Sunday, June 30, 2019

Preparing for the Twenty-First Century: Book Review (Analyst)

Karna: the Modern Myth Of Good and Evil

Karna
( and The Modern Myth of Good and Evil)

        Myths held sway for millennia as the representations of a clash between good and evil, culminating in the victory of good over evil, of dharma over adharma.  The  view that is ruling today, has completely reversed the roles. What was dharma once has now changed places with adharma. Representatations of good are now unabashedly representations of evil. ‘ Do as Rama did,not as Ravana and his ilk’ is now openly totally reversed. One who abducts another's wife and forces her to submit to his venal desires,under the threat of of being  roasted live, is viewed as the man much wronged and reviled. One who kills  thousands of men and holds their widows as his sex slaves is a god to be worshipped. One who is willing to marry and rehabilitate those sex slaves is a dallying devil,  elevated by fanatics to the level of a deity! While it is hopeless to try to reverse this trend,we may try to see its academic merits.  And we shall do so with reference to the Mahabharata,and in particular to Karna in it.
          Kauravas are sticklers for the Vedic path in their worldly and other-worldly pursuits. They are all born out of accepted Vedic wedlock. They perform the Vedic rites enjoined on them very regularly and righteously. They have great respect for personal relationships, and respect for the elders.They have the utmost respect for the institution of marriage, and “paativratya” dharma.( The case of Gandhari blindfolding herself in deference to her eyeless husband is a glorious example of a devoted wife! )In every aspect the Kauravas stick to the scripturally sanctioned path. What about Karna, who is not a Kaurava by birth,but who has been adopted into their fold? Karna is the offspring of the Sun God,the very “ karmasakshi” , the witness to all the doings “ under the Sun.” Krishna,in his effort to win Karna over to the side of the Pandavas, appeals to his innate sense of dharma: ‘ you have attended on elderly Brahmins and thus you know the subtleties of Vedic dharma.’
(उपासितास्ते राधेय ब्राह्मणा वेदपारगा:।
तत्त्वार्थं परिपृष्टाश्च नियतेनानुसूयया।।
त्वमेव कर्ण जानासि वेदवादान् सनातनान्।
त्वमेव धर्मशास्त्रेषु सूक्ष्मेषु परिनिष्ठित:।।Udyoga.140.6-7.)
(‘నీవు వృద్ధజనోపసేవివి ధర్మసంవేదివి...’ఆం.మ.భా.)
So Karna’s awareness of and adherence to the Vedic dharma is acknowledged by no less than Krishna himself. And Karna returns this complement fittingly in a language that resounds in ritualistic language,referring to the impending battle as a great sacrificial ritual. ‘You,Krishna, are going to be the presiding priest ( upadrashta and adhvaryu) of this great sacrificial ritual;Arjuna’s bow would be the sacrificial ladle; the sounds made by the weapons of Arjuna would be the mantras; the war cries of Bhima would be the chanting of the priest(udgata);Yudhishthira would be the Brahma himself of this sacrifice performed by Duryodhana.’(Ibid.29-31.)Karna’s whole being is suffused with scriptural prescriptions.And he is a steadfast practitioner of the prescriptions. When Kunti decides to meet him and disclose the secret of his birth,she goes to meet him on the bank of the river Bhagirathi. There, she hears him , before she sees him. Karna  is chanting the Vedic hymns.And it is a voice filled with compassion,(“ghrininah”) and truthfulness.Facing east, his hands are lifted up in salutation to the rising sun.Kunti  waited for him to finish his rite.
आत्मजस्य ततस्तस्य घृणिन: सत्यसंगिन:।
गड़.गातीरे पृथाश्रौषीद् वेदाध्ययननिस्स्वनम्।।
प्राड.मुखस्योर्ध्वबाहो: सा पर्यतिष्ठत पृष्ठत:।(Ibid.144.27-28.)
Karna’s response to both Krishna and Kunti is that he cannot now claim to be a Kshatriya,as his birth “rites” were performed as for the son of a  ‘suta’,a mixed caste.Such is his inviolable faith in the Vedic rituals. Brahmanas are the repositories of the Vedic dharma, and Karna holds them in high esteem. It is too well known that he would give away anything to a Brahmana. One need not be a Brahmana.A Brahmana disguise is as good for him. And it is too well known that Indra played on this sentiment to rob him of his precious protective sheath.
      Compared with this, where do the Pandavas stand? Their births,their marriage,their truthfulness,(uttering untruths whenever it suits them), their meanness ( begging the enemy to reveal how he could be killed)—all these represent not only a violation of dharma, but a violation of the basic code of conduct.
       Do we then conclude that the Mahabharata represents a clash between the dharma of Kauravas and the adharma of Pandavas? This would be a surface look at the reality of things. Rituals, the holiness of personal relationships, the sanctity of the institution of marriage,respect for elders honor,valor, and yes even truthfulness,--all these are indeed great virtues. Pandavas too realize and recognize them as such. But these virtues are subordinate and subservient to a higher law. These values are to be dispensed with when the issue is not one of fighting for personal gain or glory,but for a right social order. We shall come to this a little later.But let us return to Karna.
      It is a widely held view that the Mahabharata would be insipid and meaningless without the character of Karna. How far is it true? Is Karna such a tall crucial figure in the epic? The truth is that much of this popular feeling is sustained by the pity his birth and its consequences evoke in the readers. It is quite commonplace to observe that no other character in the Mahabharata has suffered so badly at the hands of Fate. Fate no doubt has been cruel to him.He is the result of a rape of a young unmarried woman. A divine rape,no doubt by no less than the Sun God. But a rape is a rape,with all its stigma and trauma of a lifetime, not just for the woman but for the resulting child as well. Karna is a victim of this trauma.He is abandoned by his mother, even before he opened his eyes to the world.He is deprived of his rites, and rights, of birth.  True. But does he suffer more than the other children of Kunti do? His suffering is indeed nothing compared to what the Pandavas suffer. As little children, Pandavas are orphaned, and abandoned on the distant hill  jungles,left in the care of a helpless widowed mother . The hermits bring them to Hastina,and stand them in the royal court. The children are too young to know fear,but old enough to sense the unwelcome behind the welcome. They can feel their insecurity in a  land once ruled by their father. They live under continued threats to their lives. As children still, they are exiled. They survive poisoning and arson. For fear of life,they live in disguise, and beg for their daily food.As to the stigma of their births, they are more ridiculous than the birth of Karna. Their marriage is preposterous, and the whole world keeps taunting them for it.The rightful owners of the kingdom are abegging on the streets. Their woman was disrobed in full public view under their very nose in a kingdom of which she was the empress a few minutes ago. What is it that the other children of Kunti do not suffer, and Karna has? Nothing. His life in comparison, is smooth,comfortable and he ought to be contented. But Karna is not contented.
      Pandavas are never ashamed or apologetic about their illegitimate births,or about their absurd marriage. They couldn't care less for the opinion of the world. It is not shamelessness. It is total absence of ego. Karna is always attempting to escape from himself, from his low-caste image.And the more he tried to escape, the more cursed is his life. It is commonly observed that curses undid Karna. ( Curses turn boons for Pandavas. ) But the worst curse of Karna is what he gave to himself,his friendship with Duryodhana. The friendship is the result of his fierce desire to find an identity. The more fiercely he seeks his identity,the more hopelessly does he lose it. The million gifts he gives away depend on the one gift he bartered with,his loyalty to Duryodhana. The noblest gift he gives, the kavacha and the kundalas,of course is god-given. But the act of gifting it away betrays his vanity more than charity. Karna is a man with a burning shirt on him, and the more he tries to run away from himself, the worse the flame.
       Karna defeated himself before anyone did. He sees his doom and does nothing to change it .His replies  to Krishna and Kunti ,who tell him to cross sides,clearly betray a defeatist tone. ‘If Dussasana and Sakuni cross to the other side,then you may think of my doing so’,he said.That is where he belongs,not in others’ view,but in his own.
      Now let us look at the misunderstanding of the role of Pandavas, and the modern popular antipathy towards them. It is strange,that the antipathy towards Pandavas is more from those who actually have reason to empathize with them.Kauravas are in power.( Let us bypass the question of the legality of their claim to the throne.) They are the government, the establishment. And like every establishment,it seeks to entrench itself in power, and would not concede the space of a ‘pin head’.Let it be conceded that Pandu had no legal claim,(which of course is not true.)But he ruled the kingdom for a good time, and made digvijaya,conquering many lands, and expanding the Kuru kingdom. Can he not claim a bit of it for himself or for his children? Strangely, the section that argues that Pandu or his children have no claim,are those who cry  hoarse about the rights of the tiller of the land as against the legal landowner.
    Actually, Kauravas are the oppressive,autocratic,and abusive government,denying people their basic rights to an honorable life. It degenerated into a kingdom  of gamblers. Honest and truthful people are deprived of their wealth and driven into exile, and forced to live in cognito,as are those today who oppose the oppression of the governments are  driven underground. The  women are shamelessly openly disrobed and abused. Pandavas,patiently suffered and finally rose in rebellion against this oppressive abusive establishment.
     And it cannot be forgotten that Karna is on the side of the unjust establishment,faithfully and fanatically fighting for its cause.

(Karna commands pity. And enough of  space is given  for it in the epic,more so in the AndhraMahabharatam. The two stanzas of Tikkana on Karna's fall are among the most moving in the epic.)

చెఖోవ్ కథ : హోమ్

చెఖోవ్ కథ: హోమ్

వ్యాసకర్త:  సూరపురాజు రాధాకృష్ణమూర్తి

కథకు ప్రపంచసాహిత్యంలో ఒక విశిష్టరూపం కల్పించి దానిని ఉత్కృష్టస్థానంలో నిలిపినవారిలో చెఖోవ్ ప్రథముడు అంటారు. కథ రాయడం కవిత రాయడం వంటిదే. ప్రతి పదము సార్థకము సప్రయోజనము అయి ఉండవలె.అంటే, ఒక వాక్యమే కాదు, ఏ ఒక్క పదము తొలగించలేనిదిగా ఉంటుంది. ఒక శిల్పంలో, శిల్పం కాని రాతిని చెక్కి పడేసినట్లే, కథ చెక్కడంకూడా. ఆ శిల్పం చెఖోవ్ కథలలో పూర్ణరూపంలో చూడవచ్చు. సన్నివేశంలోగాని, పాత్రలవర్ణనలలోగాని, వస్తుప్రతిపాదనలోగాని ఏది అవసరమో అది మాత్రమే,ఎంత అవసరమో అంతమాత్రమే ఉంటుంది అతని కథలలో. ‘కథలో గన్ గోడకు ఉన్నది అంటే, కథ ముగిసేలోపల ఆ గన్ పేలవలె’అన్నది చెఖోవ్ ప్రసిద్ధ వాక్యం. ప్రస్తుతం ‘హోమ్’అన్న కథను చూద్దాం.

కథను యిలా చదవవచ్చు:

ఒక కథను కాని, కవితను కాని మరో సాహిత్యప్రక్రియను కాని ఆస్వాదించడమంటే సరి అయిన ప్రశ్నలడగడమే. ప్రతి వర్ణనను, ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని ‘ఇది కథలో ఏం చేస్తున్నది? దీని కథాప్రయోజనం ఏమిటి?’అని అడుగుతూ పోవడమే. వాటికి దొరికే సమాధానాలే కథార్థం. కనుక ప్రశ్నలడుగుతూ వెళదాం. అదే విశ్లేషణ. సమాధానాలు పాఠకుడు తనకు తానుగా పొందడంలో ఉన్న ఆనందమే నిజమైన సాహిత్యానందం. కథ స్థూలంగా కిందటి పోస్టులో చూశాం. మరి కొంత వివరంగా, మూడు భాగాలుగా చూద్దాం: ప్రవేశం, వస్తువు, ముగింపు. (ఇది కథకు యథాతథం అనువాదం కాదు. ముఖ్యభాగాలు, చిన్న మార్పులతో.)



ప్రవేశం

ప్రాసిక్యూటర్ సాయంకాలం యింటికిరాగానే, ఆయా ఆ రోజు వచ్చిన ఉత్తరము, న్యూస్ పేపరు ఇస్తూ, ఆయనతో ‘మీ పిల్లవాడు సిగరెట్టు తాగుతున్నాడు, ఈ రోజు చూశాను, మొన్న చూశాను.అతనితో మాట్లాడండి’అంటుంది. అది వినగానే ఆయనకు నవ్వు వచ్చింది. ఆ దివ్యశిశువు పెదాలపై సిగరెట్ ఎట్లా ఉంటుందో ఊహించుకుంటున్నాడు. ‘ఎన్నేళ్ళు వాడికి?’, అంటాడు. ‘ఏడేళ్ళు, ఇదేం పెద్దవిషయం కాదనుకుంటున్నారు. అంత చిన్న వయసులో పొగతాగడం మంచిది కాదు.ఆరోగ్యం చెడిపోతుంది. ఇట్లాంటి చెడు అలవాట్లు చిన్నవయసులోనే వదిలించాలి’, అన్నది. ‘వాడికి సిగరెట్లు ఎక్కడివి’, అని అడిగాడు . ‘మీ టేబుల్ సొరుగులో ‘,అంటుంది. ‘అయితే, వాణ్ణి నా గదికి పంపు’అంటాడు.

[ఈ భాగం, కథలోని పాత్రలను సన్నివేశాన్ని పరిచయం చేస్తుంది. ఈ భాగంలో ఎంత సమాచారం యివ్వవలెనో అంతే యిస్తాడు రచయిత. పిల్లవాడికి తల్లి లేదు. వాణ్ణి ఆయా చూచుకొంటోంది. తల్లి ఏమైంది? ఆ సమాచారం ఈ కథా భాగంలో అవసరం కాదు. మరో కథాభాగంలో దాని ఉపయోగం ఇక్కడికంటే ఎక్కువ. కనుక అక్కడే చెబుతాడు. అక్కడ కూడా ఎంత అవసరమో అంతే, వాక్యభాగంలో, పూర్తి వాక్యం కూడా ఉండదు. తల్లిలేని పిల్లవాడు, అన్నవరకే ఈ ప్రవేశ కథాభాగంలో అవసరం. పిల్లవాణ్ణి ఆయా చూచుకొంటోంది. తన కొడుకుకు ఎన్నేళ్ళు అని ఆయాను అడుగుతాడు. ఈ ప్రశ్న కథాప్రయోజనం ఏమిటి? ఆయా చెప్పిన మాటకు తండ్రికి కోపం రాలేదు, నవ్వు వచ్చింది. ప్రాసిక్యూటర్ దృష్టిలో, పిల్లవాడు సిగరెట్ తాగడం ఎక్కువ తప్పుగా అనిపిస్తుందా, తన టేబుల్ సొరుగులోనుండి తనకు తెలియకుండా తన సిగరెట్ దొంగిలించడం ఎక్కువ తప్పనిపిస్తోందా? ఈ ఎక్కువ తక్కువల ఆలోచన ఆయనకు ఎందుకు కలిగింది? కథలో దాని ప్రయోజనం ఏమిటి? ఆ ఆలోచన కలిగింది అనడానికి కథలో ఏ పదం ఆధారం? పిల్లవాడు దొంగతనానికి అలవాటు పడుతున్నాడు, మందలించండి అని చెప్ప లేదు ఆయా. ఇద్దరి దృష్టిలో ఈ భేదానికి ఏమిటి ప్రాధాన్యం?]

ఆయా వెళ్లిన తరువాత, ఆయన కొడుకును ఊహించుకుంటాడు. పెదాలమధ్య మూడడుగుల పొడుగు చుట్ట. వాడు పీల్చి వదిలిన పొగ మబ్బులై, వాడు ఆ మబ్బులపై కూర్చుని ఉన్నట్టు, కొడుకును తన ఊహలలో చూసుకుని మురిసిపోతున్నాడు.

కాని వెంటనే ఆయా ముఖం గుర్తొచ్చింది. ఆమె ఈ విషయం ఏమాత్రము తేలికగా తీసుకోవడంలేదు . నిజమే వెనుకటి రోజులలో సిగరెట్ తాగడం తెలిసి తల్లిదండ్రులు హాహాకారాలు చేసేవారు. టీచర్లు ఒళ్ళు వాతలు పడేటట్టు కొట్టి స్కూలునుండి తరిమేసేవారు. ‘కాని ఎవరికీ పొగతాగడంలో హాని ఏమిటో అది ఎందుకు తప్పో తెలియదు. అర్థంకాని దానిపై ఆగ్రహం ఉండడమన్నది సామాజికజీవన లక్షణమేమో? ఎంత అర్థం కాదో అంత ఆగ్రహం, అంత క్రూరమైన శిక్ష. మనుషులు ఎటువంటి పరిస్థితికి కూడా అలవాటుపడిపోతారు, అర్థంలేని ఆగ్రహానికి, అవసరంలేని అపరాధభావానికి, అపరాధాన్ని మించిన శిక్షకు.’

[ప్రాసిక్యూటర్ తన పిల్లవాడిని విచారణకు పిలిచి, వాడు వచ్చేలోపల ఈ విధంగా ఆలోచించడానికి కథలో ఏం ప్రాముఖ్యం? ఈ ఆలోచనలు తండ్రివా, ప్రాసిక్యూటర్‌వా?]



