకరిస్తాడు. వినయము విధేయత వ్యథ , యివన్నీ బలహీనులు తమ దౌర్బల్యాలను సుగుణాలుగా ఎత్తేయడానికి అనుసరించే విధానం అంటాడు . (గమనించ వలసింది ఏమంటే, బలవంతులు బలహీనులను తమ దాసులుగా చేసుకోవడానికి పన్నిన కుట్ర అనడంలేదు నీచ. బలహీనులు తమ బలహీనతలను గొప్పచేసుకోవడంలో, తమను తాము గొప్పచేసుకునే ఆశయం కప్పిపెట్టుకుంటారు, అంటాడు.”He who humbles himself wants to be exalted.” Nietzsche:Human all too Human.) ప్రాచ్యసంస్కృతులలో యీ వైరుధ్యం తక్కువ. ఐహికాన్ని కాదనకుండా  ఆముష్మికాన్ని పట్టుకునే మార్గం యిక్కడి సంస్కృతులు. ఆముష్మికం మాట ఎలా ఉన్నా, నీచ ప్రాచ్యంలోని యీ ఐహికప్రాముఖ్యాన్ని గుర్తించాడు. అందుకే తన నిరానందనిరసనకు ప్రతినిధిగా జారతూస్ట్రను, గ్రహించాడు. “జారతూస్ట్రఉవాచ” యీ ఆశావహ అరుణారుణ ఉషోదయంతో మొదలవుతుంది. …(“rising one morning with the rosy dawn, he went before the sun, and spake thus unto it…”: Zara.Pr.1.)

   సాధారణంగా ప్రవక్తలందరూ యిహం అశాశ్వతము తుచ్ఛము, పరమే పరమము అని ప్రవచిస్తూ వచ్చారు.దానికి విరుద్ధంగా  అస్తిత్వవాదం ఐహికజీవనామోదాన్ని చెబుతుంది. “పరమొ గిరమ్మొ దాని తలపైనొక దోసెడు మన్ను చల్లు”, (‘పానశాల’) అనగలగడం ప్రాచ్యంలో సాధ్యమైనట్టు పాశ్చాత్యంలో కాలేదు. ఈ ఐహికవాదం ప్రాచ్యసంస్కృతులలో అనాదిగా ఆముష్మికంతో కలిసిఉండినదే. నీచ జారతూస్ట్రను తన ప్రవక్తగా గ్రహించడంలో యీ ప్రాచ్యవాస్తవికతను గుర్తించడం తెలుస్తుంది. ఇక్కడ, యిహపరాలు “ఇదో/అదో” (Either/Or) కావు.వాటి మధ్య సమన్వయం ఉన్నంతగా సంఘర్షణ లేదు. (అయితే యీ సమన్వయం,  దర్శనంలో ఉన్నంత ఆచరణలో లేదన్నది వాస్తవమే. కనుక, యిక్కడకూడా సమన్వయం గుర్తుచేయగల ప్రవక్త అప్పుడప్పుడూ అవసరమవుతూనే ఉంటాడు.)

   నీచ అంటాడు, యింతకాలంగా యిన్ని విధాలుగా తాత్త్వికులు సృష్టికి  యిలా స్పందించారు కాని,సృష్టిని నిందించని తాత్త్వికుడూ ఒక్కడూ లేడా? ఈ సృష్టిలో ఆనందంగా బతుకవచ్చు అన్నవాడొక్కడూ లేడా? ఎప్పుడో తత్త్వశాస్త్రం పుట్టకముందు, ఎపిక్యూరస్ అన్నాడు. ఎపిక్యూరస్ గురించి సాధారణ అభిప్రాయం, “ తిను తాగు సుఖమనుభవించు” అన్నది అతని వేదాంతమని. ఇది అతని తత్త్వాన్ని గురించిన దుష్ప్రచారం,  వాస్తవం కాదు. వేదాంతి అంటే సోక్రటీస్ లా విషమో ఆముదమో తాగిన ముఖం వేసుకుని కూర్చునేవాడేనా? ప్రవక్త అంటే రక్తం ఓడుతూ శిలువమీద నిలిచేవాడేనా? జీవితమంటే శోకము దైన్యము దాస్యమేనా? ఏడుపు ముఖం యీడుపు కాళ్ళా? వేదాంతంలో నవ్వుపై నిషేధమా? జీవితంలో అంతా సుఖము సంతోషము అనడంలేదు నీచ. విషాదం ఉంది. ఆ విషాదాన్ని ఆనందంగా మలచుకోవలె అంటాడు.
నీచ జీవితాన్ని ఒక విషాదాంతనాటకంగా భావించమంటాడు. జీవితనాటకం ఎప్పుడూ మరణాంతమే కదా! అయితే,విషాదాంతనాటకం ఆనందరసానుభూతికి  అత్యంతము దోహదంచేస్తుంది. నాటకంలో నటులకు కథారచనలో స్వాతంత్ర్యం ఉండదు. కాని, కథలోని కష్టసుఖాలతో సంబంధంలేకుండా,నటిస్తారు. నటనలో ఆనందంపొందుతారు. (ఇది ప్రేక్షకులు పొందే క్షాళనంకాదు , Aristotelian catharsis ) జీవితాన్ని  కళాత్మకము రసమయము చేసుకుంటారు. మనిషి అలాగే జీవించాలి, అంటాడు నీచ.
    
  అయితే యింతకాలంగా వచ్చిన తాత్త్వికులందరికీ, ఆనందంగా జీవించడం సాధ్యమే అన్న ఆలోచన ఎందుకు కలగలేదు? వారందరిదీ ద్వైతదర్శనం. “నేను వేరు, యీ సృష్టి వేరు. దీన్ని వేరెవడో  సృష్టించి నా మీద ప్రయోగిస్తున్నాడు”, అన్నపుడు, కోపము, బాధ, నిరాశ కలుగుతాయి. నీచకు కలగక పోవడానికి కారణం, అతడిది ద్వైతదర్శనం కాదు.అతడు అద్వైతి.ఈ సృష్టి ఒక కల. నీ కల, (“నిజాంతర్గతం”),మరొకడి సృష్టి కాదు. నీ కల లోని కష్టసుఖాలు స్వయంకృతాలు, వాటికి వేరెవరో కారణం కాదు.

   ఇక నీచ అతిమానవుడిగురించి.నీచ పాశ్చాత్యాన్ని కాదు నిరసించింది, క్రైస్తవపాశ్చాత్యాన్ని.అంటే అతడు ఆకర్షించబడింది తూర్పు సంస్కృతికి కాదు. అతడు చూచింది ప్రాక్పశ్చిమభేదం కాదు, ప్రాచీన అర్వాచీన భేదాలు. వైవిధ్యాన్ని పొదువుకొన్న ప్రాచీనజీవితదృక్పథము, వైవిధ్యాన్ని దున్ని చదునుచేసే అర్వాచీనసాంకేతికతా మనస్తత్త్వము-  యీ రెంటిలో అతడు ప్రాచీనానికే మొగ్గుచూపాడు. కనుకనే, జారతూస్ట్రలో తను కోరుకున్న ఐహికం చూచినట్లే, డయొనీసియస్ లో కూడా తన ఆత్మను చూశాడు. తన రచనలను వీరిద్దరి ఆత్మ పరచుకొని ఉంది అని చెప్పవచ్చు.