వస్తువు

రాత్రి ఎనిమిదవుతోంది. పై ఫ్లోర్ లో ఎవరో గదిలో ఇటునుంచి అటు, అటునుంచి ఇటూ, నడుస్తున్నారు.
ఆ పై ఫ్లోర్ లో ఇద్దరు పియానో నేర్చుకుంటున్నారు. గది బయట పిల్లవాడు ఆడుకుంటూ, ‘నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు’అని వాడిలో వాడు పాడుకుంటున్నాడు. ‘మీ నాన్న పిలుస్తున్నాడు, వెళ్ళు. నీకే చెప్పడం’, అని అరుస్తోంది ఆయా. లోపల, తండ్రి ‘ఏం చెప్పాలి వీడికి? ‘, అని ఆలోచిస్తున్నాడు. కొడుకు ‘గుడ్ ఈవినింగ్, నానా’, అంటూ వచ్చి తండ్రి ఒడిలో ఎక్కి కూర్చుని, ఒక తొందరముద్దు ఇచ్చాడు. ఆయన వాణ్ణి ఎత్తి పక్కన కూర్చోపెట్టి, ‘నేను నీతో ఒక సీరియస్ విషయం మాట్లాడాలి. తరువాతే ముద్దులు. నీవంటే నాకు ఇష్టం లేదు. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది.నీవు నా కొడుకువు కాదు’, అన్నాడు. పిల్లవాడు కాసేపు నాన్న ముఖంలోకి చూచాడు. చూపు టేబుల్ మీదికి మళ్ళించి, ’ఏం చేశాను? ఈ రోజు నీ గదిలోకే రాలేదు నేను’, అన్నాడు. ‘ఆయా చెప్పింది, నీవు సిగరెట్ తాగుతున్నావని.అవునా?’ ‘ఒక్కసారి తాగాను…అవును’. ’రెండు సార్లు చూశానన్నది, ఆయా’ ‘ఊ…అవును.ఈ రోజు, మొన్ననొకరోజు.’ ‘చూశావా! ఒకసారి కాదు, రెండు సార్లు. మంచి పిల్లవాడివి అనుకుంటూ ఉన్నాను. ఎందుకు యిట్లా పాడయిపోతున్నావు?’ కొడుకు వెల్వెట్ జాకెట్ కాలర్ సవరిస్తూ ప్రాసిక్యూటర్, యింక తరువాత ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. ‘అసలు నీవు నాటేబుల్ సొరుగు తెరిచి, నా వస్తువు తీయడం మొదటి తప్పు. ఇతరుల వస్తువులు వాళ్ళకు చెప్పకుండా తీసుకోడం తప్పు కదా? (ఫరవా లేదు, కేసు బాగానే వాదిస్తున్నట్టున్నాను!) అసలు, ఒకరి వస్తువులు ఒకరు తీసుకోకూడదు. ఇప్పుడు, ఆయాకు ఒక పెట్టె ఉంది.ఆ పెట్టెలో ఆమె బట్టలు పెట్టుకుంటుంది. ఆ పెట్టె తెరిచి అందులో వస్తువులు మనం, అదే నీవుగాని నేను గాని, తీసుకోవచ్చా? (నేను చెప్పదలచుకున్నది ఇది కాదేమో?) కొడుకు అందుకొని అన్నాడు: ‘ఏమవుతుంది, నానా! నీ టేబుల్ మీది పచ్చకుక్క నాదే! ఉంచేసుకో. నేనేమీ అనుకోను.’ ‘అది కాదు.(వీడికి అర్థం కావడం లేదు, నేనేం చెబుతున్నానో.ఎలా చెప్పాలి?)’. కొడుకు తన పొడుగు గడ్డంపై వాడి ముఖం తాకిస్తూ , తల తిప్పుతూ ఉన్నాడు. ‘అనుమతి లేకుండా వేరేవాళ్ళ సిగరెట్ తీసేసుకొని తాగకూడదు. ఒకరి సొమ్ము ఒకరు తీసుకోవడం తప్పు. ’పిల్లవాడి దృష్టి టేబుల్ మీద ఉన్న బంకసీసా మీదికి వెళ్లింది. దాన్ని చేతిలోకి తీసుకుని కంటిదగ్గర పెట్టుకొని చూస్తూ, ’పాపా, బంక దేంతో చేస్తారు?’ అన్నాడు. తండ్రి వాడిచేతిలో సీసా లాగేసి, మళ్ళీ టేబుల్ మీద పెట్టి, ఆస్తి, ఆస్తిపై హక్కులు, వీటి గురించి వాడికి అర్థమయేటట్టు పిల్లల భాషలో వివరించే ప్రయత్నం చేస్తున్నాడు (వాదన సరిగా సాగుతున్నట్ట్టు లేదే!). నేను సిగరెట్ తాగుతాను. నేను పెద్దవాణ్ణి. అలా చేయకూడదని తెలుసు, ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు. (నేను మంచి టీచర్నే!) ‘చూడు,పొగతాగడం వల్ల క్షయ, యింకా అనేక రోగాలు వస్తాయి. పదేళ్ళ తరువాత చనిపోయేవాడు ఇవేళే పోతాడు. మీ మామయ్య చూడు! సిగరెట్లు తాగకపోతే యింకో పదేళ్ళుండేవాడు.’పిల్లవాడి ముఖంలో ఒక మబ్బు తెర, ‘మామయ్య వయొలిన్ బాగా వాయించేవాడు.’ఈ మధ్యనే చనిపోయిన వాడి తల్లి గుర్తు వచ్చి ఉంటుంది. ‘అమ్మను మామయ్యను చావు పైకి తీసుకెళ్ళి పోయింది. చనిపోయిన వాళ్ళందరూ పైకి ఆకాశంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ వయొలిన్ లు, వాళ్ళ పిల్లలు కింద ఉండిపోతారు. పోయినవాళ్ళు ఏ చుక్కల మధ్యనో ఉండి మనలను చూస్తూ ఉంటారు. ’తండ్రికి ఆ తరువాత ఏం చెప్పాలో తెలీలేదు. లేచి నిలబడ్డాడు. గదిలో అటునుంచి యిటు యిటునుంచి అటు తిరుగుతున్నాడు. ‘మా చిన్నతనంలో ఇంత కష్టం ఉండేది కాదు.ఈ విషయాలు సులభంగా పరిష్కారమయ్యేవి. పిల్లలు ఏదైనా తప్పుచేస్తే, నాలుగు పీకడమే. అంతటితో అయిపోయేది. నా చిన్నతనంలో నేనేదైనా తప్పు చేస్తే, అమ్మ మిఠాయిలు యిచ్చేది, ‘యింకెప్పుడూ చేయకురా’ అంటూ. ఇప్పుడూ అవేవీ పనికిరావంటారు. అంతా వాదమే. న్యాయము తర్కము హేతువాదము.

పిల్లవాడు ఎప్పుడో టేబుల్ ఎక్కి కూర్చుని, దాని మీద ఉన్న కాగితము కలము తీసుకొని ఏదో బొమ్మగీసుకుంటున్నాడు. గీస్తూ మాట్లాడుతున్నాడు. ‘ఈ వేళ, పాపా, వంటావిడ కాబేజి తరుగుతూ చెయ్యి కోసుకుంది. పెద్ద కేక వేసింది. భయపడి వెళ్ళి చూశాం. వేలు నీళ్ళలో ముంచమంది ఆయా. ఆమేమో వేలు నోట్లో పెట్టేసుకుంది. చేతికి ఎంత మురికి ఉంటుంది! నోట్లో పెట్టుకోవచ్చా? ’ఏదేదో చెప్పుకు పోతున్నాడు. తలెత్తకుండా, బొమ్మ గీస్తూ. ‘వీడు వినడం లేదు. నేనేదో చెబుతున్నాను, వీడేదో ఆలోచిస్తున్నాడు. వాడి బుర్రలో వేరే లోకం ఉంది. వాడి లోకమే వేరు. వాడు చేసిన తప్పుగాని, నా వాదనలుగాని, వాడు ఏమీ సీరియస్ విషయాలు అనుకోడంలేదు. ఏం చెయ్యాలి? వాడు నా మాటలు పట్టించుకోవలె అంటే నర్సరీ భాషలో మాట్లాడితే చాలదు. భాష కాదు, భావం పట్టుకోవాలి. వాడి మనసును పట్టుకోవాలి. నా సిగరెట్ నష్టమైనందుకు నాకు కష్టం కలిగితే, నేనేడిస్తే వాడికి అర్థం అవుతుంది. అందుకే మరెవ్వడూ తల్లిస్థానాన్ని తీసుకోలేడు. వాడితో కలిసి ఏడవాలి, కలిసి నవ్వాలి. తర్కము నీతి అవినీతి, ఇవేవీ పనిచేయవు. కోర్టులో యింతకాలంగా ఎందరితోనో వాదించి గెలిచాడు. ఒక పిల్లవాడిముందు ఏం మాట్లాడాలో తెలియక నిలబడిపోయాడు.
చివరగా అన్నాడు, ‘ప్రమాణం చేసి చెప్పు, ఇంకెప్పుడూ చేయనని’. “ప్రమాణం”? అంటే? ప్రాసిక్యూటరుకు విసుగొచ్చేసింది. మళ్లీ కుర్చీలో కూర్చున్నాడు. కొడుకు గీస్తున్న బొమ్మ లాక్కున్నాడు. ఒక యిల్లు, చిమ్నీలోంచి పొగ. ఇంటి పక్కన నిలబడిన ఒక మనిషి. వాడి కళ్ళు రెండు ఫుల్ స్టాపులు. వాడి చేతిలో తుపాకి.

‘ఇంటికంటే మనిషి ఎత్తుగా ఉంటాడురా, ఎక్కడైనా?’

‘నానా, మనిషి అంతకంటే చిన్నగా ఉంటే వాడి కళ్ళు యింకా చిన్నగా గీయాలి. కనిపించవు.’

ప్రాసిక్యూటర్ అనుకున్నాడు, తనది తర్కం, వాడిది కళ. ఇళ్ళు, కళ్ళు కాదు. రూపంలేని భావాలను, సంగీతస్వరాలను కూడా బొమ్మలుగా గీస్తాడు.

పిల్లవాడు మళ్ళీ దిగివచ్చి వాళ్ళ నాయన గడ్డంతో ఆడుకుంటున్నాడు. దాన్ని దువ్వాడు.రెండు పాయలుగా చేశాడు. మళ్ళీ ఒకటి చేశాడు. తండ్రి ముఖంలోకి చూస్తున్నాడు. అంతా వాళ్ళ అమ్మచూపులాగే ఉంది వాడిచూపు.

వీణ్ణి కొట్టడమా?

ప్రాసిక్యూటర్ ఈ రోజుకు సెషన్స్ ముగించి పిల్లవాణ్ణి వెళ్ళి పడుకోమన్నాడు. వాడు కథ చెప్పు, అన్నాడు .



ముగింపు

పిల్లవాడు కథ చెప్పమన్నాడు. ప్రాసిక్యూటర్ కు క్లాజులు సబ్ క్లాజులు కంఠస్థమైనట్టు కథలు కథల పాటలు కావు. కాని ఆయనకు తీరిక ఉన్న రోజున కొడుకుకు కథ చెప్పడం అలవాటు. అన్ని కథలలాగే అనగనగా ఒక రాజుతో మొదలవుతుంది కథ. కాని కథలో తరువాత ఏం జరుగుతుందో తెలియదు. ఏదో కల్పించవలె. మొదలుపెట్టినపుడు కథ ఎలా ముగుస్తుందో తెలియదు. ప్రతి వాక్యము దాని తరువాత వాక్యం ఎలా ఉండబోతుందో తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ పద్ధతి పిల్లవాడికి నచ్చింది. అప్పటికప్పుడు తన కళ్ళముందే పుట్టిపెరుగుతున్న కథ వినడంలో వాడికి రెండువిధాల ఆనందం, కథ, కథావిర్భావము. ప్రాసిక్యూటర్ కథ చెబుతున్నాడు. ‘ఒక పేద్ద అందమైన తోట. రకరకాల చెట్లు. పూలు కాయలు పండ్లు. ఆ చెట్లకు గాజుగంటలు పూలు! అవును. గాలి వీచినప్పుడల్లా ఆ గంటలు ఊగి మోగుతాయి. గాజుగంటల మోత, లోహగంటలమోతలా ఉండదు. నాజూగ్గా ఉంటుంది. పూలమొక్కలు. రంగురంగుల పూలు. రంగురంగుల పక్షులు, రెక్కలాడిస్తూ తోటలో ఎగురుతుంటాయి. రకరకాల కూతలు. ఊఁ…ఇంకా…? ఆఁ. ఫౌంటెన్ లు! ఆంటీ యింట్లో చూచావు చూడు? అట్లాంటివి. అయితే యింకా పేద్దవి. ఆ తోటలో ఒక రాజభవనం. అంతా గాజుతో కట్టిందే. ఆ భవనంలో ఒక రాజు. పెద్దవాడైపోయాడు. తలా గడ్డమూ తెల్లగా అయిపోయాయి. ఆయనకు ఒకే ఒక్క కొడుకు. చిన్న పిల్లవాడు, నీ లాగే. తన తరువాత రాజ్యం చేయవలసినవాడు. మంచి పిల్లవాడు. అల్లరి చేసేవాడు కాదు. బుద్ధిగా వేళకు తిని వేళకు నిద్ర పోయేవాడు.ఏ చెడ్డ అలవాట్లు లేవు. ఒక్కటి మాత్రం ఉండేది. పొగతాగేవాడు. దాంతో పాపం వాడికి క్షయవ్యాధి పట్టుకుని చిన్నతనంలోనే చనిపోయాడు. ముసలిరాజు పాపం దిగులుతో మంచంపట్టాడు. శత్రురాజులు దాడిచేసి, రాజును చంపేశారు. రాజభవనం ధ్వంసం చేశారు. తోటనంతా చిందరవందర చేసేశారు. పక్షులకూతలు లేవు. గాజుగంటల మోతలు లేవు. …అదీ జరిగింది.’కథ ముగించాడు. కాని ప్రాసిక్యూటర్ కు తన కథ మరీ చిన్నపిల్లల కథలా, అసంబద్ధంగా అనిపించింది. పిల్లవాడి మనసుపై మాత్రం కథ బలమైన ముద్ర వేసింది. ’నేనిక పొగ తాగను’, అని, గుడ్ నైట్ చెప్పి వెళ్ళి పోయాడు. ప్రాసిక్యూటర్ కు నవ్వు వచ్చింది. ‘కళ , సౌందర్యము వాటి ప్రభావము అంటారు. కావచ్చు. కాని దాని వల్ల ఏం లాభం లేదు. అది సరి అయిన పద్ధతి కాదు. నీతి నిజాయితీ ఉన్నదున్నట్టు ఎందుకు చెప్పకూడదు? దాన్ని అందంగా అలంకరించాలి, మెరుగులు దిద్దాలి, చక్కెరపూతపూసిన మందులలాగా చేసి యివ్వాలి అంటారు. కాదు. అది భ్రమ పెట్టడం. మోసం చేయడం ..గారడి …’ ఆయన ఆలోచించాడు. కోర్టులో ఆయన తర్కమే పనిచేస్తుంది. కాని తాను జీవితంలో నేర్చుకున్నదంతా న్యాయశాస్త్రగ్రంథాలనుండి కాదు, నీతికథలనుండి, కథలనుండి, కవితలనుండి. ఏమిటో? జీవితంలో భ్రమలకు కూడా స్థానం ఉంది. వాటికి ఒక ప్రయోజనం ఉంది.’ ప్రాసిక్యూటర్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. రేపటి కోర్టుపనికి చూసుకోవలసినది ఉంది. కాని ఆయన మనసులో ఏవో కదలికలు. ఆ పై ఫ్లోర్ లో సంగీతం ప్రాక్టీసు ముగిసింది. కాని, పై ఫ్లోర్ లో అడుగుల చప్పుడు ఆగలేదు. ఇదీ కథ. మొదటనే చెప్పాను, ఇది పూర్తి అనువాదం కాదు. ఇక “హోమ్” వర్క్:

-“హోమ్” కు సరి అయిన తెలుగుపదం ఉందా?

-ఈ కథకు ” హోమ్” అన్న పేరే ఎందుకు?

-పిల్లవాడి వయసు ప్రస్తావన ప్రాధాన్యం ఏమిటి? వయసు ఏడు కాక పదిహేడు కావచ్చా?

-ప్రాసిక్యూటర్ చెప్పిన కథ పిల్లవాడిని ఉద్దేశించినది మాత్రమేనా? కథాకారులనుకూడా ఉద్దేశించినదా?

-కథ ముగింపులో, పై రెండు ఫ్లోర్ లలో ఏం జరుగుతుందో, ఏమి ఆగి పోయిందో చెబుతాడు. వాటి ప్రాధాన్యం ఏమిటి?

-కథ ప్రాసిక్యూటర్ మనసులోని మథనతో ముగుస్తుంది.ఏమిటా మథన?

వ్యక్తిలో సమాజంలో నిత్యము జరిగే మథన. బుద్ధికి మనసుకు, తర్కానికి కళకు, న్యాయానికి ప్రేమకు నిరంతరాయంగా జరిగే ఘర్షణ. చట్టము దయ ఈ రెంటిలో దేనినీ వదిలి సమాజం నడవలేదు. క్రోధాన్ని శోకాన్ని సమన్వయం చేయడంలో జరిగే మథన ఏ రచనకైనా వస్తువు. క్రోధము శోకము శ్లోకత్వం పొందడమే కావ్యావిర్భవం. చట్టాన్ని గంగలో కలిపి, కేవలం ప్రేమతో సమాజం నడవగలదు అని చెఖోవ్ చెప్పడంలేదు. ఏ రచయిత చెప్పలేడు చెప్పడు. ప్రేమ కరువైతే ఏ సమస్యకు పరిష్కారం లేదన్నదీ అంతే సత్యం. ఈ సమన్వయకార్యమే కావ్యవస్తువు. ఈ కథ కేవలం పిల్లల కథ కాదు. ఇందులో వ్యక్తి, కుటుంబం, సమాజం అనే మూడు వృత్తాలు ఒకదానికంటే మరొకటి విస్తృతమై ఒకదానిలో ఒకటి యిమిడి ఉన్నాయి. కథార్థం అన్ని వలయాలుగా విస్తరిస్తుంది.

ధర్మము దయ ఈ రెంటి సమన్వయమే ఏ కావ్యమైనా. ఏ ఋషి అయినా అదే చెబుతాడు, ఏ కవి అయినా అదే చెబుతాడు.
కలం పట్టిన ప్రతివాడు కవి కాకపోవచ్చు, ఋషి కాక తప్పదు, పట్టిన కలమేదైనా పుట్టిన కులమేదైనా.



ఉత్తరోత్తరం.(Post script)

‘కలం పట్టిన ప్రతివాడు కవి కాకపోవచ్చు, కాని ఋషి కాక తప్పదు. పట్టిన కలం ఏదైనా పుట్టిన కులం
ఏదైనా.’ఈ వాక్యం ఏదో బాగుంది కదా అని అనేసినట్టు అనిపించవచ్చు. చెఖోవ్ ఆర్షభూమిపై పుట్టినవాడు కాడు. ఆస్తికుడు అసలే కాడు. మరి ఋషి ఎట్లా? దీనికి వివరణ యివ్వవలసిన అవసరం ఉంది. దానికి ముందు, అడిగిన ప్రశ్నలకు కొన్నిటికైనా సమాధానాలు చెప్పాలిగా?



వస్తువు-శిల్పము

సమాధానాలు కథాశిల్పంతో కలిసిపోయి ఉంటాయి. శిల్పము వస్తువు వేరు కావు. కథాప్రయోజనాన్ని సఫలం చేసేది, వస్తువును ఆవిష్కరించేది శిల్పం. శిల్పినైపుణ్యాన్ని శిల్పంలోనే కదా చూడగలం? వేరుచేసి చూడలేము కదా? కథా వస్తువు కథాప్రయోజనము శిల్పంలో భాగమే.(Content? That is also part of the form.) “చెఖోవ్ తుపాకి” అనేది ప్రసిద్ధవాక్యం. కథలో గోడమీద ఒక తుపాకీ వేలాడుతోంది అన్నావంటే, కథ ముగిసేలోపల ఆ తుపాకీ పేలాలి. అంటే కథాప్రయోజనానికి పనికిరాని ఒక్క మాట కూడా ఉండకూడదు. ఇది వఠ్ఠి మాటేనా? ఈ కథలో ఏదైనా తొలగించగలమేమో ప్రయత్నించి చూద్దాం.

ప్రాసిక్యూటర్ నవ్వు

‘నీ కొడుకు సిగరెట్ తాగుతున్నాడు’అని చెప్పగానే, తండ్రికి కోపం వస్తుందా, నవ్వు వస్తుందా? కథలో తండ్రికి నవ్వు వచ్చింది. నెలల పిల్లవాడు మొదటిసారి నడిచే ప్రయత్నం చేస్తూ రెండడుగులు వేసి మూడో అడుగు వేస్తూ చతికిలపడ్డాడు. చూస్తున్న తండ్రికి నవ్వు వస్తుందా కోపం వస్తుందా? నవ్వు రావడం అసహజం కాదు, రాకపోవడం అసహజం. లోకంలో ఇలాగే జరుగుతుంది. మంచి లోకానుశీలనం. నిజమే.కాని, లోకంలో జరిగేవన్నీ కథలో చెబుతారా? ఈ అనుశీలనం కథకు అవసరమా? దాన్ని తొలగించి చూద్దామా? ఎవడైనా తప్పు చేస్తే మనకు మొదట, చివర వచ్చేది కోపం. ‘ఏదో తెలియక చేశాడు పాపం!’ అని అనడం లేదు.మనిషికి సహజమైన నవ్వు, నాగరికతలో (చట్టము న్యాయము) మరుగునపడిపోయింది. తండ్రి అలా నవ్వుతూ ఉండిపోడు. చతికిలపడ్డ పసివాణ్ణి ఎత్తుకొని ఎగరేసి, పట్టుకుని, తిరిగి నేలమీద నిలబెట్టి, వేలు అందించి నడిపిస్తాడు. కథ గుర్తుచేస్తున్నది మనిషి మరిచిపోయిన ఆ మొదటినవ్వును. పసివాడి తప్పటడుగులు మనకు “తప్పుటడుగులు” గా కనిపిస్తున్నాయి. అది కథలో ఆ నవ్వు ప్రయోజనం. కనుక, కథలో ఆ నవ్వును తొలగిస్తే ఏమవుతుంది? పునాదిరాయిని పీకేస్తే ఏమవుతుంది? కథ కుప్పకూలుతుంది. అయితే, నవ్వు సమస్యలన్నిటికీ పరిష్కారమా? అలా అన్నాడా చెఖోవ్ కథలో ఎక్కడైనా? పరిష్కారం కాదు. కాని, మనం తప్పటడుగును తప్పుటడుగుగా మాత్రమే చూస్తున్నాము అన్నదే కథలో విషయం. కథకుడి పని ప్రశ్నలడగడమే, సమాధానాలు పరిష్కారాలు సూచించడం కాదు. (అలాగని ప్రశ్నలు మాయమవవు.) సాహిత్యం, ఉత్తమసాహిత్యం, యిచ్చే సమాధానం ఒకటే. జీవితంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఈ జ్ఞానంలో కలిగే చిత్తసమాధానమే నిజమైన సమాధానం.ఈ సమాధానమే అలంకారికులనే శాంతరసం (tranquility).

‘ఎన్నేళ్ళు వాడికి?!’

తండ్రి ఈ ప్రశ్న ప్రాసిక్యూటర్ గా అడగలేదు. నవ్వుతూ అడిగాడు. తనకు పిల్లవాడి వయసుకూడా తెలియనంతగా తన లోకవ్వహారాలలో మునిగిపోయాడు, అది తల్లులకు తెలిసేది, అన్నది ప్రశ్నకు ఒక కోణం. మరో కోణం, తను నవ్వుతూ అడగగలగడం. ఇది తప్పు అన్న భావం కంటె, ఇది ఈ వయసులో సహజం అన్న భావన అతనికి కలిగింది. అయితే ఈ ప్రశ్న కేవలం తండ్రి వేసిన ప్రశ్న మాత్రమేనా? కాదు. ఇది యిద్దరి ప్రశ్న. నేరస్థుణ్ణి కోర్టులో ప్రవేశపెట్టగానే ప్రాసిక్యూటర్, తనకు సమాధానం తెలిసి, అడిగే ప్రశ్నలలో ఇది ఒకటి. కోర్టు ఏడేళ్ళపిల్లవాడికి (juvenile), పదిహేడేళ్ళు దాటిన పిల్లవాడికి ఒకే తీర్పు చెప్పదు. అక్కడ వయసు ప్రశ్నకు ప్రాధాన్యం ఉంది. అక్కడే కాదు, న్యాయశాస్త్రవికాసంలో కూడా, ‘కాలం వయసు’ కు తేడా ఉంటుంది. ఏడేళ్ళ మానవనాగరికతకు ఏడువేల ఏళ్ల నవనాగరికతకు ఒకే చట్టం పనికిరాదు. కృతయుగపు మనుస్మృతి కలియుగంలో చెల్లదు. కనుక ఈ వయసుప్రశ్నకు రెండు ముఖాలు.

ఈ కథలో గమనించవలసిన రెండు మూడు అంశాలు చెప్పుకుని, ఋషి శబ్దప్రయోగం వివరించి,చెఖోవ్ ముచ్చట ముగిస్తాను.

కథలో కథ

తన కొడుకుకు చెప్పిన కథ తనకు నచ్చలేదు అంటాడు ప్రాసిక్యూటర్. కథ అసంబద్ధంగా తోచింది ఆయనకు. బుద్ధి, తర్కము దృష్టిని నియమించే ప్రాసిక్యూటర్ కు తను సృష్టించిన కథే అయినా నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు. కాని తండ్రిగా తను చెప్పిన కథ ప్రాధాన్యం, దాని ప్రయోజనము గుర్తించలేనివాడు కాదు. వృత్తి రీత్యా బుద్ధిజీవి. కాని జీవితంలో తను నేర్చుకున్నది న్యాయశాస్త్రగ్రంథాలనుండి కాదు. జీవితానికి పనికివచ్చేదంతా తాను నీతికథలు, నవలలు, కావ్యాలు- వీటినుండి నేర్చుకున్నాడు. ‘సృష్టిలో చాలా భ్రమలు మోసాలు ఉన్నాయి, వాటి అవసరం ఉంది’, అంటాడు. అంటే, ‘మరక మంచిదే’, అంటున్నాడు.

కథ ప్రాసిక్యూటర్ పిల్లవాడికి చెప్పిందేనా?

అవును. కాని అది మాత్రమే కాదు. పాత్ర చేత కథ చెప్పించడమే కాక, పాత్ర ద్వారా చెఖోవ్ కథ ఎలా రాయాలి అని చెబుతున్నాడనిపిస్తుంది. ‘దృశ్యాలు,పాత్రలు, సన్నివేశాలు అన్నీ అప్పటికప్పుడు అనుకుని తీసుకున్నవే. కథాసంయోజనము, నీతి కథకుడి పథకం లేకుండానే, వాటంతట అవే వచ్చి చేరుతాయి. ఈ విధంగా అప్పటికప్పుడు ఆవిర్భవించే కథ పిల్లవాడికి చాలా యిష్టం.’ ఈ మాటలు కథాకారులను ఉద్దేశించినవే. రచన కృత్రిమం కాకుండా సహజంగా ఆవిర్భవించవలె, అంటాడు చెఖోవ్. కథలో నుండి నీతి, సందేశం రావలె. నీతిలో నుండి, సందేశం లోనుండి కథ రాకూడదు..

‘పై రెండు ఫ్ల్లోర్ లు’

ప్రాసిక్యూటరు గదికి పైన రెండు ఫ్లోర్ లు ఉన్నాయి.ప్రాసిక్యూటర్ కొడుకుతో మాట్లాడడానికి మొదలుపెట్టినప్పుడు పై ఫ్ల్లోర్ లో అడుగుల చప్పుడు, దానిపై ఫ్ల్లోర్లో సంగీతాభ్యాసము వినిపించాయి. కథ ముగిసినప్పుడు సంగీతం ఆగింది. కాని అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉంది. ఇవి దేనికి సంకేతం? సంగీతం తను చెప్పిన కథతో ముగిసింది అంటే, చేదు పాఠానికి చక్కెరపూత అప్పటికి పనిచేసింది. కాని అది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. సత్యానికి భ్ర్రమకు, కల్పనకు తర్కానికి మధ్య ఘర్షణ ఆగదు. అదే ఆగని అడుగుల చప్పుడు. ప్రాసిక్యూటర్ చెప్పిన కథ శాశ్వత పరిష్కారం అనడం లేదు చెఖోవ్. భ్ర్రమలకు కూడా ప్రయోజనం ఉన్నది అని గుర్తు చేస్తున్నాడు.

కథ పేరు

“హోమ్” కు సరి అయిన తెలుగు పదం లేదనుకుంటాను. “ఇల్లు” కు “నా” కాని “మా” కాని చేరిస్తే( నా యిల్లు, మా యిల్లు) కొంత సరిపోవచ్చు. ఈ కథకు ఆ పేరు పెట్టడంలో ఔచిత్యం తెలుస్తూనే ఉంది. శిక్ష, శిక్షణ కూడా ఇంట్లోనే మొదలుకావలె, తల్లి ప్రేమలో. సమాజంలో కూడా ఈ తల్లిప్రేమను ఆశించడం అవాస్తవం కావచ్చు. కాని కోరడం కవి స్వభావం.

కలం మహిమ: ఋషి

రష్యన్ సాహిత్యానికి పందొమ్మిదవ శతాబ్దం స్వర్ణయుగమంటారు. (ఇంగ్లీషుకు పదహారో శతాబ్దంలాగా.) ఆ యుగపు ప్రసిద్ధత్రయమని చెప్పదగినవారు: Dostoevsky (1821-1881), Tolstoy (1828-1910), Chekhov (1860-1904) ఈ ముగ్గురు ఒక్కొకరు ఒక ప్రత్యేకమైన ముద్రవేసి పోయారు రష్యన్ సాహిత్యంపై. చెఖోవ్ అన్నాట్ట, ‘నా రచనలు మరో ఏడు సంవత్సరాలు చదువుతారు పాఠకులు’, అని. ’’ఏడే ఎందుకు’, అని అడిగితే, ‘ఏడున్నర. ఇంకా ఆరేళ్ళు బతుకుతాను కదా’, అన్నాడట, తరుముకొస్తున్న క్షయవ్యాధిని తలచుకొని. జూలై 15 కు ఆయన పోయి నూటపదమూడు సంవత్సరాలు.) ఇక్కడ ప్రస్తావించిన ముగ్గురి గురించి సాధారణ అభిప్రాయం, ‘మొదటి యిద్దరి రచనలను మనం చదవనవసరం లేదు. అవి చదివిస్తాయి. చెఖోవ్ రచనలను మనం చదవాలి’, అని. ఇటువంటి అభిప్రాయాలు పాక్షికంగానే గ్రహించాలె. నా మటుకు నేను ఈ గంపగుత్త బేరాలు చేయను. గంపలో నాకు కావలసినవే ఏరుకుంటాను. “ఆనా కెరినినా” ఆపకుండా చదివించింది. “వార్ అండ్ పీస్” మూడు సార్లు మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయాను. ఏ రచయిత విషయంలోనైనా యిలాగే ఉంటుంది. ఏ రచనకు ఆ రచనే. అయితే, చెఖోవ్ విషయంలో, తక్కిన యిద్దరే కాదు, ఏ యితర రచయితల రచనలలో కంటే కూడా పాఠకుడి పాత్ర ఎక్కువ అవసరమవుతుంది. ఈ మాట కూడా అతని ఒక రచనాదశలోని రచనల విషయంలో మాత్రమే, రచన పరిణతి పొందిన దశలో. ఈ దశలో అతని కథలకుగాని నాటకాలకుగాని వస్తువు తక్కిన చాలామంది రచయితల రచనలలో లాగా పాత్రలో ఘటనలో దృశ్యమో కాదు. ఒక రకంగా చెప్పాలంటే, యితరులకు వర్షంలో వర్షధార వస్తువైతే, చెఖోవ్ కు ధారకు ధారకు మధ్యనున్న శూన్యం కావ్యవస్తువు. కనుక పాఠకుడు ఎక్కువ ధ్యానం ఉంచవలె. చెఖోవ్ బాల్యం దారిద్ర్యంలో గడిచింది. కుటుంబవాతావరణం సంతోషకరమైంది కాదు. తండ్రి తాగి అప్పులు చేసి భార్యాపిల్లలకు అప్పులే మిగిల్చాడు. ఒకరోజు పులుసులో ఉప్పు ఎక్కువైందని, (ఒకరోజు కాదు, ప్రతిరోజు ఏదో ఒకటి ఎక్కువో తక్కువో అవుతుంది,) తండ్రి తన తల్లిపై చేసిన రచ్చ, చెఖోవ్ జీవితాంతము మరచిపోలేదు. చెఖోవ్ కుటుంబభారం వహించాడు. మొదట డబ్బుకోసం పత్రికలవాళ్ళు ఏది ఎలా రాయమంటే అలా రాశాడు. ఈ దశలో అతని రచనలలో వ్యంగ్యము వైముఖ్యము వైరస్యము నైరాశ్యములు ప్రధానంగా ఉండేవి. తనకు రచయితగా పేరు రావడం మొదలయాక (1880-84), రచనలో కొంత స్వేచ్ఛ వికాసము కనిపిస్తుంది. ఈ దశలో తోటివారిపట్ల సహనము దయ తన రచనలలో కన్పించటం మొదలయింది. 1885 తరువాత అతనిపై టాల్స్టాయ్ ప్రభావం బాగా పడింది. ఈ దశలో చేసిన రచనలలో ఏ వైరస్యము లేని ఒక చిత్తసమాధానం కనిపిస్తుంది. సృష్టిని, దాని అన్ని వైషమ్యాలతో స్వీకరించగలిగాడు. సృష్టిలోని సమస్యలకన్నిటికీ సమాధానాలుండవు అన్నదే పెద్ద సమాధానమన్న శాంతస్థితిని పొందాడు. ఈ చిత్తసమాధానమే ఋషిలక్షణం. కలం పట్టుకున్న ప్రతివాడు ఈ సమాధానానికి వస్తాడు.కలం పట్టి మంచిని శపించగలిగినవాడు లేడు. కలం పట్టి కవి కాక పోవచ్చు. కాని లోకానికి మేలు తప్ప కీడు కోరలేడు. కలం ఒక మంత్రదండమే. ద్వేషమూర్ఛితుడి చేతిలో కలం పెట్టండి. వాడికి స్పృహ వస్తుంది, సామాజికస్పృహ. వాడి ద్వేషంలో కూడా ప్రేమ నిండి ఉంటుంది. లోకాన్ని శపించలేనివాడు ఋషికాక మరేమవుతాడు?

‘…at the heart of the aesthetic imperative we discern the moral imperative.'(Sartre)

“హోమ్” కథను సమభావం సహానుభూతి దయ ప్రేమ నిండి ఉన్నాయి.

(చెఖోవ్ కథ పరామర్శ ఇంతటితో ముగిసింది.)

అమృతసంతానం" నవలపై నా వ్యాసానికి లింక్:


"అమృతసంతానం" నవలపై నా వ్యాసానికి లింక్:

https://www.scribd.com/document/350317259/A-review-by-Suraparaju-Radhakrishnamurti-on-Telugu-translation-of-AMRUTAR-SANTAN-a-novel-by-Gopinath-Mohanty




The Vision Of Death in The Dry Salvages Of Eliot

Here's an article published in the Indian Journal of American Studies. (1972)