   అసలు అతిమానవుడు అంటే ఎట్లా ఉండవలెనని, ఎట్లా ప్రవర్తించవలెనని నీచ అభిప్రాయం? అతిమానవుడంటే అతిలోకశక్తిసామర్థ్యం ఉన్నవాడు కాదు.స్వేచ్ఛగా ఆనందంగా మనిషిగా బతుకగలిగినవాడు. అంటే దుఃఖంలేని జీవితమా? దుఃఖంలేని జీవితం ఉండదు.ఉంటుందన్న ఊహే నిరాశావాదానికి ఆధారం. షోపెన్ హోవర్ నిరాశాదృక్పథానికి కారణం అతడికి దుఃఖం అనుభవంకాలేదు కనుక అంటాడు నీచ. గ్రీకులు నిరాశను నిస్పృహను ఎలా జయించారు? వారి విషాదాంతనాటకాలచేత. దుఃఖస్పర్శలేని జీవితాన్ని ఆశించడమే నిరాశకు నిస్పృహకు నిజమైన కారణం అంటాడు నీచ. ఈ దుఃఖానికి మందు దుఃఖమే. (“Well, the recipe against this "misery" is misery.”GS:48.ఇదేదో హోమియో వైద్యసూత్రంలాగా ఉంది.Similia similibus curantur ! ) మనిషి కోరుకోవలసింది దుఃఖంలేని జీవితంకాదు.బాధే సౌఖ్యమని భావించడమూ  కాదు.దుఃఖాన్ని జీవితంలో భాగంగా స్వీకరించవలె అంటాడు నీచ. సుఖదుఃఖాలకు అతీతమైనది ఆనందం. నీచ చెప్పేది యీ ఆనందం. రాజకీయనాయకులు మాత్రమే కాదు, నాయకులందరూ జనాలను మోసంచేస్తున్నారు యీవిషయంలో. దుఃఖం జీవితంలో భాగం అని చెప్పగలిగిన నాయకుడు లేడు. చెప్పగలిగినవాడు నాయకుడు కాడు,వాడు ప్రవక్త.

    పాశ్చాత్యదేశాలలో యీ ఐహికప్రాముఖ్యం లేనే లేదా? ఉండేది. సనాతన సంస్కృతులన్నీ,  ప్రాచ్యమైనా పాశ్చాత్యమైనా. అయితే అక్కడా యిక్కడ కూడా ఆముష్మికాదర్శం ప్రబలమవుతూ ఉంటుంది. వాస్తవానికంటే అవాస్తవిక ఆదర్శం జనాలను సైద్ధాంతికంగా ఆకర్షిస్తుంది. యూరప్ లో కూడా యిది జరిగింది. ఎపిక్యూరస్ రాతలకంటే సోక్రటీస్ మాటలకు ప్రచారం కలిగేది. ఎపిక్యూరస్ దైవం డయొనీసియస్, సోక్రటీస్ దైవం అపోలో. ఒకరిది ఆనందము, మరొకరిది జ్ఞానము. ఐహికాముష్మికసమన్వయం ప్రతియుగంలో  చేసుకుంటూనే సాగవలె. ఈ యుగంలో అది చేయటానికి ప్రయత్నించిన “ప్రతిప్రవక్త” ( Antichrist ) నీచ.

   నీచ దర్శించిన ఆనందమయజీవితస్వరూపం ఏమిటి? “తిను తాగు యథేచ్ఛగ సుఖమనుభవించు”, కాదు. సులభము సుఖమయము అయినజీవితం జీవితమే కాదంటాడు నీచ. నీచ మాత్రమే కాదు, అస్తిత్వవాదులంతా అదే అంటారు. (“సుఖజీవనం బానిసల ప్రత్యేకహక్కు.” కీర్క్ గార్డ్.”Easy life is the privilege of the slave.”) అన్నిసామాజికవర్గాలు ఆశించే, ఆశచూపే, సుఖజీవనం జీవనం కాదంటాడు నీచ. భద్రత కోరుతారు జనం. నీచ చెప్పేది అభద్రతలో ఆనందం. జారుడు మంచుపై నృత్యం చేయగలగడంలో ఉన్న ఆనందం సిద్ధంచేసిన రంగస్థలంపై ఉండదు.ఇటువంటి క్షణక్షణజీవితం మళ్ళీ మళ్ళీ (“eternal recurrence.”) జీవించాలన్న  కోరిక, అందులోని ఆనందం -యిది డయొనీసియస్ లో నీచకు నచ్చింది. అభద్రత , అభద్రతలోని వ్యగ్రత, జీవలక్షణం అన్నది అస్తిత్వవాదమూలమంత్రం. ఈ వ్యగ్రతకు ఒక్కొకరు ఒక్కొక పేరు పెట్టారు. కీర్క్ గార్డ్ ‘భయము’, నీచ ‘అభద్రత’, హైడెగర్ ‘ఆదిమభయము’ (primordial dread,angst) , సార్త్ర్ ‘వికారము’ (nausea)- యిలా పేర్లు పెట్టుకున్నారు. ఒకే పదానికి పర్యాయపదాలే అయినా, యివన్నీ వేరువేరు అని వాదించారు కూడా. కీర్క్ గార్డ్ భయము, తన భయము ఒకటికావని హైడెగర్ అంటాడు. హైడెగర్ భయము, తన వికారము ( Nausée ) ఒకటి కావంటాడు సార్త్ర్.ఒక్క విషయం గమనించవలసింది ఏమంటే, యివన్నీ బుద్ధినుండి (cognitive) మనసువైపుకు ( emotive,affective) మరలడం సూచిస్తున్నాయి. ఆలోచిస్తే ఏదీ అర్థంకాదు అని అర్థమయింది అస్తిత్వవాదులందరికీ. ఆలోచన ఆగితే కాని అర్థమవడం మొదలవదు. ఈ చిత్తవృత్తినిరోధం  హైడెగర్ లో ప్రధానవిషయంగా తెలుస్తుంది, “అవస్తువు”(Nothing.”) ఆవిష్కరిండంలో. (“Dread reveals Nothing.”:(Heidegger : “What is Metaphysics?”)

-సచేతనమాయ:

“జగత్తు మిథ్యంటావా? కానివ్వు. ఈ మిథ్య నాకు సచేతనం”, అంటాడు నీచ. (G.S.54.Consciousness of Appearance; “మమ మాయా”: గీత.7: 14.) తాడు పాముగా కనిపించడం సద్గుణమే. తాడు (సత్) ఉన్నది కనుక పాము కనిపిస్తోంది. అలాగే  కలలాంటి జీవితం కూడా.నీచ అంటాడు మాయయే సత్యం.మాయకంటే పరమైన సత్యం లేదు. పరాపరప్రకృతులు నేనే అన్నాడు కదా గీతాచార్యుడు. “...మే భిన్నా ప్రకృతిరష్టధా...అన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్…”7.4-5)

   “దృశ్యజగత్తు నాకు  సజీవము, వాస్తవము. ఎంత వాస్తవమంటే, “యిది కల, భ్రాంతి, నీడల నృత్యం మాత్రమే”, అని నాకు తెలిసిపోయేటంతగా  అది తనను తాను ప్రకటించుకుంటుంది. ఈ స్వప్నంలోని వాళ్ళలాగ నేనూ ఒక స్వప్నపురుషుణ్ణి, యిది కల అని తెలిసినవాణ్ణి, నేనూ వారితో కలిసి నృత్యం చేస్తున్నాను; కల అని తెలిసినవాడు కూడా  భూమిపై యీ కల కొనసాగడానికి కారణం.ఇలా తెలిసినవాడు, అస్తిత్వమనే ఉత్సవానికి ప్రయోక్తలలో ఒకడు.వ్యావహారికజ్ఞానంలోని యీ పారస్పర్యం, యీ విశ్వస్వప్నాన్ని నిలిపిఉంచడానికి, కలగనే అందరి పరస్పరావగాహనకు, కల కొనసాగడానికి   అత్యుత్తమసాధనం.” (G.S.54.Consciousness of Appearance).
   నీచ జగన్మిథ్యాత్వాన్ని కాదనడం లేదు.జగత్తు మిథ్యే.అయితే ఏమిటట? విశ్వం నీ కల.అందమైన కల.  నీ కల మరొకడి సృష్టి కాదు. నీ కల నీవే కంటావు.దానిలోని కష్టసుఖాలు స్వయంకృతాలు, వాటికి వేరెవరో కారణం కాదు. వేరెవరినీ నిందించలేవు. మనకు వెంటనే గుర్తు వచ్చేది “విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా…”. ఈ సృష్టి ఒక కల వంటిది.మన లోపలిది, “నిజాంతర్గతం”. మనకు తెలియని మన పూర్వవాసనలే దీనిని కల్పించాయి. ఈ సృష్టి వాడెవడో మనపై కసితో సృష్టించి మనపై విసిరేసిన దారుణాస్త్రం కాదు.  ఇది కల అని తెలిసికూడా, మనం కల కనవలసిందే, కలను కళగా భావించి.ఈ కల, కాంట్ ( Kant) అన్న ట్టు, ఒక తెర కాదు, తెర తొలగించి దాని వెనుక వాస్తవమేదో ( thing-in- itself) దర్శించడానికి. తెరమీదిదే వాస్తవం. జీవితం అశాశ్వతం అని తెలిసి, అభద్రతలో ఆనందంగా జీవించడమే నిరర్థకజీవితాన్ని సార్థకం చేసేది, అన్నది నీచ జీవితదర్శనం.

  నీచకు ఆరాధ్యుడు డయోనీసియస్ (Dionysius). ప్రాచీనకాలంలో గ్రీకులు ప్రకృతిలో కలిసిపోయేవిధంగా  నాటకాలు ప్రదర్శించి, ప్రకృతితో ఒకటైపోయేవారు. అటువంటి రసానుభవం నీచ భావించాడు. ఈ విధంగా జీవితాన్ని ఒక కళగా భావించినపుడు, ఆ ప్రదర్శనలోని సుఖదుఃఖాలు మనం సృష్టించుకున్నవే అవుతాయి. ఏ దేవుణ్ణీ నిందించవలసిన అవసరం ఉండదు. అప్పుడు “విధిరాత” మన రాతగా మారిపోతుంది. మనం రాసుకున్న నాటకం కష్టమైనా మనకిష్టమే. విషాదంకూడా రసానందమే. కళలో కష్టంకూడా యిష్టమవుతుంది.(నాట్యకళను ఒక యోగంగా భారతీయఆలంకారికులుకూడా భావించారు. సంగీతంకూడా ఒక అతిమానుషఆనందస్థితిని కలిగిస్తుందని నీచ భావించాడు. నీచ వేగ్నర్ సంగీతంలో సమ్మోహితుడైన కాలంలో సంగీతజ్ఞానము వినా సన్మార్గము కలదా అనుకున్నాడు.) ఆ రసానందస్థితిలో, సృష్టి సమస్తము ఆత్మలీల. జీవితంలో ఎవరియందు దేనియందు వ్యతిరేకభావం ఉండదు. మన విధి (fate)కి మనం కర్తలం, కనుక  మనం ప్రేమిస్తాం (amor fati, love fate) ).సణుగుడు అణగిపోతుంది.

   అతిమానవుడిగా ఎదగడం ఒక నర్తనం, అతిమానవవర్తనం.కాని, ఆ కళ ఎటువంటిది?  కత్తి అంచుమీద నడవడం లాంటిది. కలలు, కలలో కల్లోలము ఉండాలి. “నీ కలల కల్లోలంలో నుండి మాత్రమే  ఒక తార నాట్యంచేస్తూ ఆవిర్భవించగలదు”, అంటాడు నీచ. జీవితం కత్తి అంచుమీద నడవడం ( “క్షురస్యధారా” ) అనడు నీచ.కాని, రెండు కొండకొమ్ములను కలుపుతూ కట్టిన తాడుపై  నడవడం వర్ణిస్తాడు(rope dancer: Z: Pr.3). ఆ కళాత్మకజీవితంలో అడుగడుగున నీ కాళ్ళ కింద ఒక అగాధం నోరు తెరచుకొని ఉంది. ఆ తాడుమీద లయాన్వితంగా అడుగులు వేయగలిగినవాడే అతిమానవుడు.

నీచ దర్శించిన అతిమానవుడులో ప్రధానలక్షణం లయ.తాంత్రికులభాషలో కూడా యీ లయ రెండు అర్థాలలో  కనిపిస్తుంది.కుండలినీశక్తిని మూలాధారంనుండి సహస్రారానికి , జీవుణ్ణి శివుడివద్దకు, మానవుణ్ణి అతిమానవస్థితికి, లయాన్వితంగా నడిపించడం చెబుతారు, (”నీత్వా తాం కులకుండలీం లయవశాజ్జీవేన సార్థం హృది…”: “షట్చక్ర నిరూపణం”.)  

నీచ చెప్పిన అతిమానవుడు నాట్యంచేయగల నేర్పు సాధించినవాడు. ఎక్కడ ? రంగస్థలంమీద నాట్యం నేర్పు కాదు, జారుడు మంచుపై నాట్యంలో నేర్పు.

“నర్తకులకు:

జారుడు  మంచు
స్వర్గం,
నేర్చిననర్తకులకు.”  (13.GS. నా అనువాదం: “సముల్లాసశాస్త్రం”)  

అనుక్షణం ఆనంద తాండవం చేసే దేవుణ్ణి మాత్రమే నేను నమ్ముతాను, అంటాడు నీచ. ( “I would only believe in a God that knows how to dance.” Zarathustra Part I, Chapter 7)

  ఇదీ, నీచ నిరీశ్వరనైరాశ్యంలోని చిదంబర రహస్యం.కైలాసశిఖరం కొండకొమ్ముపై  ఒళ్ళుమరచి ఆనందంగా నృత్యం చేయి. పాదం తడబడితే పాతాళంలో పడిపోతావా? భయమెందుకు? అదీ శివమే. “ఆపాతాళ నభస్స్థలాంత భువనబ్రహ్నాండ”మంతా శివమయమైనవాడికి భయమెందుకు? భద్రత దేనినుండి? అభద్రతే జీవితం.(“Vulnerability is what life is.”J.K. “Commentaries on Living” ).అభద్రతే ఆనందం.

   జారుడుమంచుకొండకొనపై,అభద్రతాశిఖరంపై,  నాట్యంచేయగల నటరాజు నీచకు దేవుడు. ఎవరన్నారు, “దేవుడు మరణించా”డని (“ God is dead.”)?