THE VISION OF DEATH IN THE DRY SALVAGES OF
T. S. ELIOT
S. RADHAKRISHNA MOORTHY
The dominant images of The Dry Salvages are the river and the sea. Eliot associates water, more than he does any other element, with death. ‘Death by water’ moves into ‘The Dry Salvages.’ A sense of death flows through The Dry Salvages. The poem may be said to be a moving image of death. The opening passage presents an image of the river.
I do not know much about gods; but I think that the river
Is a strong brown god–sullen, untamed and intractable,
Patient to some degree, at first recognised as a frontier;
Useful, untrustworthy, as a conveyor of commerce;
Then only a problem confronting the builder of bridges.
The problem once solved, the brown god is almost forgotten
By the dwellers in cities–ever, however, implacable,
Keeping his seasons and rages, destroyer, reminder
Of what men choose to forget unhonoured, un propitiated
By worshippers of the machine, but waiting, watching and waiting.
The personal pronoun in the opening line seems to have misled the critics into believing that Eliot is here making a personal statement and that the expressions ‘I do not know much’ and ‘I think’ reveal the tentativeness of the statements. But the personal pronoun here is no more personal than in Prufrock, The Waste Land or The Hollow Men. It is not impersonal either as in the opening line of East Coker (“In my beginning is my end”) where the pronoun although it has a personal touch transcends it and attains impersonality. It suggests a tone of irony. It refers to man’s profession of ignorance of Gods. But there is one God man cannot ignore. And he is Death.
Though you forget the way to the Temple,
There is one who remembers the way to your door,
Life you may evade, but Death you shall not.
                                                           (Choruses from ‘The Rock’)
Thus the opening line of the poem is not a personal statement, but an ironical reference to the attitude of indifference to gods. Indeed the passage tells us as much about the various attitudes to the river–to deify! to defy and to forget–as about the river itself.
The river is “destroyer, reminder / of what men choose to forget.” The god is “unhonoured, unpropitiated / by worshippers of the machine, but waiting, watching and waiting.” The god that the poet is referring to in these lines, and in the rest of the poem, is Death. (“The bone’s prayer to Death its God.”) The apparently docile “conveyor of commerce” contains a terrible meaning revealed in “the river with its cargo of dead negroes,cows and chicken coops”, an awful revelation of the strength of the “strong brown god.” And in the lines immediately flowing out of these, the last four lines of the opening passage, we have the same river with its rhythm present in life.
His rhythm was present in the nursery bedroom,
In the rank ailanthus of the April dooryard,
In the smell of grapes on the autumn table,
And the evening circle in the winter gaslight.
The rhythm of the river in these lines is the rhythm of life. The image of the river has moved from death to life. The process of death flowing into life, and life flowing towards death is effectively communicated by this moving image of the river. Such a moving image touching and irradiating centres of meaning as it moves along reflects the principle of continuity and the sameness under lying the apparently unrelated and opposing things. The image in Eliot is an instance of the integral vision and of the unified sensibility. The order of the images in the passage is death issuing in life. And the order suggested by the use of the past tense (“His rhythm was present...”) is death born in the nursery bedroom and flowing along with life in spring,autumn and winter. Thus the opening passage of the poem is an imagist restatement of the lines of East Coker, “In my beginning is my end” and “In my end is my beginning.” The poet here does not allow the sensuousness of the image to be submerged under its meaning. He does this by mixing expressions which are purely literal and expressions which are purely suggestive. “Useful”, “a problem confronting the builder of bridges” are purely literal and resist any suggestion of death. “Unhonoured”, “unpropitiated” apply literally to death. Sometimes the literalness of the image comes to the surface, sometimes its symbolic meaning. Here and there the two merge as in “sullen”, “untamed”, “frontier,” “reminder of what men choose to forget.” There are also expressions which have a terrible meaning in store. The full meaning of “conveyor of commerce” is revealed in “...the river with its cargo of dead negroes, cows and chicken coops.” This is a silent and all the more awful revelation of the terrible river in flood, of the strength of the “Strong brown god.”
               And yet we cannot fix the meaning of the river in this passage as death for that would prevent us from appreciating the complexity of the vision of death. The poet is visualizing death as the movement of time, “keeping his seasons and rages.” This movement of time perceived in seasons is more explicit in the last four lines of the first passage. This image of the seasons of life is a movement of time too and hence is an aspect of death. Thus the whole passage is an image of the complexity of death, a sensuous apprehension of the essential sameness of life, time and death. The image of the seasons appeals to the auditory (the rhythm), the olfactory (the smell of grapes, rank ailanthus) and the visual (the evening circle in the winter gaslight) senses. Of Eliot it could truly be said, as of Keats, that he writes with all the five senses alive. The Dry Salvages is in fact a sensuous apprehension of the omnipresence of death. (“And the time of death is every moment.”) Eliot is a visionary of death. This is as true of the Eliot of Four Quartets as of the Waste Land. No doubt he has seen the “shaft of sunlight.” But this light has only clarified his vision of death. And this vision of death has lent added significance to life.
The pervading image of the poem, however, is the sea and not the river. (The river recurs only once in 1.116.) The river of the opening passage flows into the sea.
        “The river is within us, the sea is all about us.”
        The sea is where the river flows into, a deposit of time, a record of death.
        It tosses up our losses, the torn seine,
        The shattered lobsterpot, the broken oar
        And the gear of foreign dead men. The sea has many voices.
         Many gods and many voices.
We have here an image of man’s defeat and death. “The many gods” are not exactly death but the knowledge of death, anguish and pain of life. We hear the “many voices” of the sea in the next passage. The “sea howl,” the “sea yelp,” “the whine in the rigging,” “the distant rote in the granite teeth” and “the wailing warning” from the headland are all different cries of pain and anguish. Helen Gardner almost fixed the meaning of the sea image in the poem as “the time we become aware of through our imagination, stretching behind us, beyond the record of the historian, and continuing after we have gone.” But the sea too is a moving image in the poem. The sea in the line “the sea is all about us” may be time outside us. But the howling, wailing sea is an image of the restless life with all its futile fury, fretfulness and cries of pain. It is this image of the sea as a restless life that recurs in the line “...the ragged rock in the restless waters.” The sea here is not death or time but life. The restless tossing of waves are contrasted with the “unhurried groundswell”, a contrast between the pitiful cries of personal agony and the calm, inexorable, grand sweep of the non-human time. It is the image of the same sea with a contrasting significance.
Eliot’s use of imagery in this poem is indeed a mode of revealing continuity in contrast. The second section of the poem opens with a contrast with the silent wailing of the sea as against the howling, yelping, whining sea in the previous section.
Where is there an end of it, the soundless wailing,
The silent withering of autumn flowers
Dropping their petals and remaining motionless
Where is there an end to the drifting wreckage,
The prayer of the bone on the beach, the unprayable
Prayer at the calamitous annunciation?
The “soundless wailing” in these lines is in sharp contrast to the voices of the sea in the previous section. But the way of exclamation clearly suggests (“where is there an end of it”) that “it” is the same wailing, voiced or voiceless. Eliot is describing “the movement of pain”, or the evolution of agony. Starting from the “nursery bedroom” the pain moves into the youth symbolized by the restless sea and finally it attains the silent painless pain of the emotionless old age. The whole of the first movement of the second section–six stanzas with their corresponding lines femininely rhyming in relaxation–is an expression of the unending agony and the final futility of life’s activity. “There is no end, but addiction; the trailing/consequence of further days and hours.” And “we cannot think of a time that is oceanless.” We cannot think of a time that is oceanless and life’s activity, however futile and agonising, is unending. There is no end of “the fishermen sailing” but “we have to think of them as forever bailing, / setting and hauling” and “not as making a trip that will be unpayable / For a haul that will not bear examination.” Life must be carried on forgetting the futility of it all. The second movement of this section is about the permanence of agony. “People change, and smile; but the agony abides.” The image of the river as the movement of time recurs.
“Time the destroyer is time the preserver,
Like the river with its cargo of dead negroes, cows and chicken coops,
The bitter apple and the bite in the apple.”
The life-giving river is also the vehicle of death and devastation. The knowledge (“the bitter apple”) that sustains is also the knowledge that is death. The title image, the image of the Dry Salvages off the sea coast of cape Ann, Massachusetts, follows:
And the ragged rock in the restless waters,
Waves wash over it, fogs conceal it;
On a halcyon day it is merely a monument,
In navigable weather it is always a seamark
To lay a course by; but in the sombre season
Or the sudden fury, is what it always was. (195)
Much has been written on the meaning of the “rock” in these lines. It has been suggested that it represents the permanence of the Fall of Man, the Eternal Stability, Christ, the Church and so on. Many critics did not even notice the rock. And yet nothing is more natural than this image. If critics did not “see” this simple image it is only because they were armed with big sticks and fixed meanings. “The ragged rock” is the tombstone, the “monument.” The “rock”, although singular, refers to the Dry Salvages, a group of rocks and suggests a crop of tombstones, a cemetery. The “restless waters” is not a symbol of abstract time–time unborn and dead–but is a vivid symbol of lift with the agonising cries we heard in the previous movement. The rest and repose of the rock are a contrast to the restless waters. We have here two images, or rather three–the image of the Dry Salvages in the sea, and the image of a cemetery superimposed on the image of the restless sea of humanity, “fishermen sailing,” “bailing, setting and hauling,” or any other men about their business. The rock, the tombstone, is the only hope of the restless humanity. But the poet does not soften the fact of death. The rock is “ragged” for “waves wash over it” but cannot soften it. That is to say “people change, and smile: but the agony abides”. The “sombre season” and the “sudden fury” bring out the gloom and the terror of death. The terse final “is what it always was” is suggestive of the inviolable finality of its touch.
The image of the rock occurs in the Waste Land too: Only
There is shadow under this red rock,
(come is under the shadow of this red rock)
              …………………….
I will show you fear in a handful of dust.
                                                       (The Burial of the Dead)
In the Waste Land “where the sun beats / And the dead tree gives no shelter,” the rock alone gives shelter. And the rock gives us also the terrifying vision of “a handful of dust”. Opposing aspects of death are unified in this image of the rock, the terror and the hope. In the Dry Salvages the terror is transformed into agony and the rock is a symbol both of the only hope of rest and repose and of the agony, “the menace and caress.” The image conveys the full conciousness of the complexity of the fact of death.
An image issues a meaning which is usually apprehended in abstraction. But the image of the ragged rock issues not an abstract meaning but another image, the tombstone, which is its meaning. The image of the restless sea of humanity is again superimposed on this image of tombstones. These images of the rock in the restless waters, and of the crop of tombstones, and of the sea and the sea of humanity coming at the same time, one on the other, are an instance of a kind of double exposure.
The third section of the poem introduces the image of journey by train and by liner. The image of the journey signifies man’s hope of the future.
When the train starts, and the passengers are settled
To fur it, periodicals and business letters
(And those who saw them off have left the platform)
Their faces relax from grief into relief,
To the sleepy rhythm of a hundred hours.
The parenthesis in this passage is a poignant image of parental love. Parents desire to see their children settled comfortably in the train of life before they leave the platform. But the children after the initial grief of loss relax into relief and attempt to escape from the past and from the fact of death into some future of hope. But “we cannot think of a future that is not liable/like the past, to have no destination.” The aim of the journey of life is not to arrive at a destination but merely to move on. Action “which shall fructify in the lives of others” is its own fruit. And the journey is its own destination, This is “one way of putting” “what Krishna meant / Among other things,” Eliot is not repeating the words of the Gita, nor is he renewing them. He transforms the message of disinterested action of the Gita with his vision of the omnipresence of death, the abiding agony and the permanence of pain. The parenthetical comment he makes on the line from the Bhagavadgita he incorporates in this poem makes this obvious,
On whatever sphere of being
the mind of a man may be intent
At the time of death...
(And the time of death is every moment)
After Eliot’s lifting, the Gita line can no longer mean the same. It acquires a new significance. The last lines of the section present the essence of the tragic vision that transforms the message of the Gita.
“Not farewell/But fare forward, voyagers,” Man must move on unceasingly but with no hope of achievement and with the full burden of the knowledge of death, “Not farewell “, for there is no end to the movement of pain.
Section, four reveals the need for grace equally of all those “who are in ships” of “women who have seen their sons or husbands / setting forth, and not returning” and of those “who were in ships, and / ended their voyage on the sand” of the dead and the not yet dead (meaning the living). The appeal for grace only intensifies the shadow of death on life.
The final section of the poem shows the futility of man’s attempts to forget time with the help of “pastimes and drugs”, or to cling to time. The poem emphasizes that death should. Not be attempted to be deified, or defied, or forgotten for it is in-escapable. It should be realized and redeemed through “a life-time’s death in love.” Right action is the only freedom from past and future, the moving time, the death. We are to be “Content at the last, if our temporal reversion nourish (Not too far from the Yew-tree.). The life of significant soil.” Our reversion to the earth shall fructify the significant soil. But this nourishment of life is never too far away from the shadow of the Yew-tree.
The Dry Salvages opens with image of the river, death the destroyer and preserver. At the centre of the poem there is the image ofthe rock, death offering rest and repose in the restless life. At the close of the poem there is the Yew-tree, an image of mourning but offering shade too. The hope and the agony are both real.And both are simultaneously realized in the poem although not with equal intensity for agony is easier and in tenser in the poem than is hope.

బోద్ లేర్: గుడ్లగూబలు Les Hiboux

బోద్లేర్ కవిత " గుడ్లగూబలు"పై ఇటీవల నేను రాసిన వ్యాసాన్ని  పరిష్కరించి యిక్కడ తిరిగి ప్రచురిస్తున్నాను.

"యా నిశా సర్వభూతానాం"

గుడ్లగూబలు:బోద్ లేర్

నల్లని యూ చెట్ల నీడన
గుడ్లగూబలు బారులుతీరి ఉన్నాయి
ప్రవాస దేవతల్లా
రూక్షాక్షులు రువ్వుతూ.అవి ధ్యానం చేస్తున్నాయి.

నిశ్చలంగా నిలిచి నిరీక్షిస్తాయి
విషాదఘడియలు వచ్చేవరకు
వాలుతున్న సూర్యుణ్ణి తోసేసి
చీకట్లు  చిక్కబడి  స్థిరపడతాయి .

 వాటి తీరు చెబుతుంది వివేకికి
 ఈ లోకంలో,  భయపడమని
సంచలనాలకు సంఘర్షణలకు

కదిలిపోయే నీడల వెంటపడేవాడు
ఉన్నచోటునుండి కదలాలనుకున్నందుకు
శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు.

Les hiboux

Sous les ifs noirs qui les abritent,
Les hiboux se tiennent rangés,
Ainsi que des dieux étrangers,
Dardant leur œil rouge. Ils méditent.

Sans remuer ils se tiendront
Jusqu'à l'heure mélancolique
Où, poussant le soleil oblique,
Les ténèbres s'établiront.

Leur attitude au sage enseigne
Qu'il faut en ce monde qu'il craigne
Le tumulte et le mouvement,

L'homme ivre d'une ombre qui passe
Porte toujours le châtiment
D'avoir voulu changer de place.
                      -- Charles Baudelaire: Fleurs du Mal.
చీకటిరాత్రి. శ్మశానము. గుడ్లగూబలు. ఈ  కవిత  చదివిన వెంటనే కలిగే స్ఫురణ, ఇది  నిశిని నిశ్చైతన్యాన్ని,నిశాచరభావాన్ని  చెబుతున్నది, అని . అది మాత్రమేనా?  మరేమైనా కూడా చెబుతున్నదా? వెలుగును ప్రేమించి, యిరులను ద్వేషిస్తూ వచ్చిన కవితను బోద్ లేర్ దారి మళ్ళించాడు, అదృష్టంనుండి  దృష్టం వైపుకు,  శుకపికాలనుండి గుడ్లగూబలవైపుకు, అని అంటారు. అవునా? అలా కనిపిస్తాడు, అంతే. నిదానించి చూస్తే, ఈ కవితలో అశుభదృశ్యం మన ముందుంచి, ఆ అశుభంలో  శుభాన్ని పొదుగుతున్నాడు. దృష్టం నుండి అదృష్టానికి దృష్టి  మళ్ళిస్తాడు  కవి.

"గుడ్లగూబలు"
(Les Hiboux:The Owls)

     ముందుగా గమనించవలసింది, ఈ కవిత శీర్షిక బహువచనంలో ఉంది. అంటే ఇక్కడ గుడ్లగూబ చిత్రం (image)కాదు, ప్రతీక(symbol).దేనికి ప్రతీక? రెండు జీవితవైరుద్ధ్యాలకు-- అశాంతి శాంతి, అంతం అనంతం, మృత్యువు అమరణము, స్థితి గతి.

"నల్లని యూ చెట్ల నీడన"
(les ifs noirs qui les abritent:the dark  yews that shelter them)

నిశాశ్మశాన దృశ్యం. (యూ (yew)చెట్లు శ్మశానంలో ఉంటాయి.) ప్రారంభంలోనే   కవితపై  చీకటి, నల్లని నీడలు పరచుకుంటాయి. కాని నల్లని నీడలు, మృత్యువు నిశి నిశ్చైతన్యాలను సంకేతించినట్టే ఆశ్రయాన్ని కూడా  చెబుతున్నాయి. నీడనివ్వడం ఆశ్రయం యివ్వడమే కదా ( abritent,shelter)?
ఏది విగుణమో అది సగుణం కూడా.శ్మశానంలో ఉండే యూ (yew) చెట్టు  మరణానికి, శాశ్వతత్వానికి కూడా ప్రతీక. కనుక, ప్రారంభంలోనే, కవిత ఆధారం అందిస్తోంది, యిందులో రెండు విరుద్ధముఖాలుంటాయి అని.

"బారులు తీరి"
(se tiennent rangés:sitting in a row)

   'బారులు తీరి' ఒక క్రమపద్ధతిని, సంకల్పాన్ని సంఘటితసంసిద్ధతను చెబుతున్నది.శీర్షికలోని బహువచనం, గుడ్లగూబ వ్యక్తి కాదు అని చెబితే, ఈ " బారులు తీరి"  వ్యక్తిని  ఒక  సంఘటితశక్తిగా ప్రదర్శిస్తున్నది.పగటి ప్రభుత్వాన్ని పడదోసి చీకటిసామ్రాజ్యాన్ని స్థాపించే ఉద్యమసూచన ఉంది.  అలాగే,  ఇందుకు విరుద్ధమైన దృష్టి కూడా. పగటి జీవితంలోని అలజడి ఆందోళన మృత్యుసదృశం; శ్మశానం ఒక ఆరామము, రాత్రి విరామము, అని కూడా సంకేతం ఉంది.

"ప్రవాసదేవతల్లా"
 (dieux étrangers:strange (alien) gods)

ప్రవాసంలో ఉండి అభద్రతతో  భయంతో ఉన్నాయా? లేక,  భయపెడుతున్నాయా? రెండు స్ఫురణలూ ఉన్నాయి. చీకటిసామ్రాజ్యాన్ని అధిష్ఠించి శ్మశానాలను శాసించే దుష్టదైవాలా?  తెలిసిన ముఖాలు కావు, లోకసామాన్యం ఉపాసిస్తున్న దేవతలు కావు. ('నేదం యదిదముపాసతే'.కేనోపనిషత్తు.) కొత్త దేవతలు, పరదేవతలు, alien gods. పూర్వదేవతల పరిపాలనను కూలదోసి, అపూర్వదైవవ్యవస్థను సంస్థాపించగోరే దివ్యశక్తులు.

"రూక్షాక్షులు రువ్వుతూ.ధ్యానం చేస్తున్నాయి "
( Dardant leur œil rouge, Ils méditent: Darting their red  eye. They
meditate)

 'బారులు తీరి', స్థితిని చెబితే, 'రూక్షేక్షులు రువ్వుతూ' గతిని చెబుతున్నాయి.  చలద్రక్తారుణాక్షులు. రక్తారుణిమ,  చలనము ఉన్నాయి వాటి చూపులలో. ఈ గుడ్లగూబలు దైవాలా  దయ్యాలా ? వాటి కళ్ళు అజ్ఞానారణ్యాలను కాల్చివేసే అగ్ని గోళాలు, చూపులు  శ్మశానతామసాన్ని దహించే యోగాగ్ని, Blake కవితలోని పులి కళ్ళలాగా. (' Tiger!Tiger! Burning bright!/In the forests of the night!') అట్లాగే, "రువ్వుతూ" చలనాన్ని అస్తిమితాన్ని చెబితే, వెంటనే  స్తిమితాన్ని సూచించే అచలధ్యానం, medite. ఈ ధ్యానానికీ  రెండర్థాలుండవచ్చు. ప్రణాలిక పన్నడం కావచ్చు, అంతర్ముఖసాధన కావచ్చు. అలజడిని సృష్టించడానికి రహస్యమంతనమా, పగలు సంకేతించే అలజడి ఆందోళనలను కూలదోసి స్థిరశాంతిని సంస్థాపించే  ఆలోచనా?

"నిశ్చలంగా నిలిచి నిరీక్షిస్తాయి"
(Sans remuer ils se tiendront:
motionless, they hold themselves )

నైశ్చల్యము, నిరీక్షణ కూడా  రెండు అర్ధాలు యివ్వగలవు. దౌష్ట్యానికి దివ్యశక్తులకు కూడా ఈ రెండు లక్షణాలు ఉంటాయి. దుష్టవ్యూహరచనచేసేవారు నైశ్చల్యమవలంబిస్తారు, వారి కదలికలు ఎవరినీ గమనించనీయరు. విప్లవానికి అనువైన సమయంకోసం నిరీక్షిస్తారు. అట్లాగే,దివ్యసాధన, దేవతావాహన కూడా నిశ్చలస్థితిలోనే, నివాతదీపంలా, సాగుతుంది. పగటిపూట సచేతనము  క్రియాత్మకము అని మనం సాధారణంగా అనుకునే వ్యర్థవ్యాపారాలనుండి విరమించి నిష్క్రియస్థితిని ") అవలంబించడాన్నే భగవద్గీత చెప్పింది కూడా. ప్రాణిసామాన్యానికి అది నిశ, నిద్రాసమయం.సంయమికి అది మెలకువ.( 'యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ/ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే:'.గీత.2.69.)

'విషాదఘడియలు'
(l'heure melancolique:the melancholic hour )

" విషాదం" కేవలం అశుభాన్ని చెప్పడం లేదు. శమితస్థితిని కూడా చెబుతున్నది. అంతర్ముఖత్వం ఆధ్యాత్మికత ధ్యానోన్ముఖత  కూడా "విషాదం"లో  స్ఫురిస్తాయి.

"వాలుతున్న సూర్యుణ్ణి తోసేసి
చీకట్లు చిక్కబడి స్థిరపడతాయి"
(...poussant le soleil oblique,
Les ténèbres s'établiront:
pushing the slanting sun
the dark night establishes itself.)

వెలుగును ద్వేషించే శక్తులు పడిపోతున్న సూర్యుణ్ణి ఒక తోపు తోసి, తమ సామ్రాజ్యాన్ని సంస్థాపించుకుంటాయి, ఇక తమదే రాజ్యమని. ఇది ప్రకటార్థం. దీనికి  మరో ముఖం. బయటి వెలుగు లేని లోకానికి చీకటిరాత్రి, కాని  సంయమికి అది ఆత్మప్రకాశం. తన వెలుగులో దారి చూసుకొని నడుస్తాడు. అక్కడ సూర్యుడు వెలుగడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, వెలిగించుకోడానికి అగ్గిపుల్లా లేదు. ('న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం ...' కఠోపనిషత్తు.)

 వాటి తీరు చెబుతుంది వివేకికి
 ఈ లోకంలో,  భయపడమని
సంచలనాలకు సంఘర్షణలకు.
(Leur attitude au sage enseigne
Qu'il faut en ce monde qu'il craigne
Le tumulte et le mouvement:
Their attitude teaches the wise
That in this world, one should be weary
Of tumult and movement.)

"Craindre",to be afraid of. అంటే, మెలకువగా, అప్రమత్తంగా, ఉండడమని. ఎవరికి చెబుతున్నాయి, ఈ గుడ్లగూబలు? "au sage", వివేకికి, గ్రహించగలిగిన వివేకం కలవాడికి.  ఏమిటి చెబుతున్నాయి? ఉద్యమాలకు ఆందోళనలకు దూరంగా ఉండమని. పగటి అలజడి ఆందోళన ఆగి, రాత్రిపూట స్తిమితస్థితిని పొందడం చెబుతున్నది. బోధిస్తున్నాయట ( "enseigne", teach) గుడ్లగూబలు! ఎట్లా బోధిస్తున్నాయి? మాటలలో పాఠాలు కాదు. వాటి "తీరు" బోధచేస్తోంది. చిన్ముద్ర, మౌనవ్యాఖ్య. ఏమిటి బోధ?