                                                 ***


Monday, July 1, 2019

Vadrevu Chinaveerabhadrudu on my Shakespeare Essays

నాషేక్స్పియర్వ్యాసాలపై 

వాడ్రేవుచినవీరభద్రుడు:

1.పెరిక్లీస్2.టెంపెస్ట్3.మేక్బెత్4.కింగ్లియర్5. ఒథెలో6. హేమ్లెట్


నేనుసాహిత్యాన్నిప్రత్యేకంగురువుదగ్గరాఅభ్యసించలేదుజీవితంఅట్లాంటిఅవకాశంనాకివ్వలేదుఅందరిలానేతెలుగుకూడాఒకసబ్జెక్టుగాఇంటర్మీడియేట్దాకాచదువుకున్నానుగానిప్రత్యేకంఒకకావ్యమోకావ్యపాఠమోఎవరిదగ్గరాచెప్పించుకోలేదుకానినాకుఒకరుకాదుఅనేకమందిగొప్పగురువులసాంగత్యంసాన్నిహిత్యంలభించిందిఏదోఒకరీతినవారిశుశ్రూషచేసుకోవడంద్వారాకొద్దోగొప్పోసాహిత్యప్రపంచంలోకినాకొకప్రవేశంలభించిందిరాజమండ్రిలోఉన్నకాలంలోశరభయ్యగారితోగడిపినసాయంకాలాల్లోఆయనఏంచెప్పినానాచెవులుదోసిటపట్టిమరీవినేవాణ్ణిరోజుల్లోఆయనఎక్కడమాట్లాడినాసదనంగౌతమీగ్రంథాలయంవిక్రమహాలుఆర్ట్స్కాలేజి-ఎక్కడమాట్లాడినాపోయివినేవాణ్ణివాల్మీకివ్యాసుడు,కాళిదాసు,కవిత్రయంశ్రీనాథుడుప్రబంధకవులు-వారందరిమీదాప్రతికవిమీదాకనీసంఒకప్రసంగమేనావిన్నాను.సుదర్శనంగారితోగడిపినకాలంకూడాఅట్లాంటిదేఆయనప్రసంగాలుకూడాఅట్లానేపోయిముందువరసలోకూచునివినేవాణ్ణిఏదన్నామాట్లాడాలనిపిస్తేఇంటికిపోయేవాణ్ణివిసుగులేకుండాఆయనగంటలతరబడిమాట్లాడేవారుఇకఆధునికతెలుగుసాహిత్యంనవలముఖ్యంగాకథగురించిభమిడిపాటిజగన్నాథరావుగారికినేనూమాఅక్కాజీవితకాలంఋణపడిఉంటాంమాకుతెలుగుకథలగురించిచెప్పడమేకాకమాతోకథలురాయించారాయనహీరాలాల్మాష్టారుసి.వి.కృష్ణరావుగారుమందేశ్వరరావుగారుడా.యు..నరసింహమూర్తి-పొద్దున్నేతలుచుకోవలసినమహనీయులునాజీవితాన్నిసుసంపన్నంచేసినవారుమరికొందరున్నారు.

ఇదంతాఎందుకురాస్తున్నానంటే,సాహిత్యంపేరుచెప్పి  ఎవరేనానాకుతారసపడ్డప్పుడునేనుఅతడినుంచిఏమినేర్చుకోగలనాఅనిచూస్తానునాకుతెలియనిసాహిత్యలోకాలేవైనాఅతడుచూసాడానాకుచూపించగలడాలేకనాకుతెలిసినలోకాలమీదనేఅతడేదైనాకొత్తవెలుగుప్రసరింపచేయలడాఅనిచూస్తానుఅతడిఅంతరాంతరజ్యోతిస్సీమల్నివెతుక్కుంటానుమూడవవ్యక్తినోకవినోకథకుడినోద్వేషించడందూషించడంకాకుండామేంకలిసికూచున్నకొద్దిసేపూనాలోకొత్తస్ఫురణలేమైనారేకెత్తించగలడాఅని  ఆశపడుతుంటాను.

చాలాఏళ్ళతరువాతఅటువంటిఒకమహనీయసాహిత్యవేత్తనాకుమాధ్యమంలోతారసపడ్డారుశ్రీసూరపరాజురాధాకృష్ణమూర్తికిమనంసమకాలికులంకావడంమనఅదృష్టమనిభావిస్తానునేనుఎటువంటిసాహిత్యవేత్తకోసంఅన్వేషిస్తుంటానో,అటువంటిసాహిత్యసహృదయుడుఆయనతూర్పుపశ్చిమసాహిత్యకృతుల్నిసాకల్యంగాచదువుకున్నవాడుసంస్కృతంలోసాహిత్యంమాత్రమేకాదుఉపనిషత్తుల్నీగీతనీచదువుకునివ్యాఖ్యానించినవాడుకవిత్రయాన్నిముఖ్యంతిక్కననిసంపూర్ణంగాచదువుకున్నవాడుఆధునికతెలుగుసాహిత్యంతోపాటుటాల్స్టాయినీడాస్టొవిస్కీకిర్క్గార్డుకాఫ్కాకామూలనుచదువుకున్నవాడుచదువుకున్నదాన్నిసమన్వయంచేసుకోగలిగినవాడుసాహిత్యసారాంశాన్నిరక్తాస్థిగతంచేసుకునిఅట్లాచేసుకున్నదాన్నిమాత్రమేతిరిగిమనతోపంచుకోడానికిఇష్టపడేవాడు.

ఆయనకిప్పుడుఎనభైరెండేళ్ళుఆరేడేళ్ళకిందటతనమనవడిదగ్గరకంప్యూటరుచూసిదాన్నెట్లాఆపరేట్చెయ్యాలోనేర్చుకున్నారుఅదిమనఅదృష్టంరెండేళ్ళుగాఆయనతనజీవితకాల  సాహిత్యసంపదనంతాదోసిళ్ళతోవిరజిమ్ముతున్నారు
43 పేజీలవ్యాసంఒక్కవ్యర్థపదంఅనవసరమైనఒక్కవిరామచిహ్నంకూడాలేనివ్యాసమదిసాహిత్యవిద్యార్థులేకాదుసాహిత్యవిమర్శకులుకూడాప్రతిఒక్కరూచదివిఅధ్యయనంచేయవలసినవ్యాసంఅదిఒకప్పుడుపుట్టపర్తినారాయణాచార్యులుగారుఒకమాటన్నారు. 'మనవిమర్శకులుటెక్స్ట్వదిలిపెట్టిచంక్రమణంచేస్తారుఅనిటెక్స్ట్నిఎలాచదవాలోటెక్స్ట్నిమాత్రమేఎందుకుచదవాలోవ్యాసంచదివితేతెలుస్తుంది

                                                   ***

Pericles :

మీరుఅనుభవామృతాన్నిఅనువదిస్తూవ్యాఖ్యానిస్తున్నసమయంలోప్రత్యభిజ్ఞగురించివివరించడానికినాటకాన్నిసన్నివేశాన్నిఎంచుకోవడంలోఎంతవిశేషముందిఇలాకదాచదవాలిసాహిత్యాన్నినేనుకూడాపెరికిల్స్చదివానుదివ్యసంగీతంవిన్నానుగానిఇంతస్పష్టంగాకాదుమీరుదివ్యసంగీతానికినొటేషనురాసిపెట్టారు.
Beautiful and more than beautiful!

                                                     ***


The Tempest :


ఇందులోమీరుచర్చించినఅంశాలుసమకాలికతెలుగుసాహిత్యలోకానికిఅర్థంకావాలంటేమేమంతాఎంతపరిశ్రమచెయ్యవలసిఉంటుందిఇందులోచాలావిలక్షణతలుఉన్నాయిమొదటిదిభారతీయసాహిత్యంతోదర్శనంతోతులనాత్మకతఅదిమీఅద్వితీయవిశిష్టతరెండవదిమార్లోతోపోలికఆద్యంతాల్లోపోలికనిముడివేసారువలసవాదంఇతరత్రాభావనలుమామూలుగాటెంపెస్టుపండితులుచర్చించేవేకానిమీరుశిక్షస్వేచ్ఛఅనేద్వంద్వంగురించినేర్వడంనేర్పడంఅనేద్వంద్వంగురించీకొత్తగాచెప్పారుటెంపెస్ట్అనేపేరునివివరించడంలోకూడాకొత్తఅంతర్దృష్టిఉందిఇదిషేక్స్పియర్చివరినాటకంకావటాన్నిమీరుమరింతహృద్యంగావివరించారు.చర్చించవలసిందిచాలాఉందిఅదినెమ్మదిమీద.ముందుగాఢానుభవాన్నిగట్టిగాలోపలకీఊపిరిపీల్చుకోనివ్వండి.
వ్యాసంచదివినతర్వాతనాకుగొప్పసాంత్వనకలిగిందితెలుగుసాహిత్యాన్నీ,మాధ్యమాన్నీనేనువదిలిపెట్టేసుకోవలసినఅవసరంలేదనిపించిందినామిత్రులుకూడానాలాంటిపిపాసులేననినమ్ముతూవ్యాసంలింక్ఇక్కడపొందుపరుస్తున్నానుతీరిగ్గాచదవండితీరికచేసుకునిచదవండిగతఇరవయ్యేళ్ళుగాటెంపెస్ట్నాటకంమీదఇంగ్లీషులోవచ్చినగొప్పవిమర్శచాలానేచదివానుకానిఇంతసమగ్రమైనవిమర్శఇంతసమన్వయపూర్వకమైనఅధ్యయనంనేనింతదాకాచదవలేదుమీరుచదవండిమీమిత్రులతోచదివించండి,మీపిల్లలతోచదివించండిమనంవిద్యావంతులమనిచెప్పుకోగలిగేదిఇటువంటిసాహిత్యానుశీలనచేసినప్పుడూఇటువంటిఅనుశీలనచదివినప్పుడూమాత్రమే.

                                                    ***
Macbeth: 

అద్భుతమైనపరిశీలనపాశ్చాత్యప్రపంచంఈర్ష్యపడదగ్గపరిశీలనఒకమనిషినిజమైనవిద్యావంతుడనిఎప్పుడుచెప్పగలమంటేఒకసాహిత్యకృతినిలేదాఒకకళాకృతినిఇలావివేచించినప్పుడుకేవలంవివేచనానందంతప్పమరోప్రతిఫలమేదీఆశించకుండాచేపట్టినప్పుడుఇదికదాజీవనసాఫల్యంఇటువంటికిస్థితికిచేరటమేకదామనంకోరుకోవలసింది!

ఇకకావలిదృశ్యంమీదరాసిందంతాగత500 ఏళ్ళుగానడుస్తున్నషేక్స్పియర్నాటకశిల్పచర్చను21 శతాబ్దంలోకీపొడిగించినరసచర్చమేక్బెట్ఒకస్వర్గాన్నికోల్పోయినమానవుడనీపారడైజ్లాస్ట్ఎక్కడమొదలయ్యిందోనాటకంఅక్కడికిచేరుకుందనీచెప్పడంమామూలుమామూలుపరిశీలనకాదుతనభార్యమరణించిందిఅనివిన్నప్పుడుమేక్బెత్ప్రతిస్పందననువివరించినతీరుభారతీయకావ్యానుశీలనాసంప్రదాయంలోపరిణతుడైనసహృదయుడుమాత్రమేచెయ్యగలచింతనఅసలుమొత్తంనాటకపరిశీలనమేఒకతులనాత్మకఅధ్యయనంనుంచివికసించిందనిమనంచెప్పవచ్చు.

మామాష్టారుశరభయ్యగారిపద్యాలుచదివిశేషేంద్ర"ఇంత'హృదయగ్రాహి'పద్యాలనుఇంతభయంకరకాలంలోకూడామనకుఇచ్చినశ్రీశరభయ్యనుఎంతగాహృదయానికిహత్తుకోవాలోమాటల్లోచెప్పలేను"అనిరాసాడుఇప్పుడువ్యాసంచదివాకమాటలేస్ఫురిస్తున్నాయి.

మేక్బెత్నాటకానికిఇంతదాకాతెలుగులోవచ్చినగొప్పవ్యాఖ్యానంబైరాగికవిత్వంమాత్రమే. After life's fitful fever Duncan sleepeth well అనేవాక్యాన్నిపట్టుకునిబైరాగిరాసిన'రంగులతోటగొప్పకవిత. 'జీవితజ్వరందహిస్తున్నదిదేహాన్నిఅనిమొదలవుతుందికవితవ్యాసంలోబేంక్వోప్రేతంతనకళ్ళముందుకుర్చీలోకూచున్నప్పుడుమేక్బెత్పలికినమాటల్నివ్యాసకర్తవివరించినతీరుమనసమకాలికుడైనఒకతెలుగువిమర్శకుడుమాట్లాడుతున్నట్టులేదుinsight నిబహుశాశ్రీరాధాకృష్ణమూర్తిగారుబ్రాడ్లీడోవర్విల్సన్వంటివారితోపంచుకుంటూఉంటేమనంపక్కననిలబడినోళ్ళువెళ్ళబెట్టివింటున్నదికదూ.

శ్రీరాధాకృష్ణమూర్తిగారుమేక్బెత్మీదరాసినవ్యాసంమీదమాట్లాడుకోవలసిందిచాలాఉందిమాధ్యమంలోనిజంగాచర్చించుకోవలసిందిఇటువంటిపోస్టులమీదకదాఇందులోచాలామౌలికమైనప్రతిపాదనలుఉన్నాయిమొదటిదిమేక్బెత్నిజంగానేవిషాదాంతకథానాయకుడేనాఅనేదిఅటువంటిప్రశ్నఇదేనేనుమొదటిసారివినడందానికివ్యాసకర్తఇచ్చినసమాధానమేమొత్తంవ్యాసంనాటకశిల్పంలో'అల్పాక్షరాల్లోఅనల్పార్థభావం'గురించిఇచ్చినప్రతిఉదాహరణాగొప్పగాఉందిముఖ్యంగాa few words. ఇకషేక్స్పియర్లోనిమానసికవాస్తవికతావాదం. 'Twas a rough night అనేమాటలకిచ్చినవివరణచాలాకొత్తగానూచాలానిండుగానూఉంది.ఇకఅన్నిటికన్నానాటకంలోస్థలకాలాలగురించినచర్చవివరణవ్యాసాన్నిశిఖరాయమానంచేసేసాయిపూర్వకాలంలోసాహిత్యగురువులుఇట్లాబోధించేవారనివిన్నాంఇప్పుడుకూడాఅటువంటిగురువులుప్రత్యక్షమయితే,అటువంటిశ్రోతలుకూడాచేరతారుబాగావిరిసినపువ్వుచుట్టూతేనెటీగలుచేరినట్టు.మేక్బెత్కూడాషేక్స్పియర్వంటినాటకకర్తకాగలడుఅనిచెప్పి,వెంటనేఇచ్చినఉదాహరణలోనాటకశిల్పపదజాలాన్నిఉదాహరించడంఅపూర్వప్రతిభ.

                                                         ****
King Lear:

'కథగానిజీవితంగానిసుఖాంతమాదుఃఖాంతమాఅన్నదికాదుప్రశ్నదేనికోసంజీవించావుదేనికోసంమరణించావుఇదేజీవితాన్నిసార్థకంచేసేదిదేవతలుహర్షించేది.'
-సూరపరాజురాధాకృష్ణమూర్తి

మరొకరసవితరణ

ఈసారికింగ్లియర్నాటకప్రశంస

ఇదికేవలంషేక్స్పియర్రాసినఒకమహావిషాదాంతనాటకపరిశీలనమాత్రమేకాదువైజ్ఞానికుడుసూక్ష్మదర్శినికిందఒకరక్తకణాన్నిపరిశీలిస్తున్ననెపంమీదసృష్టిరహస్యాన్నిఅన్వేషిస్తుండేలాంటిఒకఅన్వేషణఒకఇంగ్లీషునాటకాన్నిచదువుతున్నక్రమంలోప్రాచ్యపాశ్చాత్యసాహిత్యాన్వేషణనంతటినీమరొకమారుపునరధ్యయనంచేస్తున్నఒకఆలోకంసింహంలాంటిరసజ్ఞుడుమాత్రమేచెయ్యగలసింహావలోకనం.