కదిలిపోయే  నీడల  వెంటపడేవాడు
ఉన్నచోటునుండి కదలాలనుకున్నందుకు
శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు.
(L'homme ivre d'une ombre qui passe
Porte toujours le châtiment
D'avoir voulu changer de place.
:the drunken man of the passing shadow
Always carries the punishment
For wanting to change the place.)

గుడ్లగూబల బోధ ఏమిటి? నిత్యానిత్యవస్తువివేకమే వివేకం. పగటిపూట మన వెంటపడే, మనం వెంటపడే నీడలు కదిలిపోయేవి, అశాశ్వతాలు. వాటి వెంటపడేవాడు అనుభవించే  "శిక్ష"కు అంతం ఉండదు.("toujours", always,ever),దానికి పరిహారంలేదు. అలా నీడల వెంటపడనివాడు వివేకి, నిత్యానిత్యవస్తువివేకం  ఉన్నవాడు.వాడికే ఈ గుడ్లగూబల పాఠం.
      ఈ పక్షులు  గురుస్థానంలో ఉండి నడిపిస్తున్న అదృష్టాధ్వగమననిర్దేశకులు,దేశికులు. ("il faut ", one must , అంటూ శ్రుతివచనంలాగా, "ఏతదనుశాసనమ్" అని  శాసిస్తున్నది.) ఒక గురువాణిని, ఒక  ప్రవక్త చేస్తున్న  భవిష్యదర్థనిర్ణయాన్ని ( "s'etabliront", స్థిరపడుతాయి,future tense) కూడా ఈ కవితలో వినవచ్చు.
       బోద్ లేర్ కు భగవద్గీతకు ముడిపెట్టడమా, అనవచ్చు.  ఒక ముడి కాదు, మూడుముళ్ళు? అసదృశాలను చేర్చి ముడిపెట్టడమే కదా, కవిత అయినా వ్యాఖ్యానమైనా చేసేది? కవిత ఆధారంగా, కవితలోని పదాలు ప్రమాణంగా సాధించగలిగిన    ఏ అర్థమైనా వ్యర్ధం కాదు,సార్థకమే.
     బోద్ లేర్  ఫ్రెంచికవిత్వచరిత్రలో ఒక కొత్త యుగానికి ప్రవక్తగా ప్రసిద్ధుడు. అతనిది ఒక కొత్త స్వరం.అపస్వరం అని కూడా అన్నారు. అపూర్వస్వరం అపస్వరంగా వినిపించక తప్పదు. అది ఒక మహాకవికి, ఒక యుగకవికి అవసరమైన కావ్యప్రక్రియ. యుగకవి ఒక కొత్త వాణితో బాణితో తనను తాను ప్రకటించుకుంటాడు. కాని మహాకవి ధర్మం అతనిని వదలదు. అతడు సిఫిలిజేషన్ చెప్పబోతే అది  సివిలిజేషనవుతుంది. కోతిని గీయబోతే అయ్యవారవుతుంది. దయ్యాన్ని ఆవాహన చేస్తే  దైవం సాక్షాత్కరిస్తుంది. కావ్యధర్మం అంటూ ఒకటి ఉంటుంది. అది కవిపై, మహాకవిపై మరీ బలంగా, తన బలాన్ని చూపుతుంది. ఈ కవిధర్మం కవిపై ఎంతగా విజయం సాధించగలిగితే, కవిత అంతగా పరిపుష్టమైనట్టు.

వాసుతో కాసేపు:

వాసుతో "కాసేపు"

ఆ రోజుల్లో కృష్ణశాస్త్రిని కదిలిస్తే కవిత్వం రాలేదని అంటారు.
కృష్ణశాస్త్రినే కాదు, ఎవరినైనా కదిలిస్తేనే కవిత్వం రాలేది, కదిలించే కవిత్వం.

" కాసేపు" వాసు అలా కదిలి రాసిన కవిత. ఆయన మరి కొంతసేపు కదలాలి అని కోరుకోవలసిన కవితలు. మేమిద్దరం ఒకే సంవత్సరం రిటైరయినట్టున్నాము, ఆయన కవిత్వంనుండి (1987-1992), నేను అధ్యాపకవృత్తి నుండి( 1993 ).ఆయన రిటైర్ కాలేదని , కాకూడదని అనుకొంటున్నాను. కాలేడు. సంచారిణీ దీపశిఖ  కొంటెగా కొంగు విసిరింది.అంటుకున్న కవి, వెంటపడకుండడం సాధ్యం కాదు.
     ఎవడన్నాడో కాని కరుణ ఒకటే రసమని, శోకం శ్లోకమవుతుందని, నన్ను మనసారగా ఏడ్వనీరు మీరు  అని, బాధ కవిత్వానికి పర్యాయపదమని ,మళ్ళీ  "మళ్ళీ బాధ గురించే" వాసు కవిత.ఏమిటా బాధ? "దూరంగా వినువీధుల్లో విహరించే అందని" అందమైన కవితకోసం కాదు.
    "   కెరటాలపై తేలుతున్న పువ్వులానో
        అగ్నిపర్వతపుటంచుపై
        అచంచలంగా మెరుస్తూన్న ఇంద్రధనుస్సులానో
         ................
         క్షణప్రభలా
         అనుక్షణభ్రమలా...
         ఆ సంచారిణీదీపశిఖాంచలస్పర్శకోసం".

బాధలో కవిత  ఆవిర్భవించినప్పుడు,  కవితకొరకైన బాధలో  కవిత కదిలిరాదా? అయితే  సముద్రమథనం జరగాలి. కాఠిన్యము ఆర్ద్రత సాధనాలుగా( "సముద్ర కాఠిన్యంతో సజలశరీరంతో" ) మథిస్తే , సహస్రారంనుండి మేరుదండంలోకి  కవితామృతస్ఖలనం అవుతుంది.("వెన్నులోకి  స్ఖలిస్తాయి  విద్యుత్ సర్పాలు".)
     కవిత్వమంటే బాల్యంలోకి ఎదగడమే, గతానికి  రంగులద్ది గీతంగా పాడడమే.కాని  వానవెలిసిన ఎండలో
ఇంద్రధనుస్సు చూస్తే కవిత్వమెలా అవుతుంది?

"బాల్యం ఇంద్రధనుస్సై
వెన్నెల్ని రంగుల్తో కలబోసేది"

వెన్నెట్లో ఇంద్రధనుస్సు చూశారా ఎపుడైనా? ఈ కవి చూపిస్తున్నాడు. " ఎగరడానికి రెక్కలక్కర్లేని వయసు"లో ఆకాశానికెగిరి రంగులద్దుతాడు కవి.

"ఆ జ్ఞాపకాలు ఒక్కొక్కటీ లోపల రాజుకుని
ఒక్కసారిగా మొహంలో పేలిపోతే
నేనో కంపిస్తున్న కన్నీళ్ళ పర్వతాన్నైపోతాను."

"లోపల రాజుకుని". అది మామూలు పర్వతం కాదు. అగ్ని పర్వతం. అది కార్చేది లావా జలం. అగ్నిజలపాతం.

అంతా అగ్నిపాతమే కాదు, జలపాతం కూడా దర్శించాడు కవి.ఆ జలపాతదృశ్యం ఎదుట కవి కన్నీటితో కరిగిపోయాడు. ఎందుకు ధారాపాతంగా ఏడుస్తోంది ఈ కొండ?పాపం, ఎవరేమన్నారు ? లోకానికి ఇంత ధారపోసినా,

"ఎవరీ ఆర్ద్రనయనిని  దోషిని చేశారు?
  బోనులో పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు? "

అలా అని, మరీ దగ్గర అవకండి.

"యిది గురక పెడుతున్న క్రూరమృగం"

జలపాతం ముందు మనం " తుంపరలం".

ఈ కవితాసంపుటిలో నన్ను నిలబెట్టిన , నన్నేమిటి ఎవరినైనా  నిలబెట్టే,  కవిత " ఎర్రగన్నేరు".పెద్ద చెట్టేమీ కాదు. కాని చెట్టు. చెట్టుకు కవిత్వానికి అనాది సంబంధం, అవినాభావ సంబంధం. మరి కొందరికి చెట్టుకవులని కూడా ప్రసిద్ధి. కాని కవులందరూ చెట్టుకవులే.( కాని వాళ్ళు "చెట్ట" కవులా?) ఇక వాసు చెట్టును ఆశ్రయిద్దాం. ఎలా?

" పరశురాముడు విల్లు అందించినట్టు
   చెట్టుకు నేను చేతినందిస్తాను."

చెట్టుకు నీవు  చేయూతనివ్వడం  కాదు. నీ  అవతారపరిసమాప్తి చేసుకోడం.  నీవు నీవుగా ఏమీ మిగుల్చుకోకుండా యిచ్చుకోడం. చెట్టును నేను నిలబెట్టలేను. "చెట్టు నీడన నుంచుంటాను."

"చెట్టును ఏమడగాలన్నా
 అది చెట్టుకు దూరంగా ఉన్నంతసేపే-"

చెట్టు ను కాదు, మరెవరినైనా " ఏమడగాలన్నా....దూరంగా ఉన్నంతసేపే".దగ్గరైతే ప్రశ్నలు దూరం.

"రెండు మౌన సముద్రాలను కలిపే
 అంతర్వాహిని తప్ప మరేం ఉండదు."

ఆత్మీయతలో మౌనం, మౌనంలో ప్రశ్నలు లీనం.

ఆ చెట్టుకు మనిషి చేసే చెట్ట:

"ఎవరో చెట్టుకున్నవన్నీ వొలిచేసి
మోకాళ్ళమీద కూచోబెట్టారు"

"మోకాళ్ళ" వరకు నరికేసిన చెట్టు ఒక చిత్రం. చెట్టుకు మోకాళ్ళుండవు కదా? అది మరొక చిత్రం. దానికి "వొలిచేసి" కలిపితే ? దానికి " భోగి" ని చేరిస్తే? మరో దృశ్యం. రాక్షసకృత్యం.

" నా పిచ్చిగాని ఇది చెట్టా?
 నరికి భోగిమంటలో పారేసే కట్టె"

"ఎర్రగన్నేరు" కే కాదు, ఈ కవితాసంపుటికే పతాకమనదగిన పంక్తులు:

""ఏమయిందం"టూ నేనూ అడగను
"ఏమయిందంటే"అంటూ చెట్టూ చెప్పదు"

ఉన్నదున్నట్టు జీవితాన్ని స్వీకరించడం అంటే యిదే.ప్రశ్నలు లేవు, ప్రశ్నించడం లేదు.ఇంతకంటే జీవితంలో, జీవితంతో , సాధించగలిగిన చిత్తసమాధానమేముంటుంది! ఇంత పరిణతిని పొందిన కవి ఇంతలో విరమించకూడదు.
         
"కాసేపు":(కవితాసంపుటి) న్యాయపతి శ్రీనివాసరావు.

( ఈ కవితాసంపుటిలో అన్ని కవితలను నేను స్పృశించలేదు. అన్నీ చదువవలసినవే.ఈ సంపుటికి ఇద్దరు ప్రసిద్ధులు ముందుమాటలు రాశారు: వాడ్రేవు చినవీరభద్రుడు, తంగిరాల వెంకట సుబ్బారావు. వాటిని ఇక చదువుతాను. మీరు ఎలాగు చదువుతారు.)

Lord Siva: a poem

Lord Siva

Pull back
And drink the darkness of the passing night.
Drunk,spew curses all around
The world is listening.

Keep the scalding venom
And quiet flows the cool clean light
imperceptibly inundating.

Night or light
Loud mission or quiet vision.

శ్రీయనగౌరినా

పేరులో ఏముంది?  

  'ఒకప్పుడు శివశబ్దం వినబడితే "హరి హరి" అని చెంపలు వాయించుకునే వారు కొందరు.మరి కొందరు, హరిశబ్దం చెవిసోకితే "శివ శివ" అంటూ చెవులు మూసుకునే వారు.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ కాలంలో హరిహరులకు అద్వైతం. హరి, శివ - ఏ శబ్దం వినబడినా చెంపలు వాయించి చెవులు మూస్తారు.'
      ఇది కొంత కాలం క్రితం నేను ఒక కవి కోరగా ఆయన  కవితా సంపుటికి రాసిన ముందు మాటలోని మొదటి వాక్యాలు.కాని ఆ మాటలలో హాస్యం ఉన్నదో లేదో కాని, ఆశించిన సత్యం లేదనిపిస్తోంది.  జాతిని చీల్చడానికి పనికొచ్చే  వైరభక్తి కంటే నాస్తికత మేలనుకొన్నాను. కాని నాస్తికాద్వైతం నేనాశించినంత ప్రబలంగా వ్యాపించలేదు. జాతిని చీల్చడానికి పనికొస్తే , నాస్తికతను ఆగమని, హరిహరులను వాడుకోవచ్చు  అన్న  అనాది భక్తిసూత్రం యింకా పని చేస్తూనే ఉంది. ఈ వీరవైరభక్తి  జాతిని చీల్చడానికి బలమైన సూత్రంగా యుగయుగాలుగా  పనిచేస్తూనే ఉన్నది.  ఆంధ్రమహాభారత రచనను కొనసాగించడానికి మహాకవి  తిక్కన తొలగించుకోవలసి ఉండిన పెద్ద అడ్డు  ఈ  వైరభక్తియే  అని మనకు తెలుసు. అందుకోసం ఆయన ఉన్న దేవుళ్ళు చాలరన్నట్టు , రెండు విగ్రహాలు కరగించి, కొత్త పోతలో ఒక  కొత్త వింతమూర్తిని  సృష్టించి యిచ్చాడు. (కరగించి కొత్త పోతలు పోసే 'రస'విద్యలో ఆయన గట్టి.(" ఒక్కటి కాగ కరగిన గట్టియనగ")ఆ  compound god  కు మరో compound goddess ను కూడా సృష్టించవలసివచ్చింది.

శ్రీయన గౌరి నాఁ బరఁగు  చెల్వకుఁ జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరం బగురూపము దాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయ యని  పల్కెడు భక్తజనంబువైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చుపరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్‌.

"విష్ణురూపాయ నమశ్శివాయ". విష్ణు రూపంలో ఉన్న శివునకు నమస్కారము. శివునిహృదయంలో విష్ణువు, విష్ణువుహృదయంలో శివుడు ఉంటాడని అనాదిగా నిత్యమూ జపం చేస్తూనే ఉన్నది ఈ జాతి. ఆయనకు రెండు పేర్లు. ఆయన  భార్యకుకూడా శ్రీ అని గౌరి అని రెండు పేర్లు . ఇద్దరున్నారన్న ద్వైతంలో భయం ఏర్పడుతుంది. "ద్వితీయాద్వై భయం భవతి"  అని కదా అంటున్నది ఉపనిషత్తు. ఆ భయము అభద్రతాభావము తొలగించగలిగిన హరిహరుడు "భద్రాయితమూర్తియై" సాక్షాత్కరిస్తున్నాడు జాతికి.
           కాని,మహాకవి సృష్టించిన  ఈ మూర్తి ఎంత "గట్టి"  ? అదీ కాలగర్భంలో కరిగిపోయింది. సృష్టిలో ఎప్పుడూ రెండవది లేకుండాపోదు,ఎప్పుడూ పోదు.పోవలసింది, రెండవది ఉన్నది అన్న దృష్టి.అది ఉన్నంతకాలం శివకేశవులే కాదు,  విడదీయరాని అర్థనారీశ్వరులుకూడా విడిపోతారు, శివసేనగా  గౌరీసేనగా.
       ఆత్మీయత లోపించడమే అభద్రత.

Vivekananda’s message to the masses

This is a paper ( Swami Vivekananda’s message to the masses) read at an international seminar conducted by Ramakrishna Math,Hyderabad,long time ago.

https://drive.google.com/open?id=0B0ZEknqlFNmMZmNmZTc3N2ItMjY3Zi00MWVkLWI3NjgtNWM3OTI4OTRlYzYw

Literature and Philosophy: IJAS Book Review


Book Review ( Indian Journal Of American Studies)
Of

Literature and Philosophy by Ross




https://drive.google.com/open?id=0B0ZEknqlFNmMOTEwOTgxNWUtYTA5Ny00MjQzLTkwNjMtMjAxNmNmM2NjOWRm

అనశనం: ముండకోపనిషత్తుపై

అనశనం

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్య: పిప్పలం స్వాద్వత్తి అనశనన్నభిచాకశీతి।।ముండకోపనిషత్తు.3.1.1.
వేదాలు, వేదాంతము ( అంటే, ఉపనిషత్తులు), ఆత్మ ఒక్కటే ఉన్నది అంటాయి. ఈ ఉన్న ఒక్క ఆత్మ

మూడుగా, (జీవుడు జగత్తు ఈశ్వరుడుగా) కనిపిస్తుంది. ఎలా? ఏ ఉపనిషత్తులోనైనా విషయం యిదే.

ఈ ముండక మంత్రం మూడును రెండు చేసి చెబుతున్నది.( "ద్వా"," ద్వౌ"కు వైదికరూపం. 'ద్వౌ సుపర్ణౌ సయుజౌ సఖాయౌ' అని అర్థం చేసుకేవలె. )ఉపనిషత్తులలో చెట్టు ఉపమానంగా గ్రహించడంలో ఆశ్చర్యం లేదు. అడవులను  ఆశ్రమాలుగా ఆశ్రయాలుగా చేసుకున్న ఋషులకు కన్ను తెరిస్తే కనిపించేవి చెట్లే కదా! "న్యగ్రోధోదుంబర" వృక్షాలు తరచు మంత్రాలలో కనిపిస్తాయి. వేళ్ళు పైకి పాకి, కొమ్మలు కిందికి వేలాడే అశ్వత్థవృక్షం కఠంలోను గీతలోను ప్రసిద్ధమే.

     ఇక ఈ ముండకమంత్రవిషయం. ఒక చెట్టు,ఆ చెట్టుమీద రెండు పిట్టలు. రెండు పిట్టలలో ఒకటి జీవాత్మ(విజ్ఞానాత్మ),మరొకటి ఈశ్వరుడు (పరమాత్మ). రెంటికీ ఆశ్రయం చెట్టు. అంటే చెట్టు జీవుని శరీరానికి, ఈశ్వరుని జగత్తుకు, అంటే సర్వసృష్టికి, కూడా సంకేతం. (మూడవది, ఈశ్వరుని శరీరమైన జగత్తు, కూడా చెప్పినట్టే కదా.) ఈ రెండు పిట్టలు అన్యోన్యంగా ఉంటాయి. అన్యోన్యమంటే, ఎప్పుడూ కలిసే ఉంటాయి.విడదీయలేనంతగా కలిసి ఉంటాయి. అంటే ఈశ్వరచైతన్యం వినా జీవుడికి జీవత్వం లేదు. జీవుడు వినా ఈశ్వరుడికి భోజనం లేదు. ( భోక్తృత్వం లేదు.)సమస్తసృష్టిలోని సర్వప్రాణుల  భోజనమే ఆయన భోజనం. అనుభవమే ఆయన అనుభవం.('భుజ్' అంటే తినడం మాత్రమే కాదు.అన్ని యింద్రియాలద్వారా గ్రహించే సర్వము ఆహారమే.అంటే ప్రాణుల సర్వేంద్రియవ్యాపారాలు సర్వానుభవాలు ఆయనవే, ప్రాణులద్వారా. అంటే, వాస్తవంలో ఈశ్వరుడు భోక్త కాడు. సర్వ ప్రాణులకు, వారి కర్మానుగుణంగా, భోజనం కల్పించేవాడు ఈశ్వరుడు, కర్మఫలప్రదాత. బిడ్డలు తింటుంటే ఊరక చూస్తూఉంటాడు.ఇద్దర పిల్లలు, ఒకడు కోటీశ్వరుడు.మరొకడు కూలివాడు. ఇద్దరూ బిడ్డలే. ఎవరి తిండి వాడు తింటాడు. తండ్రి చూస్తూ ఉంటాడు. ('అభిచాకశీతి') సాక్షిమాత్రుడు.జీవుడు తన శరీరంలో పరిమితమై అనుభవిస్తాడు. ఈశ్వరుడు సమస్తసృష్టిని వ్యాపించి సర్వప్రాణులహృదయాలలో ('ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి'.గీత.) ఉండి వాటిద్వారా అనుభవిస్తాడు.అంటే, అనుభవం ఆయనదికాదు, ఆయన ఎవరెవరి హృదయాలలో ఉన్నాడో వారిది ఆ కష్టము సుఖము పుణ్యము పాపము.  అదే చెబుతున్నది, ఈ మంత్రం. 'తయోరన్య: పిప్పలం స్వాద్వత్తి'.

ఒక పిట్ట, జీవుడు, ఆ సంసారవృక్షం యిచ్చే రుచికరమైన (స్వాదు)ఫలాలను తింటున్నది.అన్ని ఫలాలూ స్వాదుగానే ఉంటాయా? కొన్ని చేదుగా ఉండవా? ఉండవనే అంటున్నది మంత్రం. చేదుపండుకూడా

స్వాదుగా ఉండడమే సంసారలక్షణం. ఈ చేదు స్వాదు వద్దు , అనగలిగిన వైరాగ్యం కలిగితే యిక సంసారమేముంది? కనుక కష్టమైనా యిష్టమే అంటున్నాం కాని, సుఖదు:ఖరూపమైన ద్వంద్వంనుండి ముక్తిని కోరుకోడం లేనంతకాలం, 'స్వాద్వత్తి.' సంసారం రుచిగానే ఉంటుంది, సారవంతంగానే అనిపిస్తుంది. ఇది ఒక పిట్ట విషయం. రెండవది, ఈశ్వరుడు. ఆయనది 'అనశనం'. (అనశ్నన్నన్యోభిచాకశీతి.)తినడు,  జీవుడు తింటూఉంటే ఊరకే చూస్తూ ఉంటాడు. తిని తిని ఎప్పటికైనా తిండిమీద విరక్తి కలిగి, పక్కనే తినకుండా ఊరకే చూస్తూ ఉన్న నా వైపు చూడకపోతాడా, అని. చూసినప్పుడు తెలుస్తుంది, ఆ రెండవ పక్షి అంత చిదానందంగా ఎలా ఉండగలుగుతున్నదో. అనశనంలో ఉంది ఆ చిదానందరహస్యం. ఇంద్రియసుఖాలవెంట పడక, తనలో తాను రమించగలిగితే తాను ఈశ్వరుడే. అది తెలుసుకొన్నప్పుడు, ప్రతిబింబం బింబంలో కలిసిపోతుంది. అంటే తాను ప్రతిబింబమేనని తెలుసుకొంటుంది. అంటే తాను, తన సుఖదు:ఖాలు వాస్తవంకాదు.

      ఈ శరీరమనే కర్మాగారం, కర్మక్షేత్రం,సుఖదు:ఖాలకాశ్రయం. అంటే కర్మఫలాలను అనుభవించడానికి ఈ శరీరం అవసరం. కర్మలు కర్మఫలాలు లేనపుడు శరీరంతో పని లేదు. నిజమే, జీవుడికి శరీరంతో పని లేదు. ఈశ్వరుడికి? ఆయన శరీరం, జగత్తు, ఉంటుంది. అంటే, ఈశ్వరుడికి ముక్తి లేదా? అది వేరే ప్రశ్న.

Two posts of Vadrevu Chinaveerabhadrudu

Two posts this week that I don't "like".

And,it is no accident that both the posts are by Vadrevu China Veerabhadrudu. The posts are on:
1. Champaran satyagraha,and
2."Sanskara" of Anantamurthy ,and the subject of Narrative and Discourse.
I will first look at the first. The post was prompted by Somayya garu, who gave him a copy of
a book on the Champaran satyagraha. If Veerabhadrudu has written just a synopsis of the articles in the book,it would still be a marvel.But, no. It is not a synopsis. The text is only a pretext. The post is a passionate reflection on the journey of India during the century and a half,and  where the journey, which began on the platform of a railway station in South Africa, has landed us today.
       History is not dates.Every date is a date with destiny, of a nation, and of a man. A date has many faces,social,political, economic and cultural. And a date means an important stage in the making of a leader. Veerabhadrudu's post reveals the total picture by enhancing the particular with its many faces, weighing each for its relative significance in the whole.
       I am tempted to write a synopsis of the article.
Two important dates in the life of Gandhi, and the history of mankind.
1.1893,June 7.
-A black passenger was thrown out of a first class compartment, In South Africa.
This incident turned out to be a land mark in the history of the world, when all second class citizens,communities, and nations, were jolted into a new awareness.
 -Mohandas became a Mahatma.

 2. 1922,March 18.
- During his trial in a court of law in Ahmedabad, Gandhi said that if acquitted, he would commit the same crime again. That feeble voice of a frail convict was like a thunder heard all over the world.
 - The freedom struggle till then confined to rich and the middle classes became a people's
struggle.

 Between these two historic dates in Gandhi's life,there was  a date more important:

1917,April 18.
If South Africa made Mohandas a Mahatma, Champaran  made him the Father of the nation. Champaran was where the truth that "Truth alone triumphs"(satyameva jayate) was verified on the ground. It was man's first experiment with "truth ", as a political weapon,but a weapon with the patently absurd potentiality of non-injury to both the hurt and the hurting.
     It has been exactly a century since Champaran happened, and today no one seems to be aware of it.We are lost in mindless media entertainment . Nor do we remember the other movement,Naxalbari, half-a-century ago,another landmark in Indian history,an armed uprising of the farmers against the landlords.
     Neither of these two dates mean anything to us today.
For, our school textbooks have no significant space for them.And our writers haven't found them fertile subjects for creative writing.
      Veerabhadrudu's article is a piece of creative writing, a model for writers. It has details. It gives the totality. It is passionate. It moves.
       He may have written it easily, and we "like" it more easily, and move on. It is a piece to save,read again, and absorb.
      (I will write about the other post another day.)

పునరుత్థానము-టాల్స్ టాయ్ Resurrection

"పునరుత్థానము"
(‘The Resurrection’ by Tolstoy.)

[ఈ నవల 1889లో రాశాడు టాల్స్టాయ్.ఇది చదువుతున్నపుడు అనిపిస్తుంది,ముఖ్యంగా కొన్ని ఘట్టాలలో,రష్యన్ విప్లవం ( 1917 ) దూరంలో లేదని.అగ్నికిరీటపు ధగధగలు కనబడడం లేదు.యజ్ఞహోమం భగభగలు లేవు.కాని సమిధల సమీకరణ కనిపిస్తుంది. ఈ  నవలలో  ప్రధాన విషయం విప్లవం కాదు.  ఇద్దరు  వ్యక్తులు వారి గమ్యాలు వెదుక్కొంటున్నారు. వారి కథ ప్రధానం.వారి  కథతో   విప్లవకారణాలు పెనవేసుకొని, రెండు కథలు కలిసి నడుస్తాయి.  ఆ యిద్దరూ వ్యక్తులుగా ఎదగడమే నవలలో ప్రధానవిషయం. ఎటువంటి అవ్యవస్థలో అణచివేతలో కూడా,మనిషి ఎదగవచ్చు, మనిషిని నిలుపవచ్చు,అని చూపగలిగేది సాహిత్యమే. సాహిత్యప్రయోజనమే అది.
    మన దేశంలోను 1917 లో విప్లవం కాదు కాని,విప్లవాత్మకమైన ఉద్యమం( చంపారన్ సత్యాగ్రహం) నడిచింది. దాని వెనుక ముందు ఏదైనా గొప్ప నవల వచ్చినట్టు తెలియదు.
    రచయితలు విప్లవాలను రచించ గలరు.విప్లవాలు రచయితలను సృష్టించలేవు.
    ఉద్యమాలు, విప్లవాలు వస్తాయి పోతాయి. నిలిచిపోయేది సాహిత్యం.]

     "ఆనా కెరినినా", "యుద్ధము, శాంతి" తరువాత   టాల్స్టాయ్  సుమారు పాతిక సంవత్సరాలకు  రాసిన  మరో నవల , అతని చివరి నవల, "పునరుత్థానము" (“Resurrection”) .సైబీరియాలో మగ్గుతుండిన 'దుఖోబోర్' అనే ఒక క్రైస్తవ తెగవారిని  పునరావాసం కొరకు కెనడాకు పంపడానికి  అవసరమైన నిధిసేకరణకొరకు రాశాడు ఈ నవల. కాని వాస్తవంలో ఇది ఆయన ఎవరి కొరకో రాసిన నవల కాదు. తన కొరకు రాసుకొన్నది.రాయకుండా ఉండలేక రాసినది. తన జీవితాన్ని, తన అసదృశమైన రచనాశక్తిని,  సార్థకం చేసుకోవలెనని రాసిన నవల. తనను ప్రపంచసాహిత్యంలో అగ్రశ్రేణిలో నిలబెట్టిన తన మొదటి నవలలు రెండు తనకు సంతృప్తినివ్వలేదు. అంటే ఈ చివరి నవల రాయడం రచయితగా వ్యక్తిగా ఆయనకు ఎంత అవసరమైందో తెలుస్తున్నది. దీనిని రాయడానికి  టాల్స్టాయ్ కి  పదకొండు సంవత్సరాలు పట్టిందట.  ఆయననుండి  మరో నవలకోసం పాతికేళ్ళు ఎదురుచూచిన పాఠకులు మహదానందంతో దాన్ని ఆదరించారు. మొదటి రెండు నవలలను మించి కాపీలు అమ్ముడుపోయాయి. 'టాల్స్టాయ్ రచనలలో అన్నిటికంటే ఉత్కృష్ట మైనది',  అన్నారు అందరూ ఆనాడు. ఈ నాడు దానికి అంత ఆదరణ లేదు. మొదటి రెండు నవలలతో పోల్చదగిన  సాహిత్యగుణాలు యిందులో లేవని అంటారు, చదివిన కొందరు. టాల్స్టాయ్ కూడా  ఈ నవల గూర్చి పూర్తి సంతృప్తి చెందలేదు. "ఆ నవల సంతృప్తికరమైన సంపూర్ణరూపం సంతరించుకొనే లోపలే బయటపడింది",అన్నాడు ఆయన స్వయంగా. రచయిత భావాన్నే బహుశా Percy Lubbock ప్రతిధ్వనించాడు:  “అది ఒక బృహద్రచనలోని శకలం",('the fragment of an epic')అని.('"The Craft of Fiction" by Percy Lubbock:Jonathan Cape,1921)
     ఇంతకూ ఈ నవలాశిల్పం గురించిన నిజం ఏమిటి? వయసుపైబడి, టాల్స్టాయ్ రచనాపటిమ జవసత్త్వాలుడిగిన కారణంగా ఈ నవల అతని మొదటి రచనల స్థాయిని అందుకో లేక పోయిందా? లేక,  వయసుతో పొందిన  మన:పరిపాకానికి అనుగుణంగా పరిణతమైన  ఆయన  శిల్పం మనం అర్థం చేసుకోలేకపోతున్నామా?  కొందరు రచయితలు, వారి మొదటి రచనలలో చూపిన ప్రతిభ తరువాతి రచనలలో చూపలేకపోయారు. కాని, షేక్స్పియరు  “The Tempest " రాసినప్పుడు ఆయన మంత్రశక్తి మందగించింది అనగలమా? టాల్స్టాయ్ చివరి రచన కూడా అటువంటిది కాదా? (ఇక్కడ సామ్యం, రచయిత పరిణతశిల్పంలో. షేక్స్పియరు వయసు పైబడక ముందే తన మంత్రదండాన్ని విసిరిపడేశాడు.అది వేరే విషయం.) గొప్పరచయితలు రచనల ప్రారంభదశలో సాధారణంగా శిల్పానికే  పెద్దపీట వేస్తారు. ‘వస్తువు కూడా శిల్పంలో అంతర్భవిస్తుంది, దానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు’  అంటారు. కాని ఈ వాదము యీ కావ్యదృష్టి వయసు గడిచే కొద్దీ మారుతుంది. వస్తువు ప్రాధాన్యం పెరుగుతుంది. ఇది రచనాపాటవం ఉడిగిన కారణంగా కాదు. జీవితానుభవంలో జీవితదృక్పథంలో  కలిగిన మార్పు దీనికి కారణం. అయినా తమలో కలిగిన ఈ  మార్పును చాలామంది రచయితలు  ఒప్పుకోలేరు. తమ రచనా శక్తి తగ్గడం కారణమని లోకం అనుకుంటుందేమోనన్న సంకోచము, శిల్పప్రాధాన్యాన్ని తక్కువ చేస్తున్నామేమోనన్న సంశయము ఒప్పుకోనివ్వవు. ప్రస్తుత నవలలో (“The Resurrection”) టాల్స్టాయి మొదటి రచనలలోని శిల్పం లోపించిందని, వస్తువు ప్రధానమై, రచయిత తన ధర్మాగ్రహం వ్యక్తం చేయడానికి నవలను  సాధనంగా వాడుకున్నాడని, ఒక  సాధారణభావం ఏర్పడింది.  ఈ భావం ఎంతవరకు సరి అయినది పరిశీలించవలె.
     
         ఈ నవలలో రెండు ప్రధాన పాత్రలు,కథానాయకుడు నెఖ్లుడోఫ్, కథానాయిక మేస్లోవా. మూడవ పాత్ర,  నవలను నిండి వ్యాపించిన  రచయిత ధర్మాగ్రహం. ఆ నాటి రాచరికపు అరాచకం, న్యాయవ్యవస్థను నిండిపోయిన అన్యాయం, అధికారుల అమానుషత్వం, మనిషిని మనిషిగా చూడని చూడనివ్వని రాజ్యం, మతిలేని మతం--వీటన్నిటిపై రచయిత ఆగ్రహం మరో ప్రధానపాత్ర. బైబిల్ లోని శామ్సన్ తానున్న మొత్తం భవనాన్ని  ఒక ఊపు ఊపి  కూలగొట్టి,  అందులోని వారినందరిని సర్వనాశనం చేస్తాడు, తానూ ఆ కుప్పలో కలిసిపోతాడు.  అటువంటి ధర్మాగ్రహమే ఈ నవలనంతా వ్యాపించి ఉంటుంది. నిజమే, ఈ ఆగ్రహం కథను కావ్యం కాకుండా చేసిందా? కాని ఈ ధర్మాగ్రహమే, దాని పర్యవసాయమే కావ్యవస్తువు ఎందుకు కారాదు?
         