ఇందులోఆశ్చర్యపరిచేపరిశీలనలతోపాటుఅపారమైనతేజోమయలోకాల్నిమేల్కొల్పగలవాక్యాలుకూడాఎన్నోఉన్నాయి

'శబ్దవిస్ఫోటనంలోగానిఅర్థంసాక్షాత్కరించదు.'

'బీజాక్షరమంటేఅర్థంమొలకెత్తనిశబ్దంశబ్దంసార్థకంకావడానికిదానినిజపించాలితపించాలి.'

'శబ్దంసార్థకం  కావడమంటేసోస్యూర్చెప్పినsignifier, signified గాపరిణమించడమే.'

'అప్పుడుతెలుస్తుందిమనకులియర్అడిగినప్రేమకేవలంతండ్రిగాకాదుప్రభువుగాకూడా.'

'శిల్పచాతుర్యంతోనాటకాన్నిమూడుఅంతస్తులలో..నడిపిస్తాడుఒకబండిలోనరకయాత్ర(inferno), మరొకబండిలోప్రక్షాళనలోకం(purgatorio), మరొకటిపరంధామం(paradiso)..ఒకభూమికలోఉన్మత్తత,మరొకభూమికలోఉన్మనీస్థితిఒకభూమికలోమరణంమరొకభూమికలోఅమృతత్వంఒకభూమికలోవిషాదంమరొకభూమికలోఆనందంఒకటికాదనిమరొకటికాదురెండూకలిసినఒకేసత్యం.'

''చూపునాటకంలోఅడుగడుగునాఅడ్డుతగిలేరూపకం.'

'డ్రామాఒకసప్రయోజనమైనభూతోచ్చాటనక్రతువు..'

'షేక్స్పియర్నుకవిత్వంఆవేశించదుకవిత్వాన్నిషేక్స్పియర్ఆవేశిస్తాడు.'

'లియర్అంతరంగమథనానికిఫూల్బాహ్యరూపం'.

'కింగ్  లియర్నాటకంలోవస్తువుమనిషిరాజుకావడంకాదురాజుమనిషికావడం.'

'అతడుతననాటకంనుండిమాత్రమేకాదుగృహస్థధర్మంనుండిబయటపడ్డాడుపరివ్రాజకబీజంఅతడిమనసులోనాటుకుందితరువాతనాటకమంతాలియర్బాలుడుఉన్మత్తుడుపిశాచము.'

'రాజుమనిషిగామనిషిపసివాడిగామారడంనాటకవస్తువులియర్అవధూతఅర్హతలుపొందాడు. 'బాలోన్మత్తపిశాచవత్.''

'లియర్ఇప్పుడుపూర్ణప్రజ్ఞావంతుడుఫూల్తనలోచేరిపోయాడులియర్కోర్డీలియాఫూల్ముగ్గురూఒకత్రయం.'

'లియర్  కోర్డీలియాలుమొదటిఅంకంతరువాతమానవభూమికపైలేరుదివ్యలోకంవైపువారియాత్రసాధనశోధనఅక్కడేమొదలయ్యిందికోర్డీలియాయాత్రముందుముగిసిందిఆమెదివ్యలోకపువెలుగైదిగివచ్చింది.'

'నాటకంఒకఅంతస్తులోThe Tragedy of King Lear మరొకఅంతస్తులోThe Divine Comedy..నాటకంలోవిషాదంఆనందంగాపరిణమించడమోపర్యవసించడమోకాదురెండూరెండుభూమికలలోసత్యం.'

'ఇప్పుడతడుమాతృమూర్తిఅతనిచేతులలోనిబిడ్డరక్తమాంసాలప్రసాదం, (the body and blood of Christ). పృథివికినవవసంతం. Spring with my tears.'

ఇంకఎత్తిరాయలేనుఅలారాస్తూపోతేప్రతిఒక్కవాక్యంరాసుకుంటూపోవాలికానిచివరివాక్యాలుబిగ్గరగాచెప్పవలసినవాక్యాలు:

'కింగ్లియర్నాటకాన్నిఎలాచదవాలికెంట్రాసినఉత్తరంకోర్డీలియాచదివినట్టు...Sunshine and rain at once: her smiles and tears. దుఃఖాశ్రువులుఆనందబాష్పాలుకురిసినఅనుభవం.'

అందరికన్నాముందుఇదిషేక్స్పియర్చదువుకోవలసినవ్యాసం.

చదవండివ్యాసంమొత్తంచదవండివిశ్లేషణదగ్గరపెట్టుకునికింగ్లియర్మరోసారిస్వయంగాచదువుకుందాంమనపిల్లలతోచదివిద్దాం.

                                                           ***


Othello:


ప్రతిక్రతువూఒకప్రతీకాత్మకపశువధపశువుబయటిపశువుగాఉంటూనేలోపలిపశువునికూడాసంకేతించడంలోంచేపురాణగాథలుపుట్టుకొచ్చాయిపశువుఒకటేపశువైతేమినోటారు,  దానికిపదిముఖాలుంటేరామాయణంవందముఖాలుంటేభారతం

పురాణగాథలేరానురానుకథలుగాకావ్యాలుగానాటకాలుగావికసిస్తూవచ్చాయిఒకనాటకంరాయడంలోరచయితతనసమాజంతరఫునఒకప్రతీకాత్మకపశువధకుపూనుకుంటాడునాటకాన్నిప్రదర్శిస్తున్నప్పుడుసామాజికులురెండురకాలఅనుభూతికిలోనవుతారుపశువుబయటిప్రపంచానికిసంబంధించిందిఅనుకుంటేపశువధఒకవీరగాథగాఒకఉత్సవంగాపరిణమిస్తుందిఅదిమోదాంతంఅలాకాకపశువుమనలోపలిపశువుఅనుకుంటేఅదిఎంతోనిర్వేదంతోనూభయకారకంగానూఅదేసమయంలోకరుణాస్పదంగానూఉంటుందిఅదివిషాదాంతమేగానిక్రమంలోమనఅంతరంగాన్నిప్రక్షాళనచేస్తుందికాబట్టిఅత్యంతమానవీయం

ఇవన్నీమీకుతెలిసినవేమళ్ళీరాయవలసినపనిలేదుకాని, SRK Moorty గారుఒథెల్లోనాటకంమీదరాసినవ్యాసంచదివాకనిన్ననాకుకొత్తగాఅర్థమయిందేమంటేఒకనాటకంచూడటమేకాదునాటకంమీదవిమర్శచదవడంకూడాఒకపవిత్రక్రతువేననిఎందుకంటేనాటకాన్నైనాప్రదర్శించడమంటేదాన్నిఒకనటబృందంమళ్ళాకొత్తగాinterpret చెయ్యడంఅలాగేఒకరసజ్ఞుడునాటకంలోప్రతిపాత్రలోనూతననితానుచూసుకుంటూతననితానుశోధించుకుంటూనాటకాన్నివ్యాఖ్యానించడంకూడాinterpret చేయడమేఇదికూడాఒకప్రదర్శననేమనోయవనికతొలగించిరసజ్ఞుడుఅంతరంగరంగస్థలంమీదనాటకాన్నిసరికొత్తగాప్రదర్శించడమే.