  కథానాయకుడు,నెఖ్లుడోఫ్
   
      నవల ఒక న్యాయస్థానంలో ఒక హత్యానేరవిచారణ సన్నివేశంతో మొదలవుతుంది. మేస్లోవా ప్రధాననిందితురాలు. ఆమె ఒక వేశ్య. ఆమె వద్దకు వస్తూ ఉండే ఒక వ్యక్తిని అతడి డబ్బుకోసం ఆమె విషమిచ్చి చంపిందని ఆమెపై నేరం. జూరీసభ్యులలో ఒక రాకుమారుడు, నెఖ్లుడోఫ్, కూడా ఉన్నాడు. అతడు ఖైదీని గుర్తుపడతాడు. సుమారు పది సంవత్సరాల వెనుక ఆమెను తన ఆంటీల  యింట్లో కలిశాడు.వారు ఆమెను ఒక నిరుపేదకుటుంబంనుండి  తెచ్చుకొని  తోడుకోసం పెంచుకున్నారు. ఆ యింట్లో ఆమె  పనిపిల్లకంటే ఎక్కువ,  కూతురుకంటే తక్కువ.అక్కడ  నెఖ్లుడోఫ్ ఆమెను  గర్భవతిని చేసి, వంద రూబుల్స్ చేతిలో పెట్టి చేతులు తుడుచుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆమెను చూడడం ఇప్పుడు ఈ స్థితిలో. విచారణలో తెలిసింది, ఆమె ఆనాటి  కటూషా,( “కేటరీనా”ను కుదించిన పేరు) అని, ఆ తరువాత ఆమె వేశ్యావృత్తిలో జీవితం గడిపిందని.ఆమె ఈ దుస్స్థితికి తను ఆమెకు ఆనాడు చేసిన అన్యాయమే కారణమని,ఆమెను ఆ పాపకూపం నుండి బయటకు తెచ్చి ఆమెకు న్యాయం చేయవలె, అవసరమైతే ఆమెను పెళ్ళికూడా చేసుకోవలె, అనుకుంటాడు, నెఖ్లుడోఫ్.  అంటే, ప్రధానపాత్రలో పరివర్తన కథాప్రారంభంలోనే  జరిగిపోయింది.అతని అపరాధకారణంగా అతనిలో కలిగిన  అంతస్సంఘర్షణ, సంక్షోభము, వాటి ఫలితంగా అతనిలో కలిగిన  మార్పు,  కథా వస్తువు కాదు, దోస్తోవ్ స్కీ నవలలోలాగా. ఈ టాల్స్టాయ్ నవలలో వస్తువు , నేరము శిక్ష కాదు,  పాపము పశ్చాత్తాపము కాదు. ఇందులో ఇతివృత్తము,   పరివర్తన ప్రవర్తన. తన బాధ్యతారహితమైన జీవనవిధానంమీద అతనికి విరక్తి కలుగుతుంది. తన సుఖజీవనము,దానికి ఆధారమైన తన ఆస్తులు, సమాజంలో తన అంతస్తు    అన్నీ వదిలివేయవలె అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయానికి అనుగుణంగా వెంటనే చర్యలు మొదలుపెడతాడుకూడా.
     మేస్లోవాకు సైబీరియాలో ప్రవాసము, నాలుగు సంవత్సరాల కఠినశిక్ష విధించింది న్యాయస్థానం. నెఖ్లుడోఫ్  మేస్లోవాని కలిశాడు జైలులో. తన తప్పును క్షమించమని, తనను పెళ్ళిచేసుకుంటానని అంటాడు. అతన్ని గుర్తుపట్టిన వెంటనే ఆమె, ‘ వెళ్ళిపో,నేనో ఖైదీని.నీవు రాకుమారుడివి. నీకిక్కడేం పని. ..ఈ లోకంలో నీ అవసరానికి వాడుకున్నావు అప్పుడు .ఇప్పుడు పైలోకంలో నీ అవసరానికి నేను కావాలి నీకు. నీ ముఖం చూస్తే అసహ్యమేస్తుంది నాకు…నీ కళ్ళజోడు, నీ దిబ్బముఖం!’, అంటుంది.(తన జీవితాన్ని నాశనంచేసిన మనిషి, కనిపించడనుకున్నవాడు, ఇంత కాలానికి కనిపిస్తే,  ఆమె అలా అనకపోవడం  అసహజం.)
     ఇక్కడే మొదలు, అతని పరివర్తనకు పరీక్ష. అతడి త్యాగబుద్ధిని ప్రతి ఒక్కరు శంకిస్తారు, ప్రతి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ  తిరస్కరిస్తారు, ఒక్కొకరు ఒక్కొక కారణంగా. మొదటి తిరస్కారం  తన పరివర్తనకు నిమిత్తమైన మేస్లోవానుంచే కావడం విశేషం.కాని ఆ తిరస్కారంలో అతడు తన నిర్ణయాన్ని నిశ్చయాన్ని సడలనివ్వడు. అలా అని అతని పరివర్తన ఒక సరళరేఖలా సాగిందని అర్థం కాదు. తనలోను వెలుపలకూడా  ఘర్షణను  ఎదుర్కొన్నాడు. రాకుమార్తెలు, సంపన్నకుటుంబాల స్త్రీలు,పెళ్ళి అయినవాళ్ళు కావలసినవాళ్ళు,  అతన్ని పెళ్ళిచేసుకోవలె అని ఆరాటపడుతున్నారు. ‘ఆ చెడిపోయినదాన్ని చేసుకొని ఏం సుఖపడతావు’, అని   అక్క  అడుగుతుంది నెఖ్లుడోఫ్ ను.  ‘ ఇప్పుడు విషయం  సుఖం కాదు’ , అంటాడు.అతని మొదటి పని, మేస్లోవాకు న్యాయస్థానం అన్యాయంగా విధించిన శిక్షను తగ్గించడం. ఆ ప్రయత్నంలో అతడు తాను దూరమవాలనుకొన్న సమాజసభ్యులను, సమాజవ్వస్థను ఆశ్రయించవలసి వచ్చింది. అతనికి యిష్టంలేని పని అయినా , ఆమె కొరకు తనకు నచ్చని వారిని ఎందరినో సహాయం అడిగి తీసుకొనేనాడు. అతని ప్రయత్నం ఒకవైపు సాగుతూ ఉంటుంది.మరొకవైపు ప్రభుత్వం మేస్లోవాను, ఆమెతోపాటు అసంఖ్యాకమైన ఖైదీలను,  సైబీరియాకు తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది.నెఖ్లుడోఫ్ మేస్లోవాకు తోడుగా ఉండడానికి సైబీరియా వెళ్ళవలె అని నిశ్చయించుకుంటాడు. అది తనకు తాను విధించుకొన్న  శిక్ష. వెళ్ళేలోపల యిక్కడ తనకు సాధారణజీవనానికి అవసరమైనంత మాత్రమే ఉంచుకొని, తక్కిన ఆస్తులు దానం చేసెయ్యాలనుకొంటాడు. తన భూములున్న గ్రామాలకు వెళుతాడు. తన పొలాలు వ్వవసాయంచేసుకునే రైతులకు ఉచితంగా యిచ్చేస్తాను అంటే, వారు నమ్మరు. ఇందులో ఏదో దురుద్దేశం ఉండి ఉంటుంది అని అనుమానిస్తారు. ఈ విధంగా అడుగడుగునా తన త్యాగబుద్ధిని శంకిస్తూనే ఉన్నా,   త్యాగాన్ని తిరస్కరిస్తూనే ఉన్నా, అతడు తన త్యాగబుద్ధిని, త్యాగాలను మానుకోడు.ఇది నిజమైన త్యాగానికి నికషం. త్యాగం ఒకరిని ఉద్ధరించడానికో, వారి మెప్పు కొరకో చేసేదికాదు. ఒకరి ఆమోదంపై ఆధారపడేదీ కాదు. ఆత్మోద్ధరణకొరకు చేసేది.
     మేస్లోవాను కలవడానికి తను తరచు జైలుకు వెళ్లడం, అక్కడి దుర్గంధం దుర్మార్గం దుస్థితి , యివి నవలలో సమాంతరంగా సాగే కథావస్తువులు. నిజానికి ఈ రెంటినీ పడుగుపేకగా అల్లిన రచయిత నైపుణ్యం అద్భుతం. ఖైదీలను సైబీరియాకు తరలించడం నవలలో చాలాభాగం ఆక్రమిస్తుంది.వివిధ జైళ్ళనుండి ఖైదీలను ఒకచోట చేర్చారు.అందులో చాలామంది ఏ నేరము చేయని వారే, మేస్లోవా వలె.  న్యాయనిర్ణయంలో నిర్లక్ష్యం వల్ల, విచారణలో లోపం వల్ల, ఎందరో జైళ్ళలో ఏళ్ళతరబడి మగ్గుతున్నారు- యువకులు,ముసళ్ళు, స్త్రీలు, తల్లులవెంట పసిపిల్లలు, రోగులు. అందరికీ కాళ్ళకు గొలుసులు. ఆ గొలుసులు ఈడ్చుకొంటూ వారిని రైలుస్టేషనుకు మండే ఎండలో నడిపిస్తారు. నడవలేని వాళ్ళు నడుమనే రాలిపోతారు, "నీళ్ళటాంకరునుండి నీళ్ళు దారి పొడుగునా ఒలికి పోయినట్టు." స్టేషనులో పధ్నాలుగు పెట్టెల  ట్రెయిన్ సిద్ధంగా ఉంది. ఒక పెట్టె  పోలీసులకు.పదమూడు పెట్టెలలో ఖైదీలు. కాళ్లకు  గొలుసులు, ఎండకు పెనంలా కాలిపోతున్న పెట్టెలు, మైళ్ళు నడిచి చెమటలు. ఆ ట్రెయిన్ కదులుతుంటే చూచినవారికి ‘ రష్యన్ విప్లవం ఎంతో దూరంలేదు’, అనిపిస్తుంది. ఈ ఖైదీల దుస్స్థితి  , మేస్లోవాతో కలిసి,  నెఖ్లుడోఫ్ జీవితగమనంలో భాగమవుతుంది.
     నెఖ్లుడోఫ్  ఖైదీ కాడు.కనుక ఖైదీల  ట్రెయిన్లో వెళ్ళనివ్వరు. మరో రెండు గంటలలో  వేరే ట్రెయిన్లో మేస్లోవాను అనుసరిస్తాడు. పెర్మ్ అనే స్టేషన్ సైబీరియా చేరడానికి ముందు, చివర ఆగవలసిన ప్రదేశం. అక్కడ మేస్లోవాను కలుస్తాడు.ప్రయాణంలో ఆమెకు కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. సిమన్సన్ ఆమెకు దగ్గరవుతాడు,పెళ్ళి చేసుకుంటానంటాడు. మేస్లోవా కాదనదు.సిమన్సన్  నెఖ్లుడోఫ్ అభిప్రాయం  అడుగుతాడు. ‘ఆమెకు స్వేచ్ఛ ఉంది. నాకు లేదు’,అంటాడు నెఖ్లుడోఫ్. అంటే, ఆమె తన త్యాగాన్ని స్వీకరించినా తిరస్కరించినా, తన పరివర్తనలో ప్రవర్తనలో  మార్పు ఉండదు, అని. మేస్లోవా కఠిన శిక్షను తగ్గించడానికి అతడు చేసిన ప్రయత్నాలు వాళ్ళు సైబీరియా దారిలో చివరి దశలో ఉండగా ఫలించాయి. కాని మేస్లోవా సైబీరియాలో సిమన్సన్ తో ఉండడానికే నిర్ణయించుకుంటుంది. నెఖ్లుడోఫ్ కు సంతోషాన్నిచ్చే పరిణామం కాదు.కాని అతని జీవితలక్ష్యం యిప్పుడు సంతోషం కాదు,పరమార్థసాధన. కథానాయకుడి   సుదీర్ఘమైన ధర్మచింతనతో, బైబిల్ లోని దశనిర్దేశాల మననంలో, ఆ దిశలో తన జీవితాన్ని నడిపించవలె అన్న అతడి సంకల్పంతో నవల ముగుస్తుంది.
      నెఖ్లుడోఫ్ పరివర్తన  త్యాగము, నవల ముగిసినప్పటి అతని మన:పరిపాకము అతనిని చాలా ఎత్తులో నిలుపుతాయి. ‘తనది’(’మమ’) త్యాగం చెయ్యడం నవలలో ఆద్యంతము ప్రధాన కథావస్తువు.ఇక, ‘తనను’(‘అహం’) త్యాగం చేసే దారిలో నడిచే సంకల్పంతో,   నవల ముగుస్తుంది.
         మరి ‘చెడిపోయిన’ మేస్లోవా కథ?

మేస్లోవా

    మేస్లోవా అసలు పేరు కేటరీనా. పెంచిన వారు అంత గొప్ప పేరుతో పిలవడం యిష్టంలేక,  కటూషా అనేవాళ్ళు. ఆమె తల్లి బానిస(serf),అవివాహిత. అయిదుగురు పిల్లలను కనవలసివచ్చింది,తన యిష్టానిష్టాలతో సంబంధం లేకుండా. కన్నపిల్లల్ని పెంచలేక వదిలేసింది. వాళ్ళు చనిపోయారు.ఆరవపిల్ల కేటరీనా. ఈమెకూడా వారిలాగే పోవలసిందే.  కాని, ఊరిలోని యిద్దరు సంపన్నస్త్రీలు, (మేరీ, సోఫియా) ఆ పిల్ల పోషణకు తల్లికి సహాయం చేశారు. ఆ పిల్ల మూడో ఏట, తల్లి పోయింది. మేరీ, సోఫియాలు ఆ పిల్లను యింటికి  తెచ్చుకుంటారు.ఆ యిద్దరిలో ఒకరు ఆ పిల్లను కూతురుగా చూస్తే, రెండవ ఆమె పనిపిల్లగా పెంచింది. వాళ్ళిద్దరూ కథానాయకుడికి ఆంటీలు. నెఖ్లుడోఫ్ ఒకసారి  వాళ్ళ యింటికి వస్తాడు, సెలవులు గడపడానికి. అప్పుడు కటూషాను చూస్తాడు,  ప్రేమిస్తాడు.అప్పటికి అతడికి  ప్రేమ అంటే ఒక స్వచ్ఛమైన భావమే.ముద్దుతో ఆగిపోతారిద్దరు. మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ వస్తాడు.ఈ సారి ముద్దుతో ఆగడు. మరో అడుగు ముందుకు వేస్తాడు.  (అతని మొదటి ముద్దుకు రెండవ ముద్దుకు మధ్య, నవలలో ఒక అధ్యాయం అంతరాయం ఉంది. ఆ రెండు ముద్దులకు అంతరం ఆ అధ్యాయంలో ఉంది. ఆ అధ్యాయం పేరు, ‘సైన్యంలో జీవితం’.’Life in the Army’. దీని చర్చ తరువాత చేద్దాం.)కథానాయకుడు  తిరిగివెళ్ళేలోపు ఆమెను గర్భవతిని చేస్తాడు.(అదే కథకు బీజం.)  వెళ్ళిపోతూ ఆమె చేతిలో బలవంతంగా వంద రూబుల్స్ పెట్టి వెడతాడు. (అతడు రాకుమారుడు.అంతకంటే తక్కువ యివ్వలేడు!). ఆ తరువాత పది సంవత్సరాలకు ఆమెను చూడడం  కోర్టులో.ఈ మధ్య పది సంవత్సరాలలో ఆమె బిడ్డ పుట్టి పోవడం, బతుకు గడవడంకోసం ఆమె వేశ్యగా మారడం, చేయని హత్యకు  జైలుకు వెళ్లడం,యిప్పుడు   ఈ హత్యానేరవిచారణ-- యివన్నీ జరిగిపోయాయి.  ఇక్కడ అసలు కథ మొదలవుతుంది.
      నెఖ్లుడోఫ్ తన తప్పును సరిదిద్దుకోవాలనుకొంటాడు.మేస్లోవాను క్షమించమంటాడు. ఆమె  హేయమైన గతాన్ని తెలిసికూడా,  ఆమెకిష్టమైతే ఆమెను పెళ్ళి చేసుకొంటానంటాడు. అతడు రాకుమారుడు.మేస్లోవా తను జన్మలో ఊహించని స్థాయి అతడు  కల్పిస్తానంటే ఎగిరి గంతేసిందా?లేదు.ఆమె తిరస్కరించింది. ఆ క్షణంలో అది ఆపుకోలేని ఉద్వేగం కావచ్చు. ఉద్వేగం క్షణికమే, కాని నిర్ణయం చివరి వరకు, నవల ముగిసే వరకు, మారదు. కాలం గడిచి ఉద్వేగం ఉడిగి, అతని త్యాగతత్త్వం అర్థం చేసుకొన్నది మేస్లోవా.  కాని నిర్ణయం మార్చుకోలేదు. అతడూ  తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.అతడు ‘ఒక సారి అడిగాను, చాలు.ఇంక ఎన్ని సార్లు అడగాలి?’, అనుకోలేదు. ఆమెను జైలులో చాలా సార్లు కలిశాడు, ఆమెకు ఊరట కలిగించడానికి, అవసరమైన సహాయం చేద్దామని. జైలులో ఆమెను కలవడం అంత సులభం కాదు. అనుమతి కొరకు ఎంత మందినో ఆశ్రయించాలి. ఇంత కష్టపడి ఆమెను కలిస్తే, ఆమె తన కొరకు ఏమీ కోరేది కాదు. తోటి ఖైదీల కష్టాలు చెప్పి, అతడికి ఈ సహాయం చేయగలరా, ఆమెకు ఆ సహాయం చేయగలరా, అని అడిగేది. నెఖ్లుడోఫ్  ప్రిన్స్ అని, పలుకుబడిగలవాడని తెలిసి, ఖైదీలు మేస్లోవాను తమ తరఫున అడగమనేవారు. అతడు చేయగలిగినది చేసేవాడు కూడా. నెఖ్లుడోఫ్ , మేస్లోవా  ఇద్దరూ ఒకే దిశలో ఎదుగుతున్నారు. ఆ ఎదుగుదలలో యిద్దరూ ఒకరికొకరు దూరమైపోతున్నారు. వైముఖ్యంతో కాదు,అనాసక్తతతో. ప్రేమ విలువ తెలియక కాదు,ప్రేమ పరిధులు విశాలమై.
      అతడు  చాలామార్లు  ఆమెను చేసుకొంటానంటాడు. అడిగినప్పుడల్లా ఆమె తిరస్కరిస్తూనే ఉంది. కాని ఆ తిరస్కారస్వరూపం కాలక్రమంలో  మారుతూంటుంది. మొదటి తిరస్కారం కోపంలో ఉద్వేగంలో కలిగింది. తరువాతి తిరస్కారం అతని త్యాగము  ప్రేమతత్త్వము  తెలిసి, అతని జీవితాన్ని తన గతంతో మలినం చేయలేక, కృతజ్ఞతతో  ప్రేమతో చేసిన తిరస్కారం. నెఖ్లుడోఫ్ ఆమె శిక్షను తగ్గించే ప్రయత్నాలు పట్టువిడవక చేస్తూనే పోయాడు. చివరకు, ప్రయాణపు చివరి దశలో, సైబీరియా  సరిహద్దులు చేరుకొన్నాక, అతని ప్రయత్నం ఫలించి, ఆమె కఠినశిక్షను సాధారణశిక్షగా తగ్గిస్తూ ఉత్తరువు వచ్చింది. ఆమె సైబీరియా వెళ్ళనవసరం లేదు. నెఖ్ల్లుడోఫ్  మళ్ళీ అడిగాడు పెళ్ళిచేసుకొంటానని. ఆమె మళ్ళీ కాదన్నది.కాని అప్పటి కారణం, ఆమెకు పెళ్ళిపై కోరిక రాలిపోయింది. సిమన్సన్ అనే ఒక ఖైదీ ఆమెను చేసుకొంటానన్నాడు. ఆమె అతనితో సైబీరియా వెళ్ళిపోవలెనని నిశ్చయించుకొన్నది. నెఖ్లుడోఫ్  మేస్లోవాను ప్రేమించడం అతని కొరకు, ఆత్మార్థం.సిమన్సన్  ఆమెను  ఆమె  కొరకు యిష్టపడుతున్నాడు.ఆమెకు తెలుసు,తనను చేసుకున్నవాడికి జీవితంలో సంతోషం ఉండదని. నెఖ్లుడోఫ్  ఆమెను అడిగాడు, 'సిమన్సన్ ను పెళ్ళిచేసుకోడం నీకు యిష్టమేనా?' అని. ఆమె అన్నది, 'నా  గతంతో,  నేనతనికి  ఎటువంటి భార్యగా ఉండగలను?'   సిమన్సన్ ను పెళ్ళి చేసుకోవాలి అనుకోలేదు,
 సైబీరియాలో అతనికి తోడుగా ఉండాలనుకొన్నది, అతడు తనను కోరుకొంటున్నాడు కనుక.
        ఆమె శిక్షను  తగ్గించినా, ఆమె శిక్ష పూర్తిగా అనుభవించదలచుకుంది. తాను చేయని హత్యకు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వినిపించినపుడు ఆమె బాధపడలేదా?  ‘అవును.నాకు శిక్ష పడినప్పుడు నేను ఏడ్చాను.మరి? ఆ శిక్షకు భగవంతుడికి నేను బతికున్నంతకాలము దణ్ణం పెట్టుకోవాలి.’ ఆ తీర్పు తాను చేయని హత్యకు విధించిన అన్యాయమైన శిక్ష అనుకోలేదు ఆమె. తాను జీవించిన హేయమైన బతుకుకు భగవంతుడు విధించిన న్యాయమైన  శిక్ష అనుకుంది. ఆమె దృష్టిలో ఇన్నాళ్ళు ఆమె బతికిన బతుకు నిజమైన శిక్ష. న్యాయస్థానం విధించిన శిక్ష యథార్థమైన విముక్తి. ఆమె తన జీవితాన్ని శిక్షలో ప్రక్షాళనం చేయాలనుకొంది. సైబీరియా, ఆమెకు విధించిన శిక్ష కాదు,ఆమె ఎన్నుకున్న purgatorio.
        చివరి సారి నెఖ్లుడోఫ్ పెళ్ళి ప్రస్తావన తెచ్చినపుడు ఆమె అంది: ‘ప్రిన్స్ ! నన్ను క్షమించు. నీవు కోరింది నేను చేయలేదు. నా కోసం ఎంతో చేశావు.నాకు తెలుసు.కాని,  నీకూ ఒక జీవితం కావాలి…’, అంతకంటే ఏమీ అనలేకపోయింది, మరో విధమైన ఉద్వేగంలో. ‘నీకూ ఒక జీవితం కావాలి’, అదీ ఆమె చివరి తిరస్కారస్వరూపం.  అది ఆ "పతిత" ఎదిగిన ఎత్తు.
      ఇద్దరి త్యాగాలలో ఎవరి త్యాగం గొప్పది? ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగారు? ఇద్దరూ కలిసి ఎదిగారు, కలవలేనంత ఎత్తుకు ఎదిగారు.