ప్రతికొత్తవ్యాఖ్యానంతోనూ, Suraparaju Radhakrishnamoorthy  గారుమిత్రుడుఆదిత్యఅన్నట్లుగాతానుఅంతదాకాఅధిరోహించినఎత్తుల్నితానేఅధిగమిస్తున్నారు

చూడండిఎటువంటివాక్యాలుఎటువంటిఅంతర్దృష్టి

__________________

'నాలుగుగోడలమధ్యకథఅనుకున్నదిగోడలులేనినాటకంఅయింది.'

'ఒథెలోకేవలంనలుపుతెలుగునాటకంగామిగిలిపోయిందిరెంటిమధ్యలోకోపంలోకొన్నికాలిపోయాయికన్నీళ్ళతోకొన్నికారిపోయాయి.'

'నాటకకథాప్రారంభమేతల్లకిందులుగాఉంది.'

'ఒథెలోనాటకంలోభూతప్రేతపిశాచాలులేవుకనీసంఆకాశవాణికూడాలేదుకథమొత్తంనేలమీదనడుస్తుందిఇందులోదయ్యాలుమనిషిలోచేరిపోయాయిమానవరూపాలలోకథనునడిపిస్తాయి...ఫాస్టస్నుమెఫొస్టాఫిలిస్నడిపించినట్టు.'

'షేక్స్పియర్రచనల్లోఒకమాటగానిఘటనగానిస్వప్నధర్మాన్నిఅనుసరిస్తాయిఅంటేకావ్యరచనస్వప్నరచననుఅనుకరిస్తుంది.'

'నాటకంలోపాత్రనైనాతెలుసుకోవలనంటేఇయాగోనుఆశ్రయించాలిఎందుకంటేఅతడేనాటకంరాసినషేక్స్పియర్. '



నాటకంఒకసామాజికక్రతువుక్రతువుఅంటేఏమిటి నలుగురూఏదైనాపనికలిసిచేసేముందు,ఎలాచేయాలోఅభినయించుకోవడమేక్రతువుఒకప్పుడుఆదిమానవులుమర్నాడుపొద్దున్నవేటకిపోవడానికిముందురాత్రిమర్నాడుఎలావేటాడాలోనలుగురూకలిసిఅభినయించుకోవడంలోంచేఅన్నిరకాలకళలూఆరాధనాసంప్రదాయాలూపుట్టుకొచ్చాయిప్రతిక్రతువూఒకప్రతీకాత్మకపశువధపశువుబయటిపశువుగాఉంటూనేలోపలిపశువునికూడాసంకేతించడంలోంచేపురాణగాథలుపుట్టుకొచ్చాయిపశువుఒకటేపశువైతేమినోటారు దానికిపదిముఖాలుంటేరామాయణంవందముఖాలుంటేభారతం

పురాణగాథలేరానురానుకథలుగాకావ్యాలుగానాటకాలుగావికసిస్తూవచ్చాయిఒకనాటకంరాయడంలోరచయితతనసమాజంతరఫునఒకప్రతీకాత్మకపశువధకుపూనుకుంటాడునాటకాన్నిప్రదర్శిస్తున్నప్పుడుసామాజికులురెండురకాలఅనుభూతికిలోనవుతారుపశువుబయటిప్రపంచానికిసంబంధించిందిఅనుకుంటేపశువధఒకవీరగాథగాఒకఉత్సవంగాపరిణమిస్తుందిఅదిమోదాంతంఅలాకాకపశువుమనలోపలిపశువుఅనుకుంటేఅదిఎంతోనిర్వేదంతోనూభయకారకంగానూఅదేసమయంలోకరుణాస్పదంగానూఉంటుందిఅదివిషాదాంతమేగానిక్రమంలోమనఅంతరంగాన్నిప్రక్షాళనచేస్తుందికాబట్టిఅత్యంతమానవీయం

ఇవన్నీమీకుతెలిసినవేమళ్ళీరాయవలసినపనిలేదుకాని, SRK Moorty గారుఒథెల్లోనాటకంమీదరాసినవ్యాసంచదివాకనిన్ననాకుకొత్తగాఅర్థమయిందేమంటేఒకనాటకంచూడటమేకాదునాటకంమీదవిమర్శచదవడంకూడాఒకపవిత్రక్రతువేననిఎందుకంటేనాటకాన్నైనాప్రదర్శించడమంటేదాన్నిఒకనటబృందంమళ్ళాకొత్తగాinterpret చెయ్యడంఅలాగేఒకరసజ్ఞుడునాటకంలోప్రతిపాత్రలోనూతననితానుచూసుకుంటూతననితానుశోధించుకుంటూనాటకాన్నివ్యాఖ్యానించడంకూడాinterpret చేయడమేఇదికూడాఒకప్రదర్శననేమనోయవనికతొలగించిరసజ్ఞుడుఅంతరంగరంగస్థలంమీదనాటకాన్నిసరికొత్తగాప్రదర్శించడమే.

ప్రతికొత్తవ్యాఖ్యానంతోనూ, Suraparaju Radhakrishnamoorthy  గారుమిత్రుడుఆదిత్యఅన్నట్లుగాతానుఅంతదాకాఅధిరోహించినఎత్తుల్నితానేఅధిగమిస్తున్నారు

చూడండిఎటువంటివాక్యాలుఎటువంటిఅంతర్దృష్టి

'షేక్స్పియర్రచనల్లోఒకమాటగానిఘటనగానిస్వప్నధర్మాన్నిఅనుసరిస్తాయిఅంటేకావ్యరచనస్వప్నరచననుఅనుకరిస్తుంది.'

'నాటకంలోపాత్రనైనాతెలుసుకోవలనంటేఇయాగోనుఆశ్రయించాలిఎందుకంటేఅతడేనాటకంరాసినషేక్స్పియర్. '

'అర్జునుడివిషాదంవట్ఠిముసుగుఅనిభగవానుడుకొట్టేసాడనిమనకుతెలుసుఇయాగోలోధర్మభ్రష్టతవిషాదంకలిగించదువిద్వేషంరగిలిస్తుంది.'

'షేక్స్పియర్ఒక్కజాతిపక్షమువహించడు.అసహనంజాతిదైనాఅసహ్యం.'

'ఒథెలోస్వభావంలోఇయాగోఒకమూలదాగిఉండకపోతేఅంతటిధీరోదాత్తుడుఅలాపతనమవడు.'

'స్త్రీకిఅన్యాయంఎక్కడమొదలవుతుందిఆమెనుదేవతనుచేయడంతో...దేవతఅయినతరువాతశిలగామారడంఎంతోదూరంలేదు.'

'మొత్తంమీదనాటకంలోపురుషపాత్రలందరూమూఢులుమూర్ఖులుస్త్రీపాత్రలేఒక్కొక్కరుఒక్కొక్కవిధంగాసచేతనులుఒకరుత్యాగంఒకరుధర్మంఒకరుఋజుత్వంఆదర్శాలుగానిలిచిపోయారు.'

'ఎదురునిలిచినశక్తులుఎంతబలమైనవైతేఎదిరించినవ్యక్తిత్వంఅంతఉదాత్తమైఉన్నతమైనిలుస్తుందిఎంతఓడిపోతేఅంతగెలుస్తుందినిలుస్తుంది.'

'నాటకాలలోభావాలుపాత్రలవిఒకభావంమరొకభావంతోతలపడుతుందిభావాలకల్లోలంలోనుండిముందుహాలాహలంవస్తుందిహాలాహలమేనాటకవస్తువు.'

'స్వధర్మాన్నివదిలేసిపరధర్మాన్నిఆలింగనంచేసుకోడంలోఉండేవిషాదంచెబుతున్నాడుఎంతచిత్తశుద్ధితోపరధర్మాన్నిఅవలంబించినాజాతిధర్మంనిన్నుఎప్పటికీపరునిగానేచూస్తుంది,క్షణక్షణమూనీచిత్తశుద్ధినినిరూపించుకుంటూనేఉండవలెనీవువదలినాస్వధర్మంఎప్పటికీనిన్నువదలదురెండూనాటకంపేరులోనేచెప్పాడు, 'వెనిస్లోమూర్'. రెండుపేర్లకూఈనాడుఎన్నైనాపర్యాయపదాలుదొరుకుతాయి.'

'ఇందులోప్రధానఘర్షణకామవిషయం.' The beast with two backs.'..అవునువిడివిడిగాస్త్రీపురుషులుపశువులేకానిదాంపత్యంలోవీరురెండువీపులపశుపతికాంతాసమ్మిశ్రదేహం.'

                                                    ***


Hamlet :

'తీగలుతెంచినతుపానుతగ్గినతరువాతనేడు
తెలుస్తున్నదివిధ్వంసపురాలుటాకులపూలమధ్య
వేసినప్రశ్నఒప్పైనాప్రత్యుత్తరంతప్పేనని
ప్రత్యుత్తరంతప్పైతేవేసినప్రశ్నతప్పేనని..'

1980లోచదివానువాక్యాలుగోదావరిశర్మగారిదగ్గరతీసుకున్న'నూతిలోగొంతుకలులోంచిఅదిమొదలుఅశాంతికి

హామ్లెట్ఎవరుఅతడిసమస్యఏమిటి?

బుచ్చిబాబు'చివరకుమిగిలేదిఅగ్నికిఆజ్యంపోసిందిషేక్స్పియర్నుస్వయంగాచదువుకునిఅర్థంచేసుకునేసామర్థ్యంలేనివయసుఎవరిదగ్గరయినాపాఠంచెప్పించుకుంటేబాగుణ్ణుకానిఎవరుచెప్తారు

కానిఅటువంటిఉదారమనస్కుడుఆర్ఎస్.సుదర్శనంగారిరూపంలోలభించాడునాలాంటిమరొకనలుగురువిద్యార్థులకోసంఆయనవారంరోజులపాటురోజూసాయంకాలంగౌతమీగ్రంథాలయానికివచ్చిహామ్లెట్నాటకంమాకుపాఠంచెప్పారు.

మళ్ళాఇన్నాళ్ళకు, 34 ఏళ్ళతరువాతమరొకఆచార్యుడుఇదిగోపాఠంచెప్పడమేకాదుమనకోసంనోట్సుకూడారాసిఅందిస్తున్నారు.

తానుప్రసంగిస్తేనూపాఠంచెప్తేనూచాలదనిసవివరంగాఒకగైడురాసిపెడితేతప్పసరిపోదనిగుర్తించిననిజమైనfriend, philosopher and guide, సూరపరాజురాధాకృష్ణమూర్తి.

ఇదిషేక్స్పియర్నాటకాలమీదతనుఅనుశీలనలోచివరిదంటున్నారుఆయన ఇప్పటికే300 పేజీలపైచిలుకుదాటిపోయినపుటలు ఏమిచ్చిఋణంతీర్చుకోగలంమనం!

హామ్లెట్లోషేక్స్పియర్మానవజాతిరక్తచరిత్రనుతిరిగిరాసాడంటున్నారురాధాకృష్ణమూర్తిషేక్స్పియర్మాటల్నిఆయనకేఅన్వయిస్తూhe devised a new commission అంటున్నారునాటకంద్వారామానవభావావేశాలపర్యవసానాన్నిషేక్స్పియర్wrote it fair అనికూడాఅంటున్నారు

మాటల్నిరాధాకృష్ణమూర్తిగారిఅనుశీలనకుకూడావర్తింపచేయవచ్చు He devised a new commission and wrote it fair.

ఒకవేదాంతిఒకభారతీయసాహిత్యదార్శనికుడుహామ్లెట్నిచదివినపద్ధతిఇదిసుదర్శనంగారుకూడాఅద్వైతికాబట్టిఆయనరోజుహామ్లెట్గురించితనపాఠాన్నిమాటల్తోముగించారు:

there's a special
providence in the  fall of a sparrow. If it be now
'tis not to come, if it be not to come, it will be
now, if it be not now, yet it will be come: the readiness is all:..'

ప్రపంచంలోక్రీస్తుతర్వాతఅంతవిస్తారంగారాసిందిహామ్లెట్గురించేననిబుచ్చిబాబుఅన్నట్టుగుర్తురాధాకృష్ణమూర్తిగారుహామ్లెట్గురించిఎలానూరాస్తారనేఅనుకున్నాంకానిఏమిచెప్తారానాలుగువందలఏళ్ళసాహిత్యచర్చకుఅదనంగాఅన్నదేమాఉత్కంఠకానిఆయనరాసినవాక్యాలతోఅన్నిటికన్నాముందుఇంగ్లీషుసాహిత్యమేసుసంపన్నమైంది.

ముఖ్యంగానాటకంలోమూడుప్రతీకారఇతివృత్తాలున్నాయనిచెప్పడంఆద్యంతాల్లోనిప్రతీకారాలకిహామ్లెట్ప్రతీకారానికీమధ్యఉన్నతేడాచెప్తూహామ్లెట్దిఅహింసాత్మకప్రతీకారమనీఅతడిధార్మికస్వభావమేఅతణ్ణిహింసనుంచిపదేపదేవిముఖుణ్ణిచేస్తూవచ్చిందనీచెప్పినతీరునిస్సందేహంగాసరికొత్తది.

వ్యాసంమొదట్లోనివాక్యమేనన్నుచాలాసేపటిదాకాముందడుగువెయ్యనివ్వలేదు:

'హింసనునింపుకున్నపాశ్చాత్యసాహిత్యంహామ్లెట్తోఒకమానవీయమైనమలుపుతిరిగిందిహింసగర్జించినప్పుడల్లాచిరుదీపంచుట్టూఅరచేతులుఅడ్డంపెడుతుందిసాహిత్యం.'

అవునుఒకయురిపిడెస్Agamemnon నుంచిఒకHamlet నువేరుచేసేమహత్త్వమేమిటోఇప్పటికినాకుస్పష్టంగాబోధపడింది.

ఇదేఅనుకున్నాంమధ్యభారతీయసృజనకారుడువిషాదాంతనాటకమెప్పటికీరాయలేడనిఎందుకంటేఅతడిదృష్టిలోమానవవిషాదంలోకూడాఒకదైవానుశాసనంఉంటుందినాటకంమరణాంతమయినప్పటికీమంగళాంతమేఅతడిదృష్టిలోఅందుకనేఇప్పుడురాధాకృష్ణమూర్తిగారుహామ్లెట్నాటకాన్నికూడాఒకమంగళాశంసగామార్చేస్తేనాకుఆశ్చర్యమనిపించలేదు.

బహుశాతెలుగుజాతిఎప్పుడోఒకరోజుఆన్లైన్తాళపత్రాలుతిరగేస్తూతనకిస్వస్థతచేకూర్చేఔషధమొకటిఇక్కడుందనిగుర్తుపడుతుందనుకుంటాను.

                                                       ***