మూడవ పాత్ర

     ఇప్పుడు కథలో మూడవ ప్రధానపాత్ర, కథను ఆద్యంతము నడిపించిన కనిపించని పాత్ర, రచయిత ధర్మాగ్రహం. ఈ ఆగ్రహం  టాల్స్టాయ్ కి  సహజమైన వ్యంగ్యంలో వ్యక్తమవుతుంది. వ్యంగ్యం (satire) సహజగుణమైన రచయితకు, దాన్ని అధిగమించడం కష్టం. ఈ కష్టానికి ఉదాహరణగా  మన రావి శాస్త్రిని చెప్పుకోవచ్చు. హాస్యం నుండి విషాదంలోకి నడిపించడం సులభమనిపిస్తుంది, షేక్స్పియరుకులాగా.  టాల్స్టాయ్ అనాయాసంగా  వ్యంగ్యంలోనుండి విషాదాన్ని అందుకోగలడు.
      మొదటి  కోర్టుసీనులోనే  వ్యంగ్య విషాదం ఉంది. చేయని హత్యకు మేస్లోవాకు శిక్షవిధించడంలోనే న్యాయవ్యవస్థ పనితీరుపై తన ఆగ్రహం వ్యంగ్యరూపంలో వ్యక్తం చేస్తాడు టాల్స్టాయ్. నిందితురాలికి అది జీవన్మరణసమస్య.కాని, జూరీసభ్యులకు, ప్రధానన్యాయమూర్తికి,  అది ఆ రోజు మూసేయవలసిన మరొక  కోర్ట్ ఫైల్.జూరీసభ్యులు హాజరుకాక తప్పదు కనుక,  ఆ రోజు వాళ్ళవాళ్ళ పనులు మానుకోవలసినందుకు తిట్టుకుంటూ కోర్టుకు వచ్చారు.విచారణ ప్రారంభం అయే లోపు వాళ్ళు దేనిని గురించి ఆలోచిస్తున్నారు? జూరీలలో యిద్దరు వ్యాపారస్థులు, ఉన్ని ధర ఎలా ఉంది అని మాట్లాడుకొంటున్నారు. కొందరు వాతావరణం గురించి మాట్లాడుకొంటున్నారు.ఒక జూరీ సభ్యుడు మరొకణ్ణి పలకరిస్తూ, ‘నీవూ యిరక్కపోయావా? తప్పించకోడం వీలుకాలేదా?’, అని అడుగుతాడు హేళనగా. ప్రధానన్యాయమూర్తి ఆ రోజు విచారణ త్వరగా ముగించి వెళ్ళిపోయే తొందరలో ఉన్నాడు.ఆయనకు ప్రియురాలినుండి పిలుపు వచ్చింది, సాయంత్రం ఆరు లోపల కలుసుకొమ్మని. మరో జూరీసభ్యుడు, రావడం ఆలస్యమైంది. ఆ రోజు ఆయన భార్య యింటి ఖర్చుకు మరి కొంత డబ్బు కావాలంది. ఇవ్వకపోతే ఈ రోజుకు వంట లేదు అన్నది. ఇదీ,  ఒక హత్యానేరవిచారణ చేయడానికి వచ్చినవారి శ్రద్ధ, ప్రధాననిందితురాలి జీవన్మరణ నిర్ణయసమయంలో వారి మనస్స్థితి. జడ్జి తీర్పులో రాయవలసిన ఒక  మాటను వదిలివేశాడు.  ‘నిందితురాలు నేరం చేసినట్టు ఋజువయింది’. కాని “ఆ నేరం బుద్ధిపూర్వకంగా చేసినదికాదు” అన్నమాట చేర్చనందువలన , ఆ లోపాన్ని ఆమె లాయరుగాని,  జూరీగాని  గమనించనందున,  సామాన్యమైన శిక్ష  కఠినశిక్షగా మారింది!
     ఏ సమాజవ్వవస్థ కూడా మనిషిని మనిషిగా చూడడంలేదు, సహానుభూతి చచ్చిపోయింది, అన్న ఆవేదన వ్యంగ్యంలో దాచి ప్రదర్శిస్తాడు టాల్స్టాయ్. ప్రభుత్వయంత్రాంగమంతా ఒకే పనిలో తత్పరమై పనిచేస్తుంది.ఏమిటా పని? మనిషిలోని మనిషిని చంపడం, వేతనాలిచ్చి చంపించడం.  నవల ప్రారంభంలో చెప్పుకున్న రెండు ముద్దుల ముచ్చట యిక్కడ ప్రస్తుతం. మొదటి ముద్దు  నెఖ్లుడోఫ్ సహజస్వచ్ఛభావాలు గల వయసులో,స్థితిలో జరిగింది. రెండవ ముద్దు అతడు ఆర్మీలో మూడుసంవత్సరాలు  పనిచేసిన తరువాత. మిలిటరీసర్వీసులో  అతడు ‘ఆరోగ్యవంతమైన పశువు’గా తీర్చి దిద్దబడ్డాడు. అదీ, మిలిటరీ సర్వీస్ ప్రభావం. మనిషిని పశువుగా మార్చేది ఒక్క మిలిటరీసర్వీసు మాత్రమే కాదు.  అన్ని రాజ్యవ్యవస్థలు చేసేది అదే పని. రచయిత  ఆవేదన  క్రమంగా ఆగ్రహంగా మారి సమాజవ్వస్థలనన్నిటిని ఆక్రమిస్తుంది--.జైళ్ళు, పోలీసు,సైన్యం, ప్రభుత్వపరిపాలనానిర్వహణ, చివరకు  రాజు. రాజ్యాంగంతో ఆగదు.మతము,  మతాధిపతుల హైన్యము వంచన కూడా  టాల్స్టాయ్ ఆవేదనకు ఆగ్రహానికి గురి అవుతాయి.   జైళ్ళలో దుర్గంధము, అధికారుల అమానుషత్వము అవినీతి నెఖ్లుడోఫ్ ప్రత్యక్షంగా అనుభవించాడు. చిన్నచిన్న నేరాలకు ( ఒక భూస్వామి పొలంలో ఎవడిదో పశువు మేస్తుండినదని, వాడికి  ఏళ్ళతరబడి జైలుశిక్ష. ) మేస్లోవాను సైబీరియాకు తీసుకుపోతున్నపుడు, ఆమెను  అనుసరిస్తూ నెఖ్లుడోఫ్ చూచిన దృశ్యాలు, వాటిని  టాల్స్టాయ్ వర్ణించిన విధం ఆయన ఆవేదనను  ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాయి. ముఖ్యంగా, వేలమంది ఖైదీలను సైబీరియాకు తరలించే దృశ్యం,  మరచిపోలేని విధంగా, అసదృశంగా వర్ణిస్తాడు. టాల్స్టాయ్  వర్ణన అంటే తన మాటలలో చెప్పడం ఉండదు. ఆయన దృశ్యాన్ని మన ముందుంచుతాడు.దీనిని గురించి పైన చెప్పుకొన్నాం.
             పశువులలా ఖైదీలు. పశువులలా పోలీసులు.ఎవరిని చూసి జాలిపడవలె?(అందుకే అన్నారేమో, సమజమని!)
      ఈ ఆగ్రహప్రయాణవర్ణన ప్రయోజనం? టాల్స్టాయ్ రష్యన్ ప్రజలలో విప్లవజ్వాలలు రేకెత్తించవలె అని  రాసిన నవలా యిది?
       టాల్స్టాయ్ ఆగ్రహం లౌకికవ్వవస్థలతో ఆగిపోదు. పారలౌకికాన్ని కూడా ఆవహిస్తుంది. చర్చిని,  క్రైస్తవమతప్రచారంలోని ఆత్మవంచనను కూడా ఎండగడతాడు, నవల చివరిభాగంలో ఒక అధ్యాయంలో. ఒక ఆంగ్లక్రైస్తవప్రచారకుడు,  గవర్నర్ ను తాను అక్కడి  జైళ్ళలోని స్థితిగతులను అధ్యయనం చేయడానికి వచ్చానని, అనుమతించవలె అని అడిగి, అనుమతిపొందుతాడు.కాని  జైలులో అతడు రహస్యంగా బైబిల్ కాపీలు పంచుతాడు ఖైదీలకు. క్రీస్తుసందేశాన్ని  ప్రచారం చేయడానికి, అసత్యాన్ని  కాపట్యాన్ని అవలంబిస్తాడు. అంటే రాజ్యవ్యవస్థలే  కాదు, చర్చి కూడా  కుళ్ళుతో  కాపట్యంతో నిండిపోయింది. అన్ని వ్యవస్థలపై అసహ్యము ఆగ్రహము కలుగుతోంది నెఖ్లుడోఫ్ కు. టాల్స్టాయ్ ని  "క్రైస్తవ అరాచకవాది" (“Christian Anarchist”,) అనడానికి, ఈ ఆగ్రహమే కారణం.
    నవలలో వెనుక ఒక  అధ్యాయంలో  ( “JUST A WORTHLESS TRAMP”)ఇటువంటి  "క్రైస్తవ అరాచకవాది" పాత్రను ప్రవేశపెడతాడు టాల్స్టాయ్.సమస్త రాజ్యవ్యవస్థలనే కాదు, మతవ్యవస్థను కూడా “నేతినేతి” అనుకొంటూ సర్వావస్థావర్జితుడైన “ఒక క్రైస్తవసూఫీ” లేక ఒక సిద్ధుడు ఆ  Tramp పాత్ర.  ఇక్కడ ఒక ప్రశ్న.టాల్స్టాయ్ “అరాచకవాదే” అయితే, ఆయన ఈ నవలలో ఉద్దేశించింది అదే అయితే, ఈ “క్రైస్తవసూఫీ” (Tramp) అధ్యాయంతో నవల ముగించిఉండవలె కదా? కాని, నవలను  యిక్కడ ముగించలేదు.

ముగింపు

    నవల చివరి అధ్యాయం. నెఖ్లుడోఫ్ ఆరోజు జైలునుండి తన గదికి వచ్చాడు. కోటు విప్పుతూ, కోటుజేబులోని బైబిల్ కాపీ, ఆ ఆంగ్లక్రైస్తవప్రచారకుడు జైలులో యిచ్చినది, విసుగుగా విసిరి టేబుల్ మీద పడేశాడు. కటూషాతో తన కథ ముగిసింది. ఆమె నిరాకరణ అతనికి బాధగాను అవమానంగాను కూడా ఉంది. అది ఒక వైపు. ఈ మధ్య జైళ్ళలో, ఖైదీల కష్టాలు, అధికారుల అమానుషత్వం అతని మనసును మథిస్తున్నాయి. సమాజంలో చెడు విర్రవీగుతోంది. దానిని ఎలా  అణచాలి? అసలు వీలవుతుందా? తన జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. ఇప్పుడు అతడి జీవితంలో ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోవలసిన క్షణం.టేబుల్ మీద ఉన్న  బైబిల్ ను అందుకున్నాడు.దానిలో Sermon on the Mount భాగం తీసి అందులో క్రీస్తు బోధలను చదివి, వాటికి అనుగుణంగా నడచుకోవడం ఒక్కటే మార్గమని, ఆమార్గంలో నడవాలని నిశ్చయించుకుంటాడు. క్రైస్తవమతాన్ని, మతప్రచారంలోని  కాపట్యాన్ని అసహ్యించి అవహేళన చేసిన టాల్స్టాయ్, నవలను ఈ సుదీర్ఘమైన బైబిల్ పాఠంతో ముగించడంలో పరమార్థమేమిటి?ఆయన “క్రైస్తవ అరాచకం”లో క్రైస్తవమెంత, అరాచకమెంత? ఏమిటి ఈ నవల ముగింపులోని సందేశం?
          నెఖ్లుడోఫ్ టేబుల్ మీద ఉన్న ఆ బైబిల్  కాపీని అందుకోడంలో ఒక కీలకమైన, నవలకు ప్రాణభూతమైన,  సంకేతం ఉంది. ఆ బైబిల్  ఆంగ్లక్రైస్తవప్రచారకుడు జైలులో ఖైదీలకు  పంచుతూ తనకూ యిచ్చిన కాపీ. తన గదికి వస్తూనే,కోటువిప్పుతూ తన కోటు జేబులోనుండి తీసి టేబుల్ మీదికి విసుగుగా విసిరి వేసిన కాపీ. ఆ బైబిల్ కాపీనే నెఖ్లుడోఫ్ తన చేతిలోకి తీసుకోవడం ఒక సంకేతం.ఆ తీసుకోవడం,  తాను వెనుక "విసిగి విసిరివేసిన" చర్చిని క్రైస్తవాన్ని   స్వీకరించడానికి మాత్రమే  సంకేతం కాదు. ఆ కాపీ తాను తన మనసులో ఒక క్షణం క్రితం వరకు తిరస్కరించిన  సమస్తసామాజికవ్యవస్థలకు ఉపలక్షకం. అంటే, వెనుక తిరస్కరించినవాటినన్నిటినీ స్వీకరిస్తున్నాడని సంకేతమా? వెనుక ఆగ్రహకారణాలైన అన్యాయాలకన్నిటికీ తలవొగ్గమనే అర్థమా? కాదు.అన్యాయంపట్ల అమానుషత్వం పట్ల  అసహ్యము ఆగ్రహము కలగకపోవడం అసహజం. మానవత లోపించడమే. కాని,ఏ సమాజంలోనూ  ఏ కాలంలోనూ  అవ్యవస్థ అన్యాయం  అమానుషత్వం ఉంటూనే ఉంటాయి.వ్యక్తి  వాటిపై ఆగ్రహిస్తూ వాటిని ఎదురిస్తూ ఉండవలసిందే. పోలీసు, కోర్టులు, సైన్యము, పరిపాలనాయంత్రాంగము, ఈ వ్యవస్థలనన్నిటినీ నడిపించే అమానవత, యివన్నీ ఏదో ఒక రూపంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి."హుష్ కాకి" అంటే ఎగిరి పోయేవి కావు. మనిషిలోని మానవతకు పరీక్షగా నిలిచిఉంటాయి. కాని,  ఎటువంటి అవ్యవస్థలోనూ వ్యక్తి  వ్యక్తిగా ఎదగగలడు, ఎదగవలె. ముక్తి  వ్యక్తికే గాని, వ్యవస్థకు లేదు.సృష్టిలో  ద్వైవిధ్యం  వదలదు, వదిలిపోవలసింది ద్వైధీభావం.  వ్యక్తికి  ఈ  ఎరుక ఎలా కలుగుతుందో ఎప్పుడు కలుగుతుందో తెలీదు. అది ఒక్క క్షణంలో, మెరుపులాగా కలుగుతుంది. నెఖ్లుడోఫ్ కు  ఆ "ఎరుకమెరుపు" మెరిసింది.("అది అయింది","It happened ") ఆ తరువాత జీవితం మరో జీవితమే, పునరుత్థానమే."Resurrection."
     

నవల:రూపము, వస్తువు (Form and Content)

    ఈ నవల గురించి సాధారణ అభిప్రాయం, ఇది రచయిత తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఒక పాత్రను సృష్టించుకొన్నాడు, కనుక నవల ఒక ఉపన్యాసంగా ఒక సామాజికకరపత్రంగా తయారైంది అని. ఇది సరి అయిన అభిప్రాయం కాదు. నిజానికి, ఈ నవలలో ప్రసిద్ధమైన తక్కిన రెండు నవలలో వలె ఉపన్యాసాలు లేవనే చెప్పాలి. ఈ నవలలో రచయిత అభిప్రాయాలు వాస్తవంలో కథానాయకుడి అంతర్మథనంలో అంతర్భాగమే.పాత్ర ఎదుగుదలలో భాగం. ఇక, ఈ నవల రాసేనాటికి  టాల్స్టాయ్  సృజనాత్మకప్రజ్ఞ మందగించిందని, కళాత్మకంగా వస్తువును ఆవిష్కరించలేకపోయాడని కూడా సాధారణ అభిప్రాయం. ఇది కూడా,పాఠకుడు రచనలోని శిల్పాన్ని, ముగింపులోని ప్రాణభూతమైన సంకేతాన్ని , గుర్తించలేకపోవడమేగాని,రచయిత  ప్రజ్ఞ మందగించడం కాదనిపిస్తుంది. రచయిత  అనుకున్నట్టు  నవల నెలలు నిండకముందే బయటపడలేదు, విమర్శకులన్నట్టు  అది ఒక బృహద్గ్రంథంలోని  శకలము కాదు. అది సకలము సంపూర్ణము.
      టాల్స్టాయ్  ప్రజ్ఞ ఏమాత్రము తరగలేదు.వయ:పరిపాకంతో జీవితదృక్పథం పరిణతమై, అనుగుణంగా శిల్పం పదునైంది. మేస్లోవా నెఖ్లుడోఫ్ ల ముగ్ధప్రథమప్రణయసన్నివేశవర్ణనలలో టాల్స్టాయ్   పాటవం ఏ మాత్రము తగ్గలేదు.ఆ పాత్రలవలె , ప్రేమలో ఎదిగి ఒదిగినవారు సాహిత్యంలో అరుదు.జార్ ప్రభుత్వంలోని అమానుషత్వాన్ని, ఆ పరిస్థితులలో పాత్రలు ఎలా నలిగారు, ఎలా ఎదిగారో, ఈ రెంటినీ పడుగుపేకలలాగా అల్లడంలో అద్భుతమైన రచనా శిల్పాన్ని ప్రదర్శించాడు టాల్స్టాయ్.  రూపము వస్తువు కలిసి ఎదిగిన అపురూపరచన  టాల్స్టాయ్  నవల.
    టాల్స్టాయ్ పై దోస్తోవ్ స్కీ ప్రభావం   ఈ నవలలో బలంగా కనిపిస్తుంది. ( కథలో, నెఖ్లుడోఫ్ మొదటిసారి కటూషాను కలిసినపుడు ఆమెకు దోస్తోవ్ స్కీ నవలలు యిస్తాడు.) కాని ఎవరి శైలి వారిదే. నెఖ్లుడోఫ్  రాస్కోల్నికోఫ్ కాడు, డిమిట్రి కాడు. ఇతనిలో వారిలో వలె తీవ్రమైన అంతర్మథనం ఉండదు. క్రమంగా బుద్ధిని శిక్షించి తనను తాను మలచుకుంటాడు.
     ఖైదీల కష్టాలను మరీ దీర్ఘంగా వివరిస్తున్నాడు అనిపించ వచ్చు, అక్కడక్కడా.చివరి బైబిల్ పాఠం మరీ స్కూలుపిల్లల పాఠంలా అనిపించవచ్చు. మొదటి సారి నవల చదివేటప్పుడు ఆ భాగాలను దాటెయ్యవచ్చు. మహాభారతం మొదటిసారి చదినప్పుడు శాంతిసప్తకం ఎంతమంది చదువుతారు? కాని భారతంలో ఆ శాంతిని తొలగించగలమా? "" యుద్ధషట్కము శాంతిసప్తకము పడుగుపేకగా అల్లిన నవల "పునరుత్థానం",(The Resurrection )
     కావ్యానికి పరమప్రయోజనం పాఠకుడి శిక్షితచిత్తం. ( మహాభారతాన్ని ముగిస్తూ తిక్కన యిదే అంటాడు, "శిక్షితచిత్తులార!", అని.) టాల్స్టాయ్  నవలకు  ఫలం ఆ శిక్షితచిత్తమే. శిక్షలో ప్రక్షాళనమై చిత్తం శాంతస్స్థితిని పొందుతుంది. ఆ శాంతంలోనే పర్యవసిస్తుంది  ఈ నవల.
         " యుద్ధము శాంతి" కంటే ఈ నవల ఎక్కువ కష్టం కాదు,చదవడం.  చదవకపోవడం గొప్ప నష్టం.